Latest Updates
-
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్!
మీ డైట్ ని.. ఆహారపు అలవాట్లు మార్చుకునే 7 సులభ మార్గాలు
అలవాటు ప్రకారం ప్రతీ సారీ ఒకే షాపు లో సరుకులు కొనుక్కుంటూ, ఒకే రకమైన ఆహారం తినడానికి అలవాటు పడ్డారా? అయితే మీరు కూడా చాలా మంది పెద్దవాళ్ల లాగే ఆలోచిస్తున్నట్లే. కానీ మీ జీవనవిధానంలో చిన్నచిన్న మార్పులు చేసుకుని బరువు తగ్గాలనుకుంటే మాత్రం పాత అలవాట్లని వదిలిపెట్టాలి.
ఒకే రకమైన ఆహారాలకు అలవాటు పడుంటే కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ వెయిట్ లాస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో, అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పుల గురించి అవగాహన కల్పించుకోండి. ఎలాంటి డైట్, ఆహారపు అలవాట్లు మంచిదో ఇప్పుడే తెలుసుకోండి..

మీ చెడు అలవాట్లేమిటో తెలుసుకోండి
మీకు చెడు అలవాటు ఉంది అని ఒప్పుకోవడం మొదటి మెట్టు. దానిని వదిలించుకోవడానికి మార్పులు చేసుకునే ముందు అసలు మీరు ఏమి తప్పు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెడు ఆహారపు అలవాట్లను ఒక లిస్టు రాసుకుని వాటికి ఖచ్చితమైన కారణాలేమిటో గుర్తించండి. ఉదాహరణకి మీరు మధ్య రాత్రులు ఫ్రిజ్ మీద దాడిచేస్తున్నారంటే, ఇన్ సోమ్నియా(నిద్ర లేమి), ఒత్తిడి, రాత్రి భోజనం సరిగ్గా తీసుకోకపోవడం కారణాలు.

ఒక్కో మెట్టూ ఎక్కండి
మీలో చాలా సంవత్సరాల నుంచీ పేరుకుపోయిన చెడు ఆహారపు అలవాట్లని దిగ్విజయంగా వదిలించుకోవాలంటే ఒక్కొక్క అలవాటు మీద దృష్టి పెడితే విజయం సాధించడానికి అధిక అవకాశాలున్నాయి. సోడా, జ్యూసులు, వేపుడు పదార్ధాలు, ఎక్కువ కార్బో హైడ్రేట్లున్న భోజనం తీసుకోవడం, చక్కెర శాతం ఎక్కువ ఉన్న ఆహారం, బద్ధకంగా కూర్చోవడం ఇలా అన్నింటినీ ఒక్కసారిగా వదిలించుకోవడం వినడానికి బాగానే ఉంటుంది. కానీ అలా కట్టుబడి ఉండటం కష్టం కనుక ఒక ప్రణాళిక వేసుకుని ఒక్కో అలవాటునీ త్యజిస్తూ ముందుకెళ్ళాలి.

తగినంత నిద్ర
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచం లో తగినంత నిద్ర దొరకడం కష్టం.రాత్రి పూట తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన, అలసట వచ్చి ఈ రెండింటివల్లా మీరు అతిగా తినడం,కెఫీన్ లేదా చక్కెర ఎక్కువ ఉన్న పదార్ధాల మీద దాడి చేసే అవకాశం ఉంది.కనీసం రోజూ రాత్రి పూట 7-8 గంటలు నిద్రపోయేటట్లు చూసుకోండి. నిద్ర లేమి సమస్య ఎదురైయితే మీ వైద్యుడిని సంప్రదించండి.ఒక వేళ ఏ రోజైనా మీకు పని ఎక్కువ గా ఉంటే మధ్యలో చిన్న కునుకు తీస్తే ఒత్తిడి తగ్గి అతి ఆకలి పుట్టడం జరగదు.

అల్పాహారం
మీకు ఉదయం అల్పాహారాన్ని దాటవేసే అలవాటు ఉంటే అది మానుకుని రోజులో అతి ముఖ్యమైన భోజనమైన ఉదయపు అల్పాహారంతో మీ రోజుని ప్రారంభించండి.ఉదయపు వేళల్లో అల్పాహారం తినేవారు తినని వారికంటే త్వరగా బరువు తగ్గుతారని నిరూపించబడింది.ఫైబర్ అధికం ఉండే చియా సీడ్స్,ఫ్లాక్స్ సీడ, ఓట్స్,పళ్ళని అధికం గా తీసుకోవడానికి ఉదయపు అల్పాహార సమయం అనువైనది.ఒక వేళ మీకు పొద్దున్నే ఏమీ తినాలనిపించకపోతే ఆకు కూరలతో చేసిన గ్రీన్ స్మూతీ ఒక మంచి ఎంపిక.

నీళ్ళు అధికం గా తాగడం
ఇది చిన్న విషయం లా అనిపించచ్చు కానీ మీరు తీసుకునే మంచి నీటి పరిమాణాన్ని పెంచడం ద్వారా ఆరోగ్య కరమైన అలవాట్లకి మీరు దగ్గరవుతారు.మీకు నీళ్ళు చప్పగా అనిపిస్తే కాసిని నిమ్మ కాయలు,నారింజ లేదా దోసకాయలు వేసి ఆ నీటిని తాజా గా మార్చండి.నీరు అధికం గా తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయిలు పెరిగి అలసట ని,తినాలన్న కోరిక ని తగ్గిస్తుంది. ఇంకా మీ చర్మానికి తగినంత తేమని కూడా అందించి చర్మ ఆరోగ్యాన్ని మెరుపరచడమే కాకుండా డీ హైడ్రేషన్ కి గురి కాకుండా కాపాడుతుంది.

ఎక్కువ లీన్(క్రొవ్వు లేని) ప్రొటీన్స్ ని తీసుకోవడం
మీ భోజనం లో లీన్ ప్రోటీన్ ని భాగం చేసుకోవడం ద్వారా మీ కొత్త ఆహారపు అలవాట్లని ప్రారంభించండి.చికెన్ బ్రెస్ట్,నట్స్, గ్రుడ్లు వంటివాటిల్లో ప్రొటీన్ అధికం గా ఉండి అవి తిన్నాకా,మీకు చాలా సేపు ఆకలి వెయ్యదు.

చిన్న చిన్న లక్ష్యాలు
చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ మిమ్మల్ని మీరు ఉత్తేజ పరచుకుంటూ మీ ఆహారం లో మార్పులు చేసుకోండి. లక్ష్యాలని చేరుకున్నప్పుడు మీకు మీరే చిన్న చిన్న బహుమతులిచ్చుకోండి. కానీ ఆ బహుమతి తిండి పదార్ధం కాకుండా చూసుకోండి సుమా.ఉదాహరణకి ఓ 5 కిలోలు తగ్గాకా ఒక కొత్త డ్రెస్ కొనుక్కోండి.ఒక నెలంతా సోడా తాగకుండా ఉన్నారకుంటే స్పా కి వెళ్ళండి లేదా ఒక వారమంతా మానకుండా వ్యాయామం చేస్తే చక్కగా పెడిక్యూర్ చేయించుకోండి.



Click it and Unblock the Notifications
