Latest Updates
-
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే!
పెరుగులో దాగి ఉన్న గొప్ప ఆరోగ్య రహస్యాలు
పెరుగులో దాగి ఉన్న గొప్ప ఆరోగ్య రహస్యాలు
పెరుగు ప్రాచీన కాలంనుండి అద్భుతమైన పోషక విలువలతో మానవాళికి మంచి ఆహారంగా ఉపయోగపడుతోంది. పెరుగులో దాగున్న అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు గురించి మనకు చాలా విషయాలుతెలుసు. ముఖ్యంగా ఇండియాలో కొన్ని స్టేట్స్ లేదా ప్రదేశాల్లో నివసించే ప్రజలు తీసుకొనే ప్రతి భోజనంతో పాటు పెరుగు తప్పనిసరిగా తీసుకుంటున్నారు . పెరుగును వివిధ రకాలుగా తీసుకోవడం ఉత్తమం. ఇలా తీసుకోవడం వల్ల మీ జీవనశైలిలో మీకు అవసరం అయ్యే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
ఎవరైతే ల్యాక్టోజ్ లోపంతో బాధపడుతున్నారో, అటువంటి వారు కూడా పెరుగును ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు . ఆహారంతో పాటు తీసుకోవడంతో పాటు, వివిధ రకాల హోం రెమెడీస్ తో తీసుకోవడం వల్ల పెరుగుతో అనేక ప్రయోజనాలున్నాయి.
అది ఆవు పాలు లేదా గెదెపాలతో వేటితో తయారుచేసిన పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల , ఆరోగ్యకరమైన శరీరంను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది . నిజానికి, పాలను మరిగించినా కూడా అందులోని పోషకాలు ఏమాత్రం తగ్గవు. కాబట్టి, మహిళలు మీరు ఇంట్లో తయారుచేసే వివిధ రకాల వంటలు, కర్రీస్ లలో పెరుగును చేర్చడం మర్చిపోకండి ...మరి పెరుగులోని ఆ అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

జీర్ణశక్తిని పెంచే పెరుగు:
పెరుగు శరీరానికిచల్లదాన్ని కలిగించి, జీర్ణశక్తిని పెంచుతుంది. తర్వాత ఆహారాన్ని శరీరం గ్రహించేందుకు సహాయపడుతుంది . నిజానికి మీరు స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు, పెరుగు తీసుకోవడం చాలా ఉత్తమం. స్పైసీ బిర్యానీ తిన్నప్పుడు, పెరుగును తీసుకోవడం మర్చిపోకండి.

గుండె ఆరోగ్యానికి చాలా మంచిది:
పెరుగు గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ క్రమబద్దం చేయడానికి సహాయపడుతుంది. పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. పెరుగువల్ల ఇది ఒక గొప్ప న్యూట్రీషియనల్ బెనిఫిట్

వ్యాధినిరోధకతను పెంచుతుంది:
శరీరం యొక్క రోగనిరధక శక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది పెరుగు. మరియు మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

క్యాల్షియంకు ముఖ్య మూలం:
పెరుగులో క్యాల్షియం మరియు ఫాస్పరస్ అంశాలు అధికంగా ఉంటాయి . కాబట్టి, ఈ రెండూ కూడా ఎముకలను మరియు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.అటువంటి సమస్యలను మీరు నివారించుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీరెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం ఉత్తమం.

బహిర్గతంగా ఉపయోగించడానికి మంచిది:
చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి బహిర్గతంగా పెరుగును ఉపయోగించుకోవచ్చు . పెరుగు మరియు నిమ్మరసం కాంబినేషన్లో ఫేస్ ప్యాక్ వేసుకోవడంవల్ల ముఖానికి మంచి గ్లో వస్తుంది . వారానికి రెండు సార్లు, ఒక నెలపాటుచేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చుండ్రును నివారిస్తుంది:
ఇది ఒక గొప్ప యాంటీ డాండ్రఫ్ సొల్యుషన్ . కొంత పెరుగును తలకు పట్టించి, మసాజ్ చేసి తలస్నానం చేయడం వల్ల చుండ్రు పూర్తిగా నివారించబడుతుంది.

బరువు తగ్గిస్తుంది:
ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది, అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్ లో పెరుగుచేర్చుకోవడం కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది .

ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది . పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది . పెరుగు వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం . ఇది శరీరంలోపలకూడా చల్లని అనుభూతిని కలిగిస్తుంది.

పైల్స్ నివారిస్తుంది:
పైల్స్ తో బాధపడే వారు, వారి రెగ్యులర్ డట్ లో పెరుగు చేర్చడం వల్ల చాలా సహాయపడుతుంది. పెరుగుతోపాటు, కొద్దిగా అల్లం చేర్చుకొన్న మంచి ఫలితం ఉంటుంది.

ఓరల్ సమస్యలు:
ఓరల్ సమస్యలను పెరుగు నివారిస్తుంది. బ్యాక్టీరియ సంబంధిత దంత సమస్యలను నివారించడంలో పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది .

ఆకలిని పెంచుతుంది:
ఆకలిని పెంచడానికి పెరుగులో ఉప్పు లేదా పంచదార మిక్స్ చేసితీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications