Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వీటిని తింటే.. రోగాలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు..!
ఆరోగ్యం వుండాలంటే వ్యాయామం ఒక్కటే కాదు మందుగా శరీరంలో రోగనిరోధక శక్తి వుండాలి. ఈ రోగనిరోధక శక్తి లేకపోతే ఎన్ని వ్యాయామాలు చేసినా వ్యర్ధమే. కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఈ రోగనిరోధక శక్తి లేకపోవడం వల్లే చనిపోయారని అధికారిక లెక్కలు మనకు చెబుతున్నాయ్. కొన్ని ఆహారాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ప్రతి రోజు మనం తినే ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే మన రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి హానకరమైన జబ్బుల బారిన పడకుండా వుంటాము. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
1. రోగనిరోధక శక్తి పెరగాలంటే ముందుగా సిట్రిస్ పళ్లను అధికంగా తీసుకోవాలి. నిమ్మకాయ, బత్తాయ్, మోసంబీ, లాంటి వాటిని తీసుకోవాలి. వీటిలో వైటమిన్ సి వుంటుంది. రక్తంలో వుండే తెల్లరక్త కణాలు రోగనిరోధక శక్తిని కలిగి వుంటుంది, రక్తంలో ఈ తెల్లరక్తకణాలను ఈ వైటమిన్ సి పెంచుతుంది. కాబట్టి వీటిని తప్పకుండా తీసుకోవాలి.
2. బ్రాకోలిలో కూడా రోగనిరోధక శక్తి అధికంగా వుంటుంది. దీంట్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ పుష్కలంగా వుంటాయ్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా వుంటాయ్. బ్రకోలి, శరీరంలోంచి విషపదార్ధాలను బయటకు పంపించివేస్తుంది. క్యాల్షియం, ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా వుంటాయ్. రోజు కొంత బ్రకోలీని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. వెల్లుల్లిలో కూడా రోగనిరోధక శక్తి వుంటుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే లక్షణం వీటికి వుంటుంది. రోజూ చేసే కూరల్లో వెల్లుల్లి తప్పకుండా వుండేలా చూసుకోవాలి. హానికరమైన బ్యాక్టీరియాను కూడా పంపించే శక్తి ఈ వెల్లుల్లిలో వుంటుంది.

4. అల్లంను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచింది. ఇందులో విటమిన్ సితో పాటు మెగ్నీషియం, లాంటి ఎన్నో పోషకాలు వుంటాయ్. దగ్గు, గొంతు నొప్పిని కూడా అల్లం తగ్గిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించే సామర్ధ్యం అల్లంలో వుంటుంది.
5. పాలకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్లు సమృద్ధిగా వుంటాయ్. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైటమిన్ సి కూడా వుండడంతో రోగాలను దరిచేరనీయదు. ఆకుకూరలను మరీ ఎక్కువగా ఉడికించవద్దు లేదంటే అందులో వున్న పోషకాలన్నీ స్టవ్ మీదపెట్టినప్పుడే ఆవిరైపోతాయ్.
6. ఇక పెరుగును కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆహారంలో భాగం చేసుకోవాలి. భోజనం చేసే సమయంలో చివర్లో పెరుగు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ అలవాటును అలాగే వుంచుకుంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయ్. పెరుగులో వుండే జింక్, కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లను తిరిగి ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరగాలంటే యాంటీ ఆక్సిడెంట్లు వుండాలన్ని విషయం మనకు తెలిసిందే.
7. రోగనిరోధక శక్తి పెరగాలంటే పసుపును కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆయుర్వేదంలో పసుపుకు వున్న ప్రాముఖ్యత మనకు తెలిసిందే. పసుపు యాంటీ బయోటిక్‌గా ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి వెళ్లిన తరువాత హానికరమైన బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా వున్నట్లు శాస్త్రీయంగా రుజువైంది. గుండె జబ్బులు, క్యాన్సర్, ఆల్జీమర్ లాంటి ఎన్నో హానికరమైన జబ్బులకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు పసుపులో వున్నట్లు పరిశోధకులు తేల్చారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications