Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
రోజుకి మూడు కర్జూరాలు చాలు.. మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి..
కర్జూరాలు.. వీటినే డేట్స్ అని పిలుస్తారు. చాలా డిలీషియస్ గా ఉండే డేట్స్ తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పనక్కరలేదు. డ్రై డేట్స్ ని ఎప్పుడో పురాతన కాలం నుంచి తింటూ ఉన్నాం. అయితే.. ప్రస్తుతం వాటిని.. నానబెట్టి మెత్తగా ఉండేలా ప్యాక్ చేసిన మార్కెట్ లో దొరుకుతాయి. వీటి ద్వారా ఎక్కువ మోతాదులో పోషకాలు పొందవచ్చు.
READ MORE: రంజాన్ మాసంలో ఖర్జూరాలకెందుకు అంత ప్రాధాన్యత
రోజువారీ డైట్ లో కర్జూరాలను చేర్చుకోవాలని.. తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎన్నో తినాల్సిన అవసరం లేదు.. కేవలం రోజుకి మూడు కర్జూరాలు తీసుకుంటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ తేల్చాయి. రోజుకి మూడు కర్జూరాలు తినడం మొదలుపెట్టి చూడండి.. మీ ఆరోగ్యం విషయంలో మీకే తేడా కనిపిస్తుంది.

జీర్ణశక్తి:
ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పై దుష్ర్పభావం పడుతుంది. కాబట్టి.. న్యాచురల్ గా లభించే.. ఎక్కువ మోతాదులో ప్రొటీన్స్, ఫైబర్స్ ఉండే డేట్స్ రోజూ తీసుకకోవడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా సాగుతుందని చెబుతున్నాయి అధ్యనాలు. కేవలం రోజుకి మూడు కర్జూరాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఒకవేళ మీరు చాలాకాలంగా గ్యాస్ర్టిక్ ట్రబుల్, డైజెషన్ సమస్యలు కలిగి ఉంటే.. వెంటనే ఈ డైట్ ఫాలో అవండి. మీ జీర్ణక్రియలో తేడాని గమనించండి. అలాగే కోలన్ క్యాన్సర్ రిస్క్ ని కూడా తగ్గిస్తుంది.
READ MORE: బరువు తగ్గించడంలో ఖర్జూరం చేసే మ్యాజిక్
పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు:
మీరు మీ డైట్ లో మూడు కర్జూరాలు చేర్చుకోవడం వల్ల మీరు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ఉపయోగించే అవసరం రాదని స్టడీస్ నిరూపించాయి. డేట్స్ లో మినరల్స్, న్యూట్రియంట్స్, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి1 వంటివన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న కర్జూరాలు డైలీ డైట్ లో చేర్చుకుంటే.. విటమిన్ సప్లిమెంట్స్, పెయిన్ కిల్లర్స్ ఉపయోగించే అవసరం రాదు. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల నొప్పి, వాపు సమస్యలు దరిచేరకుండా కాపాడుతాయి. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, అలర్జీలు, ఆర్టరీస్, అల్జీమర్స్ వంటి రిస్క్ ని కూడా తగ్గిస్తాయి.
READ MORE: డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?
హెల్తీ ప్రెగ్నెన్సీ:
మీరు గర్భిణీ అయితే.. రోజుకి మూడు కర్జూరాలు తీసుకోవడానికి అనేక కారణాలున్నాయి. డేట్స్ ని రోజు వారి డైట్ లో చేర్చుకుంటే మీ ఆరోగ్యంతో పాటు.. మీ పొట్టలోని బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. గర్భిణీలు చివరి నాలుగు వారాలు తప్పకుండా రోజూ డేట్స్ తీసుకోవడం వల్ల.. నొప్పి లేకుండా.. డెలివరీ అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అధ్యయనాలు నిరూపించాయి. డెలివరీ తర్వాత కూడా కంటిన్యూగా కర్జూరాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది.

బీపీ రిస్క్:
కర్జూరాలు బ్లడ్ ప్రెజర్ ( బీపీ ) రిస్క్ తోపాటు, హార్ట్ స్ర్టోక్ రిస్క్ ని తగ్గిస్తాయి. బీపీ సమస్య ప్రస్తుతం కామన్ గా వినిపిస్తుంది. కర్జూరాల్లో ఉండే మెగ్నీషియం రోజుకి మూడు కర్జూరాలు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ రిస్క్ ని తగ్గిస్తుందని తేల్చాయి. అలాగే హైబీపీ ఉన్నవాళ్లకు కూడా ఇవి చక్కటి పరిష్కారమని సూచిస్తున్నారు. మెగ్నీషియం పుష్కలంగా లభించే కర్జూరాలు తినడం వల్ల స్ర్కోక్ రిస్క్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications