Latest Updates
-
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026
మీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన జీరో కొలెస్ట్రాల్ ఫుడ్స్
కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు కామన్ గా వినిపిస్తున్న ఇష్యూ. గతంలో కొలెస్ట్రాల్ తో బాధపడేవాళ్ల సంఖ్య చాలా అరుదుగా ఉండేది. కానీ.. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, డైటింగ్ హ్యాబిట్స్, వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల.. కొలెస్ట్రాల్ సమస్య చాలా యంగ్ ఏజ్ లోనే చుట్టుముడుతోంది. కొలెస్ట్రాల్ ఉందంటే.. చూడటానికి అసహ్యంగా కనిపించడమే కాదు.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ రాకుండా అరికట్టడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అయితే కొన్ని ఫుడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. కానీ కొన్ని ఆహారాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీ ఎల్ లెవెల్ ని శరీరంలో తగ్గిస్తాయి. ఫేమస్ న్యూట్రీషన్స్.. కొన్ని రకాల జీరో కొలెస్ట్రాల్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఈ జీరో కొలెస్ట్రాల్ ఫుడ్స్ ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు.

బంగాళదుంపలు
బంగాళదుంపలను చాలామంది ఎవైడ్ చేస్తుంటారు. కానీ.. వీటిలో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఫ్రై చేసిన మాత్రం తీసుకోకూడదు. కాబట్టి బంగాళదుంపలను ఉడికించి తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

టమోటాలు
టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. లైకోపిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. కాబట్టి సలాడ్స్, సాండ్ విచ్ లు, సైడ్ డిష్ గా టమోటాలను తీసుకోండి. వీలైతే.. టమోటా జ్యూస్ తాగితే.. మంచిది.

స్పినాచ్
స్పినాచ్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఇవి సహాయపడతాయి. ఫైటోస్టెరాల్స్, ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది ఫ్యాట్ ఫ్రీ. కాబట్టి.. దీన్ని డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.

బీన్స్
బీన్స్, బఠాణీలు, గింజలలలో జీరో కొలెస్ట్రాల్ మాత్రమే కాదు.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. పాస్తా, సలాడ్స్ రూపంలో వీటిని ఖచ్చితంగా తీసుకోవడం మంచిది.

అవకాడో
అవకాడోలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.

సోయా బీన్స్
సోయా బీన్స్ లో శ్యాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రొటీన్స్ ని శరీరంలో పెంచడం మాత్రమే కాదు.. 8 నుంచి 10 శాతం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

ఓట్ మీల్
ఓట్ మీల్ లో సొల్యుబుల్ ఫైబర్ మాత్రమే కాదు.. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. లేదా ఓట్ బ్రాన్ ని పెరుగపై చల్లుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి
చెడు కొలెస్ట్రాల్ ని శరీరంలో తగ్గించడంలో వెల్లుల్లి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే హార్ట్ డిసీజ్ రిస్క్ ని తగ్గిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్
ఫ్లాక్స్ సీడ్స్ లో ఆల్ఫా లినోనెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కాబట్టి రోజుకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం మంచిది. పెరుగు, జ్యూస్ లలో కలుపుకుని తీసుకోవచ్చు.

ఫ్రూట్స్
ఫ్రూట్స్ కొలెస్ట్రాల్ తగ్గించే అమేజింగ్ ఫుడ్. అరటిపండ్లు, వాటర్ మిలాన్, నిమ్మ, క్రాన్ బెర్రీస్, ఉసిరికాయ వంటి పండ్లను డైట్ లో చేర్చుకోవాలి. యాపిల్, పీచ్, ప్లమ్ వంటి ఫ్రూట్స్ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. అలాగే ఫైబర్ ని పెంచుతాయి.



Click it and Unblock the Notifications