Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
మగవాళ్లు, ఆడవాళ్లలో లైంగిక సామర్థ్యాన్నిపెంచే పవర్ ఫుల్ ఫుడ్స్
సరైన ఆహారం తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నామా ? లేదా ? అనేది మనం తీసుకునే ఆహారమే నిర్ణయిస్తుంది. అయితే లైంగిక సామర్థ్యాన్ని పెంచే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. మగవాళ్లలోనూ, ఆడవాళ్లలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాలున్నాయి.
అయితే మాంసాహారం తినే అలవాటు అందరికీ ఉండకపోవచ్చు. అలాగే.. కొంతమందికి అలవాటు ఉన్నప్పటికీ చాలా తక్కువగా తీసుకుంటారు. అలాంటి వాళ్లలో సెక్సువల్ స్టామినా పెంచే ఆహారాలు ఉన్నాయి. అవి కూడా వెజిటేరియన్ ఫుడ్సే మీలో లైంగిక శక్తిని పెంచుతాయి. ఎలాంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ మీ లైంగిక జీవితానికి సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం..

అరటిపండు
అరటిపండు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి. అరటిపండ్లలో ట్రైప్టోఫాన్, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే పొటాషియం సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేసి.. లైంగిక శక్తిని పెంచుతాయి.

పీనట్ బట్టర్
పీనట్ బట్టర్ లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి డొపామైన్ లెవెల్స్ ని పెంచుతాయి. మహిళల్లో సెక్సువల్ ఎమోషన్స్ పెంచడానికి ఈ డొపామైన్ ఉపయోగపడుతుంది. పీనట్స్ లో జింక్ ఎక్కువగా ఉండటం వల్ల మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది.

బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ నైట్రేట్స్ ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ అత్యంత ఆరోగ్యకరమైనది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు లైంగిక సామర్థ్యం పెంచే గుణాలు ఉంటాయి. అలాగే ఎర్రరక్తకణాలను పెంచుతుంది.

రెడ్ గ్రేప్స్
రెడ్ గ్రేప్స్ ఇమ్యునిటీ పవర్ పెంచుతాయి. ఇందులో ఉండే గుణాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ నివారిస్తాయి. అలాగే లైంగిక శక్తిని పెంచుతాయి. రోజూ ఒక గుప్పెడు రెడ్ గ్రేప్స్ తింటే మంచిది.

ఓట్ మీల్
మగవాళ్లు ఒక కప్పుు ఓట్ మీల్ తీసుకుంటే.. ఒక స్పూన్ వయాగ్రా తీసుకున్నంత ఫలితం పొందవచ్చట. టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెంచి.. సెక్సువల్ స్టామినా పెంచుతుంది.

కాఫీ
కాఫీలో లైంగిక ప్రయోజనాలు దాగున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన మోతాదులో కాఫీ తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యానికి ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్స్ కి ముందు మగవాళ్లు, ఆడవాళ్లు ఒక కప్పు కాఫీ తాగితే.. మంచిదట.

బీన్స్
బీన్స్ లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. శరీర కండరాలను ఉత్సాహ పరచడానికి ప్రొటీన్స్ సహాయపడతాయి. హార్ట్, కిడ్నీలకు మంచిది. బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ తీసుకుంటే మంచిది. వీటిల్లో పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లైంగిక శక్తిని పెంచుతాయి.

సిట్రస్ ఫ్రూట్స్
మగవాళ్లు ఎక్కువ గ్రేప్ ఫ్రూట్స్, ఆరంజెస్ తీసుకుంటే.. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి బెడ్ టైమ్ పర్ఫామెన్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ ని కూడా ఇద్దరిలోనూ ఈ ఫ్రూట్స్ తగ్గిస్తాయి.

బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ లో లిబిడో పెంచే సత్తా ఉంటుంది. శరీరం మొత్తానికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఇందులో మాంగనీస్ ఉండటం వల్ల నరాల వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది.

యాపిల్స్
యాపిల్స్ లో ఫెనిలెథిలమైన్ ఉంటుంది. ఇది ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరిలో న్యాచురల్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తాయి. సెక్స్ డ్రైవ్ హ్యాపీగా సాగాలంటే.. యాపిల్స్ తినాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి.. సెక్సువల్ స్టామినా పెరుగుతుంది.

సోయా బీన్
సోయా బీన్స్ లో ప్లాంట్ హార్మోన్ ఉంటుంది. ఇది మెనోపాజ్ దశలో ఉండే మహిళల్లో కొల్లాజెన్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెంచి యూత్ ఫుల్ గా కనిపించేలా చేస్తుంది.

డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి ఎక్కువగా ఉంటుంది. రోజూ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండటం మంచిది.

గుమ్మడి
గుమ్మడి విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచి.. మగవాళ్లు, ఆడవాళ్లలో లైంగిక ఆలోచనలను పెంచుతాయి. గుమ్మడి విత్తనాల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ లెవెల్స్ పెంచి.. లైంగిక శక్తిని పెంచడమే కాదు.. ఫెర్టిలిటీకి సహాయపడతాయి.

కార్న్
మొక్కజొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానవ శరీరానికి చాలా ప్రయోజనకరం. మినరల్స్, మాంగనీస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి.
సెక్సువల్ ఆర్గాన్స్ మొక్కజొన్న మంచి పౌష్టికాహారం.



Click it and Unblock the Notifications