Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఆరోగ్యానికి శ్రీరామ రక్ష...ఆకు కూరల వాడకమే!

1. ఆకు కూరలు తినేముందు, వాటిని బాగా శుభ్రం చేయాలి, అనవసరమైన కొమ్మలు, రెమ్మలు మొదలైన గట్టిగా వుండే భాగాలను ఏరివేయండి. ఇక మెత్తగా వుండే ఆకు భాగాలను బాగా నీటిలో కడగండి. తరిగి చట్నీలలో కలుపుకొని తినవచ్చు. లేదా కొన్ని కూరలు పచ్చివే నమలచ్చు.
2. నీటితో శుభ్రం చేయటం ఎలా? ఆకు కూరలు శుభ్రం చేయటానికి మంచినీరు వాడాలి లేదంటే వాటిని ఉప్పు వేసిన వేడినీటిలో శుభ్రం చేయాలి. అపుడు మాత్రమే వాటిపై వున్న క్రిములు, వాటి గుడ్లు పూర్తిగా నశిస్తాయి. మురికి, దుమ్ము మరీ అధికంగా వుంటే పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో శుబ్రపరచండి.
3. తరిగే విధానం - ఆకు కూరల్లో వుండే పోషకాలను పూర్తిగా పొందాలంటే, వాటిని బాగా సన్నగా తరగాలి. వీలైతే పచ్చివిగానే తినాలి. మెంతికూర, కర్వేపాకు, తులసి, గోంగూర, కొత్తిమీర, తోటకూర, మొదలైనవి పచ్చిగానే తినవచ్చు. వాటిని సన్నగా తరిగి ఒకసారి మిక్సర్ లో వేస్తే పేస్ట్ గా తయారై తినేవారికి మంచి రుచినిస్తుంది.
4. ఆకు కూరలతో సూపులు, సలాడ్లు, చేసుకోవచ్చు. వండే అన్నంలో ఆకు కూరలు వేసి తినవచ్చు. చట్నీలుగా తయారు చేయవచ్చు. సూప్ చాలా మంచిది. వీటిని ఇతర కూరలలో కూడా కలిపి తినవచ్చు.
5. ఆకు కూరలు వండేటపుడు లేదా ఉడికించేటపుడు మూత తెరచి పెట్టరాదు. ప్రెషర్ కుక్ చేసేట్లయితే, ఉడికించిన నీటిని పారబోయ వద్దు. దానికి కొద్దిపాటి, ఉప్పు, లేదా నిమ్మరసం, లేదా కొన్ని మసాలాలు వేస్తే సూప్ లా తయారవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
