Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మిశ్రమ పండ్ల కలయికతో ఉన్న ఈ 7 పండ్ల రసాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం, ఆరోగ్యం పదిలం
యాంటీఆక్సిడెంట్స్, ధూమపానం మరియు కాలుష్యం కారణంగా సంభవించే స్వేచ్ఛా రాడికల్స్ బారినుండి కణాల నష్టం జరుగకుండా కాపాడుతాయి.పండ్ల రసాలు యాంటీఆక్సిడెంట్స్లో అధికం :పండ్ల రసాలు కూడా అంటువ్యాధులు మరి
చల్లని పండ్ల రసంతో కూడిన గ్లాసుని ఎవరు ఇష్టపడరు చెప్పండి. వేసవిలో మీ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, మీ శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. మరియు అనేక పోషకాలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పండ్ల రసాలలోని అనామ్లజనకాలు మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుదలకు ఎంతగానో సహాయం చేస్తాయి. వివిధ వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తూ శరీరానికి మంచి రక్షణను అందిస్తాయి.
యాంటీఆక్సిడెంట్స్, ధూమపానం మరియు కాలుష్యం కారణంగా సంభవించే స్వేచ్ఛా రాడికల్స్ బారినుండి కణాల నష్టం జరుగకుండా కాపాడుతాయి.
పండ్ల రసాలు యాంటీఆక్సిడెంట్స్లో అధికం :
పండ్ల రసాలు కూడా అంటువ్యాధులు మరియు క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి మరియు మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.
పండ్లలో కనిపించే అత్యంత సాధారణ అనామ్లజనకాలుగా లైకోపీన్, ఆంతోసియానిన్లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, విటమిన్ E, విటమిన్ ఎ, రెస్వెరాట్రోల్ మరియు టానిన్లు ఉంటాయి.
కావున, మీ ఆహారం ద్వారా వివిధరకాల అనామ్లజనకాలను పొందుటకు, మీరు పండ్ల రసాలను తయారుచేసుకునే సమయంలో వివిధరకాల పండ్ల మిశ్రమాలను ప్రయత్నించవచ్చు.
అనామ్లజనాకాలలో అధికంగా ఉండే 7 రకాల కోంబో జ్యూస్ జాబితాను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

1. పుచ్చకాయ + నిమ్మకాయ :
పుచ్చకాయలు 92 శాతం నీటితో తయారుచేయబడి ఉంటుందని మనందరికీ తెలుసు. జాతీయ పుచ్చకాయల ప్రమోషన్ బోర్డ్ ప్రకారం, ఏ ఇతర పండ్లలో లేని విధంగా, పుచ్చకాయలు, అధిక మోతాదుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ను కలిగి ఉంటాయి. ఇది ఆక్సీకరణ గావించబడిన విటమిన్ సి వలె చెప్పబడుతుంది. ఇది నిమ్మకాయలలో కూడా ఉంటుంది. వీటిని కలిపి తీసుకున్నప్పుడు, క్యాన్సర్ కారకాలైన స్వేచ్ఛా రాశులతో పోరాడటానికి సహాయపడుతుంది.

2. మామిడి + పైనాపిల్ :
మామిడి పండు విటమిన్ A యొక్క అద్భుతమైన మూలంగా ఉంటుంది. మరియు బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్, మరియు బీటా క్రిప్టోక్సాన్టిన్ వంటి ఫ్లేవనాయిడ్లలో అధికంగా ఉంటుంది. ఈ సమ్మేళనాలు ప్రతిక్షకారిణి లక్షణాలను కలిగి ఉంటూ, మంచి కంటి చూపును నిర్వహించడంలో సహాయపడతాయి. విటమిన్ సి మరియు ఫెనాలిక్ ఆమ్లాలు వంటి అనామ్లజనకాల మూలంగా ఉండే పైనాపిల్స్, శరీరంలో దీర్ఘకాలిక సానుకూల ప్రభావాలకు వీలుగా ఉంటాయి.

3. స్ట్రాబెర్రీ + ఆరెంజ్ :
క్యాన్సర్తో పోరాడే యాంటి ఆక్సిడెంట్లలో అధికంగా ఉండే పండ్లలో స్ట్రాబెర్రీస్ కూడా ఒకటి. వీటిలో ఆంతోసియానిన్లు, గుండె సంబంధిత వ్యాదులకుకి వ్యతిరేకంగా ఉండే అనామ్లజనకాలు, మరియు ఫ్రీ రాడికల్స్ బారినుండి కణాలను కాపాడే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరెంజ్ కూడా విటమిన్ సి లో సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ తో కలిపి తీసుకున్నప్పుడు, యాంటీ ఆక్సిడెంట్స్ లాభాలు రెట్టింపు అవుతాయి.

