Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
హెల్తీగా జీవించడానికి హైవాటర్ కంటెంట్ ఉండే టాప్ 10 ఫ్రూట్స్...
శరీరంలో నీరు సరిపడా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్రం పోసేటపుడు మంట. డల్ గా వుండే చర్మం, బలహీనపడే కండరాలు, మలబద్ధకం, మొదలైనవి బాధిస్తాయి. శరీరంలో అన్ని వ్యవస్ధలు నీరు కోరుతాయి. కనుక తగినంత నీరు అందించటం అవసరం. నీరు తాగటానికి సమయం లేదంటారా? అయితే...కొన్ని తిండిపదార్ధాలు పరిశీలించండి. వాటిని తింటూ శరీరానికవసరమైన నీటిని ఎపుడూ అందించండి.
సహజంగా , మన శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేయాలంటే శరీరానికి సరిపడా నీరు అవసరం .కేవలం నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీరు మాత్రమే అందుతుంది. అదే నీరు ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ తో పాటు, నీరు కూడా అందుతుంది. మీకు తెలుసా, వివిధ రకాల పండ్లలో అధికంగా వాటర్ కంటెంట్ ఉంటుంది.
డైలీ డైట్ లో ఫ్రూట్స్ ఎక్కువగా తినే వారు, వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల నుండే 20శాతం నీటిని పొందాలి. అలాంటి 90శాతం వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇటువంటి ఫ్రూట్స్ ను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి సరిపడే నీరుతో పాటు పోషకాలు అందుతాయి.
కాబట్టి, మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఫ్రైడ్ స్నాక్స్ కు బదులుగా, హెల్తీ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. హైవాటర్ కంటెంట్ ఉండే 10 ఆహారపదార్థాలు....

వాటర్ మెలోన్:
వాటర్ మెలోన్(పుచ్చకాయలో)అత్యధిక వాటర్ కంటెంట్ కలిగినది. వాటర్ మెలోన్ లో 92శాతం నీరు ఉంది. ఇది ఫర్ఫెక్ట్ గా హెల్తీ చాయిస్ . మరియు హెల్తీ స్నాక్ కూడా...

స్ట్రాబెర్రీస్:
స్ట్రాబెర్రీస్ లో 92శాతం నీరు ఉంటుంది. హైవాటర్ కంటెంట్ ఉన్న హెల్తీ ఫుడ్ గా దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

హనీ మెలోన్:
హనీ మెలోన్ హెల్తీ డైట్ ఫుడ్ . ఈఫ్రూట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది. . బాడీ సెల్స్ ను సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. . హైవాటర్ కంటెంట్ ఉన్న హెల్తీ ఫ్రూట్.

ఆపిల్:
వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉండే ఫ్రూట్స్ లో ఆపిల్ ఒకటి. . అంతే కాదు శరీరానికి వాటర్ తో పాటు, న్యూట్రీషియన్స్, నేచురల్ షుగర్స్ , అమినోయాసిడ్స్, మినిరల్ సాల్ట్, మరియు విటమిన్స్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం పర్ఫెక్ట్ చాయిస్.

పైనాపిల్:
పైనాపిల్ మరో హెల్తీ ఫ్రూట్. . దీన్ని నేరుగా ఫ్రూట్ గా తీసుకోవడం మాత్రమే కాదు, దీన్ని వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు . టాప్ 10 హైవాటర్ కంటెంట్ రిచ్ ఫ్రూట్స్ లో ఇది ఒకటి.

గ్రేప్ ఫ్రూట్:
వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉండే మరో ఫ్రూట్ గ్రేప్ ఫ్రూట్ . చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి . ఈ గ్రేఫ్ ఫ్రూట్ తింటే చాలు పొట్ట ఫుల్ గా ఉన్న ఫీలింగ్ ను కలిగి ఉంటుంది.

మామిడిపండ్లు:
పండ్లలో రారాజు మామిడి పండ్లు, అంతే కాదు వీటిలో వాటర్ కెంటెంట్ కూడా ఎక్కువే, మామిడిపండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల వివిధ రకాల న్యూట్రీషియన్స్ అందిస్తుంది. వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందుకే టాప్ 10 ఫ్రూట్స్ లో ఇది ఒది కూడా ఒకటి.

ఆరెంజ్:
టాప్ 10 హైవాటర్ కంటెంట్ ఫుడ్స్ లో ఆరెంజ్ ఒకటి. దీన్ని ఎక్కువగా స్మూతీస్, సూప్స్, స్టీవ్స్, కాక్ టైల్స్ మరియు సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు .

బొప్పాయి:
బొప్పాయి హెల్తీ అండ్ టేస్టీ ఫ్రూట్ . దీన్ని హైవాటర్ కంటెంట్ ఉన్న హెల్తీ ఫ్రూట్ గా సూచిస్తున్నారు, పోషకాహార నిపుణులు.

ప్లమ్ :
శరీరంలో డీహైడ్రేషన్ నివారించడంలో ప్లమ్ గ్రేట్ ఫ్రూట్. అత్యధిక వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ . ఫ్లమ్ ఒక హెల్తీ ఫ్రూట్ . కాబట్టి, రెగ్యులర్ డైట్ లో దీన్ని తీసుకుని డీహైడ్రేషన్ సమస్యను తగ్గించుకోవాలి!



Click it and Unblock the Notifications
