Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఎనర్జీని అందించే 14 బ్రేక్ ఫాస్ట్ సమ్మర్ ఫుడ్స్
సవికాలంలో ప్రారంభమైనది, ఏప్రిల్ లోనే ఎండలు మండుతున్నాయి. ఇంకా మే వచ్చే సరికి విపరీతమైన ఎండలు ఉండటం వల్ల శరీరంలో నీరు మొత్తం చెమట రూపంలో ఖాలీ అవుతుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్ సమస్యకు కారణం అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల లోబిపి, డయోరియా, అలసట, నీరసం, బద్దకం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వేసవి సీజన్ వచ్చే జబ్బులను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది.
అలా జరకుండా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకోసం వేసవి కాలంలో కొన్ని హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలి . దినచర్మలో ప్రతి రోజూ ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉదయం తీసుకొనే ఆహారంలోని అన్ని రకాల న్యూట్రీషియన్స్, ప్రోటీనులు ఈ సమయంలో శరీరం గ్రహించబడుతుంది. ఉదయం సమయంలో జీర్ణక్రియ చాలా వేగవంతంగా ఉంటుంది. కాబట్టి ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయని కొన్ని పరిశోధనల ద్వార వెల్లడైంది. ఉదయం సమయంలో మెటబాలిజం రేటు ఎక్కువగా ఉంటుంది. దాంతో అన్ని రకాల ప్రయోజనాలు, న్యూట్రీషియన్స్ పొందడం ద్వారా గ్రహించవచ్చు .
READ MORE:కడుపు నింపి శక్తినిచ్చే 20 బెస్ట్ మార్నింగ్ ఫుడ్స్
కాబట్టి, శరీరానికి రోజంతా సరిపడే ఎనర్జీని అందించే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఈ ఆహారాలు తినడం ద్వారా రోజంతా యాక్టివ్ గా ఉండి నిద్రమత్తును వదిలించుకోవాలి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి కొద్దిగా సమయంను కేటాయించండి .మరి ఈ వేసవి సమయంలో మనకు ఎనర్జీ అందించి మనల్ని చురుకుగా ఉంచే ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం..

ఆరెంజ్ జ్యూస్ :
వేసవికాలంలో ఉదయం తీసుకొనే అల్పాహారంలో ఇలాంటి డ్రింక్స్ తీసురోవడం చాలా మంచిది. ఇది మీ శరీరంను హైడ్రేట్ చేస్తుంది. మరియు శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి అందిస్తుంది . పనిచేసేప్పుడు మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచి మిమ్మల్ని యాక్టివ్ గా ఉండేందకు సహాయపడుతుంది. కాబట్టి, బ్రేక్ ఫాస్ట్ కోసం ఇది ఒక హెల్తీ జ్యూస్ .

వాటర్ మెలోన్:
పుచ్చకాయ రోజంతా మిమ్మల్ని హైడ్రేషన్ లో మరియు ఎనర్జిటిక్ గా ఉండేందకు సహాయపడుతుంది .పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే ఎంజైమ్ హార్ట్ కు మరియు కంటి చూపుకు చాలా మంచిది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది . ఉదయం అల్పాహారానికి ఇది ఒక హెల్తీ ఫ్రూట్ .

బెర్రీస్ :
బ్రెర్రీస్ ను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా ఆ రోజంతా మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా యాక్టివ్ గా ఉంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ ఉన్నాయి . మరియు క్యాలరీలు తక్కువ న్యూట్రీషియన్స్ ఎక్కువ.

పెరుగు:
పెరుగులో ప్రోటీన్స్, క్యాల్సియం మరియు విటమిన్స్ అధికం. జీర్ణం అవ్వడానికి చాలా సులభం మరియు వ్యాధినిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. మరియు ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల వేసవికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. రోజంత ఎనర్జిటిక్ గా ఉంచతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఇది ఒక బెస్ట్ ఫుడ్.

గ్రీన్ టీ :
ఉదయం గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శారీరంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను నివారిస్తుంది. మరియు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం . ఇది మైండ్ అండ్ బాడీని రిఫ్రెష్ చేయడం ద్వారా రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది.

ఫ్లాక్ సీడ్స్ :
ఫ్లాక్స్ సీడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది . వీటిలో చాలా మంచి ఫ్లేవర్ ఉండటం వల్ల ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ , ఓట్స్, స్మూతీస్ మరియు మిల్క్ షేక్స్ లో చిలకరించి తీసుకోవాలి.

కివి:
కివీ పండ్లలో విటమిన్ సి, పొటాసియం మరియు కాపర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. కివి పండ్లను సలాడ్ లేదా అరటి లేదా స్ట్రాబెర్రీతో కలిపి స్మూతీస్ తయారుచేసుకొని తీసుకోవచ్చు.

పీనట్ బటర్ :
పీనట్ బటర్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే రోజంతటికి అవసరం అయ్యే ఎనర్జీని సప్లై చేస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ అధికం కాబట్టి, ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ టోస్ట్, బ్రెడ్ వాటికి మీద దీన్ని రాసుకొని తినవచ్చు.

గ్రేప్ ఫ్రూట్:
గ్రేఫ్ ఫ్రూట్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే శరీరంలో రక్తంలోని షుగర్ లవెల్స్ కంట్రోల్లో ఉంటాయి . ఇది బరువు కంట్రోల్ చేస్తుంది అదే సమయంలో ఎనర్జీని అందిస్తుంది . బరువు తగ్గించుకోవడానికి ఉదయం తీసుకొనే హెల్తీ ఫుడ్స్ లో ఇది ఒకటి.

గుడ్లు:
గుడ్లలో ప్రోటీన్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ అధికం. ఉదయం గుడ్డు తినడం వల్ల , ఆరోజంతటికి అవసరం అయ్యే ఎనర్జీని నిధానంగా విడదుల చేస్తుంది . బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం చాలా మంచిది.

ఓట్ మీల్స్:
రోజంతా ఎనర్జి అందివ్వడంలో ఓట్ మీల్ ఒక సూపర్ ఫుడ్ . వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్స్, మరియు పొటాషియం అధికంగా ఉంటాయి . ఇవి కొలెస్ట్రాల్ వెల్స్ ను తగ్గించి హార్ట్ ను హెల్తీగా ఉంచుతాయి

త్రుణధాన్యాలు:
త్రుణధాన్యాలతో తయారుచేసే వైట్ బ్రెడ్ ఫైబర్, ఐరన్, విటిమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోజంతా అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది

గోధుమలు:
గోధుమల్లో విటమిన్ ఇ మరియు ఫొల్లేట్ అధికంగా ఉంటుంది . దీన్ని పెరుగు లేదా పాలతో తీసుకోవచ్చు . అప్పుడే మిమ్మల్ని యాక్టీవ్ గా ఉంచి హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది.

అరటి
అరటి పండ్లలో పొటాసియం అధికంగా ఉంటుంది. ఇది రోజంతటికి అవసరం అయ్యే ఎనర్జిని శక్తిని అందిస్తుంది.



Click it and Unblock the Notifications
