పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్‌ గోంగూర శనగపప్పు పులుసు.!

పెళ్లి వేడుక అనగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడ వడ్డించే ఆహార వెరైటీలు. శాకాహారం నుంచి మాంసాహారం వరకు ఆతిథ్యం ఇచ్చేవారు తమ శక్తి మేరకు రకరకాలు వడ్డించేస్తుంటారు. కానీ ఎన్ని వెరైటీలు ఉన్నా ఈ వంటకం లేకుండా మెనూ పూర్తి కాదు. అదే గోంగూర శనగపప్పు పులుసు. ఆంధ్రాలో ముఖ్యంగా గుంటూరులో గోంగూర వంటకాలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇక పెళ్లిళ్లలో వడ్డించే ఈ వంటకానికి రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారంటే అతిశయోక్తి కాదు. మీరూ అలాంటి రుచిని ఇంట్లోనే ఆస్వాదించాలంటే ఈ పద్ధతిలో ట్రై చేయండి. ప్లేట్‌ ఖాళీ చేసేస్తారు.

Wedding special gongura senaga pappu pulusu andhra style recipe process and ingredients

గోంగూర శనగపప్పు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి శనగపప్పు- పావు కప్పు
గోంగూర- రెండు పెద్ద కట్టలు లేదా 350 గ్రాములు
చింతపండు- ఉసిరికాయ సైజు
నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- 12
ఆవాలు- టీస్పూన్‌
ఎండు మిర్చి- రెండు
పచ్చిమిర్చి- రెండు
ఉల్లిపాయ- ఒకటి (మీడియం సైజు)
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- పావు టీస్పూన్‌
కారం- ఒక టేబుల్‌ స్పూన్‌

గోంగూర శనగపప్పు పులుసు తయారీ విధానం

షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా!

గోంగూర శనగపప్పు పులుసు కోసం ముందుగా పచ్చి శనగపప్పు రెండు సార్లు కడిగి నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చింతపండును కడిగి నానబెట్టుకోవాలి.

ఈ లోపు గోంగూరను ఒలిచి పెట్టుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. శనగపప్పు రెండు విజిల్స్‌ వచ్చిన తర్వాత ఆవిరి తీసేసి శనగపప్పు ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత అందులో గోంగూర వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, చింతపండు రసం, పావు కప్పు నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

Wedding special gongura senaga pappu pulusu andhra style recipe process and ingredients

ఇప్పుడు స్టవ్‌పైన బాణలి పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత కట్‌ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. తర్వాత మీడియం సైజులో కట్‌ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి.

మందులతో పనిలేని బెస్ట్‌ డిటాక్స్‌ డ్రింక్‌.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.!

పసుపు, కరివేపాకు వేసి కలిపిన తర్వాత కారం వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ లోపు గోంగూర ఉడికిపోతుంది. కుక్కర్‌ మూత వేసి గోంగూరను గరిటెతో కలిపి ఆ మొత్తాన్ని బాణలిలో వేసి కలిపి ఉప్పు సరిచూసుకోవాలి.

రెండు నిమిషాల తర్వాత చిన్న మంటపైన ఉడికించిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన గోంగూర శనగపప్పు పులుసు రెడీ. వేడివేడిగా అన్నంలోకి ఏ కూర లేకపోయినా ఈ ఒక్కటీ ఉంటే కడుపు నిండా తినేస్తారు.

[ of 5 - Users]
Story first published: Friday, September 11, 2026, 18:10 [IST]
Desktop Bottom Promotion