Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉన్నవారు తినకూడని ఆహారాలు...
రోజూ మన శరీరం ఎన్నో రోగాల బారి నుండి కాపాడబడుతుంది. నిత్యం ఎన్నో రోగక్రిముల నుండి రక్షింపబడుతున్నాము. ఈ ప్రక్రియ అనునిత్యం మన జీవితంలో ఒక భాగం. ఇవన్నీ మన శరీరధారుడ్యాన్ని బట్టి, మంచి అలవాట్లను బట్టి రోగనిరోధక శక్తి వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను మనం దృఢపరచుకోవడానికి కొన్ని నియమాలు, అలవాట్లు పాటించాలి.
మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయంటే మీరు తీసుకునే ఆహారం సరైనది కాదు అని తెలుపుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి నిత్యం తినే ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి.
ఐరన్ లోపం ఉందని తెలిపే హెచ్చరికలేంటి ? అనీమియాకి హోం రెమిడీస్.. !!
మారుతున్న కాలానికి తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. అయితే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జబ్బుల బారి పడుతుంటారు . ఉదాహరణకు రోడ్ సైడ్ తయారుచేసే పానీపూరిలు వారు ఉపయోగించే పదార్థాల వల్ల లేదా నీటి వల్ల లేదా ఇతర హైజీనిక్ లేకపోవడం వల్ల త్వరగా జబ్బు పడుతుంటారు. అందుకు కారణం కాలుష్యం కావచ్చు లేదా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండవచ్చు.
లో ఇమ్యూనిటిని పెంచే 10 మార్గాలు
వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు త్వరగా జబ్బుల బారి, ఇన్ఫెక్షన్స్ బారిన పడుతారు . ముఖ్యంగా తయారుచేసేవిధానంలో, స్టోరింగ్ లేదా కుక్కింగ్ ప్రొసెస్ లో కొన్ని రకాల ఫుడ్స్ బ్యాక్టిరియాకు కారణం అయ్ ఫీవర్, డయోరియా మరియు ఇతర జబ్బులకు కారణం కావచ్చు . ఇలాంటి పరిస్థితులను నివారించుకోవడం కోసం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి . మరి అవేంటో తెలుసుకుందాం..

ఓయిస్ట్రెస్:
కొంత మంది ఆరోగ్య నిపుణులు వ్యాదినిధోక శక్తి తక్కువగా ఉన్న వారు ఇలాంటి సీఫుడ్స్ కు దూరంగా ఉండమని సలహాలిస్తున్నారు . ఇలాంటి సీఫుడ్స్ సరిగా నిల్వచేయకపోవడం వల్ల సూక్ష్మక్రిములు పెరుగుతాయని , ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుందని తెలుపుతున్నారు.

మొలకెత్తిన విత్తనాలు:
మొలకెత్తిన విత్తనాలు . వీటిని ముఖ్యంగా పచ్చి కూరలను సరిగా శుభ్రం చేయనప్పుడు బ్యాక్టిరియా త్వరగా చేరే అవకాశం ఉంది . కాబట్టి, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు బాగా ఉడికించిన పదార్థాలకు పరిమితం కావడం మంచిది.

ప్యాకెట్ వెజిటేబుల్స్:
ఈ మద్య కాలంలో చాలా మంది ప్రీకట్ వెజిటేబుల్స్ కు అలవాటు పడుతున్నారు. కానీ సూపర్ మార్కెట్లో ఇలాంటి ఫుడ్స్ కొనుగోలుకు దూరంగా ఉండటం మంచిది .వాటిని ఎన్ని రోజుల నుండి నిల్వచేసుంటారో మనకు తెలియదు కాబట్టి, వీటి వల్ల కూడా త్వరగా బ్యాక్టీరియా చేరుతుంది.

పచ్చిపాలు:
పాస్టిరైజ్డ్ మిల్క్ చాలా ఉత్తమం . కానీ పచ్చిపాలలో ప్యారాసైట్స్, వైరస్ మరియు బ్యాక్టీరియా పొంచి ఉంటాయి. కాబ్టటి వ్యాదినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు , ఇలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల అలర్జీల నుండి బయటపడవచ్చు.

పచ్చిగుడ్లు:
పచ్చిగుడ్లలో సాల్మొనెల్లా ఉంటుంది . ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది . కాబట్టి ప్రతి సారి పచ్చిగుడ్డును తినడం అంత మంచిది కాదు . అనారోగ్య సమస్యలకు నివారించుకోవడానికి , లోఇమ్యూనిటి ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

మాంసాహారం:
మాంసాహారాలను ఎలా నిల్వచేస్తారో మనకు తెలిసిన విషయమే...కాబట్టి వీటిని మనం ఫ్రోజోన్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ ను నివారించడం మంచిది. ఫ్రెష్ గా దొరికే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్యాక్ చేసిన జ్యూస్ లు:
ప్యాక్ చేసిన జ్యూస్ లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇందులో వివిధ రకాల బ్యాక్టీరియా పొంచి ఉంటుంది . కాబట్టి ఎప్పుడూ ఫ్రెష్ డ్రింక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.



Click it and Unblock the Notifications