Latest Updates
-
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
సహజంగా బి.పి. తగ్గాలంటే?

కుటుంబంలో తండ్రి లేదా తల్లికి కనుక రక్తపోటు వుంటే, అది సంక్రమించరాదంటే బిడ్డలు మరింత జాగ్రత్తలు పడాలి. ఒక స్టడీలో రీసెర్చర్లు షుమారు ఆరు వేలమంది రక్తపోటు రోగులని పరిశీలించగా 34 శాతం మందికి కుటుంబ చరిత్ర వున్నట్లు తేలింది. అయితే, తల్లితండ్రులకు రక్తపోటు వున్నప్పటికి పిల్లలకు శారీరక సామర్ధ్యం బాగా వున్నట్లయితే, ఈ రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని కూడా స్టడీ చెపుతోంది.
మొండి వ్యాధులకు కుటుంబ చరిత్ర మరియు వ్యక్తి శారీరక సామర్ధ్యం తప్పక పరిగణలోనికి వస్తాయని స్టడీ నిర్వహించిన కొలంబియాలోని సౌత్ కరోలినా యూనివర్శిటీ లోని పబ్లిక్ హెల్త్ స్కూల్ రీసెర్చర్ రాబిన్ పి షూక్ వెల్లడించారు. స్టడీ అంశాలు తగిన వ్యాయామం...అంటే వేగమైన నడక వారానికిషుమారుగా 150 నిమిషాలుండాలని అది అధిక రక్తపోటు వున్నవారికి మంచి ఆరోగ్య ప్రయోజనం ఇస్తుందని ఆయన తెలిపారు.
రీసెర్చర్లు తమ పరిశోధనలో 20 నుండి 80 సంవత్సరాల వయసు కల రోగులను షుమారు 6,278 మందిని 4 నుండి 5 సంవత్సరాలపాటు పరిశీలించారు. వీరిలో 33 శాతం మందికి తమ తల్లితండ్రులనుండి ఈ వ్యాధి సంక్రమించినట్లు కనుగొన్నారు. స్టడీ మొదలు పెట్టినపుడు, అందులో పాల్గొన్నవారు ఆరోగ్యంగా వున్నారు. రీసెర్చర్లు వారికి ట్రెడ్ మిల్ టెస్ట్ లు చేసి ఖచ్చితమైన ఆరోగ్యం వున్నట్లు కనుకొన్నారు. స్టడీ లో 1,545 వ్యక్తులు రక్తపోటు కలిగివున్నట్లు తెలిపారు.
.
వారిలో కొంతమందికి కుటుంబ అధిక రక్తపోటు చరిత్రవుండగా మరికొందరికి లేదు. వీరితో వ్యాయామాలు చేయించగా ఫిట్ నెస్ స్ధాయిలు అధికంగా వుండేవారు 42 శాతం తక్కువ రక్తపోటు కలిగివున్నారని తేలింది. తక్కువ ఫిట్ నెస్ కలిగి పేరెంట్ కు కనుక అధిక ర్తపోటు వుంటే ఆ వ్యక్తులలో 70 శాతం అధిక రిస్కుతో రక్తపోటు వస్తుందని రీసెర్చి తెలిపింది. ఫిట్ నెస్ స్ధాయి అధికంగా వుండి తండ్రికి రక్తపోటు వుంటే వారిలో 16 శాతం మాత్రమే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలున్నాయట.
వ్యక్తియొక్క ఫిట్ నెస్ స్ధాయిలకు, ఆ వ్యక్తి కుటుంబ చరిత్రకు రక్తపోటు నిర్ణయంలో ప్రాధాన్యతలున్నాయి. కుటుంబంలో వారికి రక్తపోటు వున్నప్పటికి అది తమకు రాకుండా వ్యక్తులు తగిన శారీరక సామర్ధ్యాలను ఆచరిస్తే అది వారికి వచ్చే అవకాశం చాలా తక్కువగా వుంటుందని వారికే కాదు, మరి కొన్ని తరాల వరకు కూడా రాకపోయే అవకాశాలుంటాయని రీసెర్చర్లు చెపుతున్నారు.
రీసెర్చి ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆమోదించింది. వేగవంతమైన నడక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు వారానికి అయిదు రోజుల చొప్పున వుండాలని కూడా అంగీకరించింది.
ఈ స్టడీ ఫలితాలను ఆమెరికన్ హార్ట్ అసోసియేషన్ హైపర్ టెన్షన్ జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications