Latest Updates
-
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా!
గుప్పెడు చిక్కుడు గింజలతో బోలెడంత ఆరోగ్యం
చిక్కుడులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. రోజు వారీ డైట్ లో చిక్కుడు గింజలు చేర్చుకుంటే.. డయాబెటీస్, రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని రోజూ తీసుకోవాలంటే బోర్ గా అనిపించవచ్చు. కాబట్టి.. ఒక్కో రోజు ఒక్కో విధంగా తీసుకుంటే మంచిది. ఉడికించిన గింజల రూపంలో, కూర రూపంలో ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..
చిక్కుడు కాయ సాధారణంగా తింటూ ఉంటాం. అయితే.. చిక్కుడు గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజువారీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతిరోజూ అరకప్పు చిక్కుడు గింజలు తింటే.. శరీరంలో చేరే చెడు కొలెస్ర్టాల్ 5 శాతం తగ్గించి, మేలు చేసే కొలెస్ర్టాల్ ని 2.3 శాతం తగ్గిస్తుంది. చిక్కుడు తింటే.. ఆకలి కూడా తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

చిక్కుడు గింజలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ని స్థిరపరుస్తాయి. అయితే చిక్కుడు గింజలు తినడం అలవాటు చేసుకున్న మొదట్లో కాస్త కడుపులో ఉబ్బరంగాఅనిపిస్తుంది. క్రమంగా గ్యాస్ ఏర్పడటం నుంచి ఉపశమనం పొంది, త్వరగా జీర్ణమవడానికి సహాయపడతాయి. కాబట్టి రోజుకి అరకప్పు చిక్కుడు గింజలు తినడం అలవాటు చేసుకుని.. ఆరోగ్యంగా ఉండండి.
రోజూ తినడానికి ఇష్టపడని వాళ్లు కనీసం వారానికి 4 సార్లు చిక్కుడు గింజలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 22 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిక్కుడు గింజల ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా పొందవచ్చు. అయితే ముదురు రంగు గింజల్నే ఎంచుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
