For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్ధకం పోవాలంటే....

By B N Sharma
|

Have These Food To Cure Constipation
మలబద్ధకం ఒక సాధారణ సమస్య. మలం సరిగా రాకుంటే దానినే మలబద్ధకం అంటారు. మలబద్ధకం ఏర్పడితే కడుపులో నొప్పి కలుగుతుంది. అది పేగులను నష్టపరుస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యవుండదు. మలబద్ధక నివారణకు ఏ ఆహారాలు తీసుకోవాలో చూడండి.

పీచు పదార్ధాలు - పీచు పదార్ధాలు అధికంగా వుండే ఆహారాలు తీసుకుంటే మలబద్ధకం పోతుంది. మలం తేలికగా బయటకు వచ్చేస్తుంది.

ఆహారాలు- ఓట్లు, పప్పు ధాన్యాలు, గింజలు, బ్రౌన్ రైస్, బార్లీ మొదలైనవి ఆహారంలో వుండాలి.

కాయగూరలు - తోటకూర, బ్రక్కోలి, చిక్కుడు, మొలకలు, కేరట్లు, బఠాణీలు, కేబేజి, గోంగూర, మొదలైనవి మలబద్ధకం ఏర్పడకుండా చేస్తాయి.

పండ్లు- నిమ్మజాతి పండ్లు పీచు అధికంగా కలిగి వుంటాయి. రేగు, అప్రికాట్, బొప్పాయి, ఆరెంజ్, ద్రాక్ష, ఆపిల్స్, స్ట్రా బెర్రీలు, బనానా, బ్లాక్ బెర్రీలు మొదలైనవి తింటే మలబద్ధకం ఏర్పడదు.

శరీరానికి తగినంత నీరు లభించకపోయినా మలబద్ధక సమస్య వస్తుంది. కనుక పై ఆహారాలు తింటూ ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగితే శరీరంలోని మలిన పదార్ధాలు బయటకు వచ్చి మలం తేలికగా బయటకు వచ్చేలా వుంటుంది. పండ్ల రసాలు, కూరల రసాలు కూడా తాగండి. సమస్యను నివారిస్తాయి.

English summary

Have These Food To Cure Constipation | మలబద్ధకం పోవాలంటే....

Water: Dehydration is one of the common reasons behind constipation. Have 8-10 glasses of water everyday to clear the toxins from the system and promote soft stool passage. Include fluids such as fruit juice, vegetables juice or soup.
Story first published:Saturday, October 15, 2011, 9:52 [IST]
Desktop Bottom Promotion