4. దానిమ్మ + కాంకర్డ్ గ్రేప్స్ :
దానిమ్మ పండులో ప్రధానంగా మూడు రకాల యాంటీ ఆక్సిడెంట్ పాలిఫేనోల్స్లో అధికంగా ఉంటాయి. అవి వరుసగా టానిన్లు, ఆంతోసియానిన్లు మరియు ఎల్లాజిక్ ఆమ్లంగా ఉన్నాయి. ప్యూనికాలజిన్స్ అని పిలువబడే మరొక శక్తివంతమైన ప్రతిక్షకారిని కూడా దానిమ్మలో కనుగొనవచ్చు. దానిమ్మ పై తొక్క, రెడ్ వైన్ మరియు గ్రీన్ టీ కన్నా మూడు రెట్లు అధికంగా అనామ్లజనకాల చర్యలను కలిగి ఉంటుందని చెప్పబడింది.
కాన్కార్డ్ ద్రాక్ష, క్యాన్సర్, గుండె వ్యాధులు మరియు న్యూరోడీజెనరేటివ్ వ్యాధులను నివారించడానికి లేదా చికిత్స చేయుటకుగల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రిస్వరెట్రాల్ను కలిగి ఉంటుంది.

5. చెర్రీ + కివి :
చెర్రీస్, ముఖ్యంగా టార్ట్ చెర్రీస్ విటమిన్ ఎ యొక్క అద్భుతమైన వనరుగా ఉన్నాయి, ఇది నరాల ప్రక్రియను నిర్వహించడానికి మరియు స్వేచ్ఛా రాశులతో పోరాడే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్సిడెటివ్ స్ట్రెస్ మరియు వాపును తగ్గించే పాలిఫెనాల్స్ కూడా ఉంటాయి. కివి పండ్లు, విటమిన్ సి లో పుష్కలంగా ఉంటాయి, ఇది నారింజ మరియు నిమ్మకాయలకన్నా దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంటుంది .

6. లిచీ + బ్లూబెర్రీ :
లిచీ, యాంటీ ఆక్సిడెంట్స్లో అధికంగా ఉండే మరొక ఉత్తమమైన పండుగా ఉంటుంది. ఇది విటమిన్ సి లో ఎక్కువగా ఉంటూ, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది. క్రమంగా దగ్గు మరియు చలికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. బ్లూబెర్రీలలో ఉండే ఆంథోసియానిన్లు, విటమిన్ A మరియు విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. అనామ్లజనకాలు అధికంగా ఉన్న పండ్లలో, బ్లూబెర్రీస్ మొదటి స్థానంలో ఉంటాయి.

7. యాపిల్స్ + జామ :
యాపిల్స్ అనామ్లజనకాలు, క్వెర్సెటిన్, పెక్టిన్, మరియు ఫ్లేవనాయిడ్స్లలో పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడానికి మరియు ఆరోగ్యకరమైన జీవక్రియలకు మద్దతు ఇస్తుంది.
విటమిన్ ఎ, విటమిన్ సి మరియు లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్న అద్భుతమైన ఆహారంగా జామ ఉంటుంది.
ఒకే ఒక పండుతో పండ్లరసం తీసుకునే కన్నా, ఇలా మిశ్రమ పండ్లను ఉపయోగించి తీసుకోవడం ద్వారా, అధిక ప్రయోజనాలను పొందగలరు. అదేవిధంగా కృత్రిమ చక్కెరల జోలికి వెళ్ళకుండా, సహజ సిద్దమైన ముడి తేనెను స్వీటెనర్ గా వినియోగించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు. ఏదిఏమైనా పండ్ల రసాల కన్నా, పండును నేరుగా తీసుకోవడం ద్వారానే అధిక ప్రయోజనాలను పొందగలరని ఇది వరకు అనేక వ్యాసాలలో మనం తెలుసుకున్నాం. కావున, పండ్ల రసాలను స్వీకరించేటప్పుడు అధిక వినియోగం పనికిరాదని గుర్తుంచుకోండి. మరియు వీలైనంతవరకు, సాదా పండ్ల రసాల వైపే మొగ్గు చూపండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











