Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
వర్షాకాలంలో ఆకుకూరలు తినకపోవడానికి గల 6 కారణాలు
వర్షకాలంలో ఆకుకూరలకు తగినంత సూర్యరశ్మిలేకపోవడం వల్ల ఆకుకూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుందని ఆహార నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా కలుషిత నీరు, కాలువల్లో పండిస్తారు కాబట్టి, బ్యాక్టీరియా చాలా త్వరగా చేరడానికి కారణం అవుతుంది.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు ఆకులు కలిగిన గ్రీన్ లీఫ్స్ చాలా దగ్గరదగ్గరగా అరలి వుండటం వల్ల వాటిలోపలి సన్నక్రిములు చేరడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా న్యూట్రీషియన్ వెజిటేబుల్స్ లో మట్టిలో మరియు ఎక్కువ నీరు గల ప్రాంతంలో పండిస్తారు కాబట్టి క్రిములు చాలా త్వరగా, తిష్టవేస్తాయి.
READ MORE: వర్షాకాలంలో పాటించవలసిన 10 ఆరోగ్యం చిట్కాలు
వర్షాకాలంలో గ్రీన్ లీఫ్స్ లో క్రిములు చాలా త్వరగా చేరుతాయి. ఇలాంటి ఆహారాలను మనం తిన్నప్పుడు, అనేక రకాల స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతుంది.
READ MORE: వర్షాకాలాన్ని ఆయుర్వేదంతో ఎంజాయ్ చేయండి
అందువల్ల, వర్షాకాలంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తినాల్సి వచ్చినప్పుడు, వేడినీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వంపేసి తర్వాత బాగా ఉడికించి తినాలి. వర్షాకాలంలో గ్రీన్ లీఫ్స్ తినకుండుటకు మరికొన్ని కారణాలు ఈ క్రింది లిస్ట్ లో ....

బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతాయి:
వర్షాకాలంలో తప్పనిసరిగా ఆకుకూరలు తినకుండుటకు ప్రధాణ కారణం బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతాయి. ఆకుల మద్య పరిశీలించినట్లైతే బ్యాక్టీరియా దాగి ఉంటుంది.

చిత్తడి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి:
వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా చిత్తడి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి. సూర్యకాంతి లేకపోవడం వల్ల బ్యాక్టీరియా చాలా త్వరగా చేరుతుంది. కాబట్టి, వీటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి.

కలుషితమైన ప్రాంతంలో నిల్వ చేయడం:
ఆకుకూరలు చల్లని వాతావరణంలో ఉంచినప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. అయితే వాటిని నిల్వ చేసే ప్రదేశం శుభ్రంగా లేకపోతే ఆకుకూరలు కలుషితం అవుతాయి. పాచిపోవడం జరగుతుంది. ఇవి ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.

కీటకాలు లేదా సన్నని క్రిములు వృద్ధి చెందుతాయి:
కాలీఫ్లవర్, బ్రొకోలీ వంటి లీఫీ వెజిటేబుల్స్ లో చిన్న చిన్న సన్నని పురుగులు చేరి ఆహారంగా తింటుంటాయి . ఈ రెండు హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలనుకుంటే, ఈ వెజిటేబుల్స్ ను వేడినీళ్ళలో ఉప్పు వేసి ఆనీటిలో వేసి శుభ్రంగా కడిగి తర్వాత వాడుకోవాలి.

కలర్ ఇంజక్షన్స్ :
ఆకుకూరలకు మరింత ముదురు వర్ణం కోసం కలర్ ఇంజక్షన్స్ ను వేయడం వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. ప్రేగులను బలహీనపరుస్తాయి. నిధానంగా కిడ్నీలను పాడు చేస్తాయి.

అవుట్ సైడ్ డిష్ లు:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వంటలను (రెడీమేడ్ వంటలను) బయట ప్రదేశాల్లో కొనకపోవడమే మంచిది. హోటల్స్, రెస్టారెంట్లలో గ్రీన్ లీఫ్స్ ను సరిగా శుభ్రం చేయకపోవచ్చు . అందువల్ల స్టొమక్ ఇన్ఫెక్షన్స్ మరింత తీవ్రం అవుతాయి.



Click it and Unblock the Notifications
