Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
మొబైల్ ఫోన్ జేబులోనా...పిల్లలు పుట్టుడు గోవిందా...!

వీర్యకణాలు తగ్గటానికి కారణాలు, వాటికి పరిష్కారాలు పరిశీలిద్దాం.
1. మొబైల్ ఫోన్లు - యువకుల్లో వీర్యకణాలు తగ్గటానికి మొబైల్ ఫోన్లు కారణమంటూ మీడియా కోడై కూస్తోంది. యువకులు తమ హైటెక్ ఫోన్లను పెట్టరాని చోటైన పేంటు జేబులో పెట్టుకొని యధేచ్ఛగా తిరగడం చూస్తున్నాం. వాటి రేడియేషన్ ప్రభావాలతో సిగ్నల్ వస్తే చాలు వీర్యకణాలు చచ్చిపోతున్నాయి. పరిష్కారం....ఒక మంచి లెదర్ పోచ్ పెట్టండి లేదా మీ బ్యాగ్ లో పెట్టుకోండి. శరీరాన్ని నష్టపరచేంతగా టెక్నాలజీని ప్రేమించకండి.
2. పొగతాగుడు - 16 సంవత్సరాల వయసులో పొగతాగటం మొదలు పెట్టి ఇప్పటికి వయసు 30 సంవత్సరాలయిందంటే....వీర్య కణాలకు నష్టం వాటిల్లినట్లే. మీ ప్రాణానికి భయపడి సిగరెట్ మానకపోయినా, కనీసం నపుంసకుడైపోతానన్న భయంతో అయినా సిగరెట్ మానేయండి.
3. బాడీ హీట్ - వీర్యకణాలు వృషణాలలో వుంటాయి. అవి జీవంతో వుండాలంటే చల్లని ప్రదేశం వుండాలి. మీ శరీర వేడి ఏ కారణం చేత పెరిగినా వీర్య కణాలు తగ్గినట్లే. పరిష్కారంగా...ప్రతిరోజూ తల స్నానం, మజ్జిగ, చల్లటి జ్యూసులు తాగాలి.
4. బిగువైన దుస్తులు, అండర్ వేర్లు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిస్తాయి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి. మోటర్ బైక్ లపై కూర్చొని దూర ప్రయాణాలు చేస్తే మెషీన్ వేడికి మీ వీర్యకణాలు తగ్గి సమస్య అవుతుంది. కనుక దూరప్రయాణంలో మధ్యలో బైక్ నుండి దిగి విశ్రాంతి పొందాలి.
5. ఒత్తిడి - ఈ రోజుల్లో అన్నిటికంటే ప్రధానమైనది ఒత్తిడి. స్మాకింగ్, లేదా మొబైల్ ఫోన్ లో టెన్షన్ గా మాట్లాడేయటం అన్నీ ఒత్తిడే. పరిష్కారం...ధ్యానం చేసి రిలాక్స్ అవండి.
పై చిట్కాలు పాటిస్తే, మీ వీర్యంలో కణాల సంఖ్య సాధారణంగా వుండి సమస్యలు లేకుండా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
