Latest Updates
-
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
ఒత్తిడి... ఆందోళనని దూరం చేసే మేలైన ఆహారం
ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి.. చిన్నప్పుడు ఇష్టంగా తిన్నామని... పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి సైడ్‌ఎఫెక్ట్‌లు కలిగించే మందులను ఊరికే వాడుతుంటాం. మన చేతిలో ఉన్న చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోము.
సాధ్యమైనంత వరకూ ఇంటి ఆహారాన్నే తింటే శారీరకంగానే కాదు.. మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. బర్గర్లు, పిజ్జాలు, మాట్ డాగ్స్ వంటి బేకరీ పదార్థాలు తినని వారితో పోలిస్తే... తరచూ తీసుకునే వారిలో యాభై ఒక్క శాతం మంది మానసిక ఆందోళనకు గురవుతారు. దాంతో పాటు శారీరక చురుకుదనం కూడా తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే... పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నెలలో ఒకటి రెండు సార్లకు మించి బేకరీ పదార్థాలను తీసుకోకపోవడమే మేలు. అదే సమయంలో వ్యాయామానికీ ప్రాధాన్యం ఇస్తే ఎటువంటి ఒత్తడి ఉండదు. మరి ఆహార విషయంలో ఒత్తిడిని పారద్రోళే ఆహారాలేంటో చూద్దాం...

బంగాళ దుంపలో జింక్, విటమిన్ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందు వల్ల, ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

టర్కీలో అమినో ఆసిడ్స్ మరియు ట్రైప్టోఫోన్స్ ఆనందగా ఉండేందుకు ఉపయోగపడే కెమికల్స్, సెరోటినైన్ ను మొదడు విడుదల చేస్తుంది. సెరోటొనైన్ మనస్సును ప్రశాంత పరచడమే కాకుండా తాజాగా పీల్ అయ్యేలా చేస్తుంది.

ఆస్పరాగస్ లో ఫోలిక్ ఆసిడ్స్ అధిక శాతంలో ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. మీ శరీరం ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కొన్ని విటమిన్స్, మినిరల్స్ తీసుకోవడం వల్ల మనస్సు స్థిమితంగా ఉండేలా చేస్తుంది.

మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ, బీఫ్ లో ఉన్న విటమిన్ బి మరియు జింక్ ఒత్తిడికి కారణం అయ్యే లక్షణాలను ధరిచేరనివ్వవు. అయితే ఇది వండే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ఆరోగ్యానికి మంచిది.

కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. దీనిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మోన్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.

దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు.

వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ (పిఇఎ) ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ - డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది.

పాలలోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.

గోధుమలో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. నూతనోత్తేజం కలిగిస్తుంది.

ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్, ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. ఆప్రికోట్‌లోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
