Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
తలనొప్పిని తగ్గించే 4 సాధారణ ఔషధాలు!

కాఫీ - తలనొప్పి వచ్చిందంటే, కాఫీ తాగేస్తారు. కాని ఇది నరాల వ్యవస్ధను ఉద్రేకపరచే ఒక ఔషధం. తాగిన తర్వాత మూత్రం పోసేసినా సరే....దాని ప్రభావం 5 గంటలపైగా వుంటుంది. అందరూ రెండు కప్పులు తాగేస్తే తలనొప్పి పోతుందనుకుంటారు కాని, తాత్కాలికంగా తగ్గించినా అది మరల పెంచుతుంది. అంతేకాదు కాఫీ అధికమైతే శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. కనుక తలనొప్పికి కాఫీ తాగటం చెడు అలవాటే.
టీ - ఇది కూడా ఒక హెర్బల్ మెడిసిన్ ప్రత్యామ్నాయం. ఏ పనిలో వున్నా తలనొప్పి వచ్చిందంటే చాయ్ తాగేస్తారు. పనిఒత్తిడికి మంచి మందుగా భావిస్తారు. అయితే గ్రీన్ టీ ఒక కప్పు వరకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అధికమైతే, దీనితో కూడా సమస్యలే. శరీరం డీహైడ్రేట్ అవటం, అజీర్ణం, యూరిక్ యాసిడ్ ఏర్పడటం వంటివి వుంటాయి.
చాక్లెట్ - తలనొప్పి తగ్గాలని సాధారణంగా ఒక చాక్లెట్ తింటారు. ప్రత్యేకించి మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు. డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది కాని అధికంగా ఈ చాక్లెట్ లు తింటే తలనొప్పి పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ అధికమైతే బరువు పెరుగుతుంది.
వాల్ నట్స్ - వాల్ నట్ ఆరోగ్యకరమే కనుక మంచి అలవాటే. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. ఇవి డిప్రెషన్, తలనొప్పి వంటి వాటినుండి దూరం చేసి చురుకుగా వుంచుతాయి. అయితే ఇవి అధికంగా తింటే, బరువు పెరగటం, విరేచనాలు, అజీర్ణం వంటివి ఏర్పడతాయి.
తలనొప్పి తగ్గించుకోడానికిగాను సాధారణంగా ఈ 4 అలవాట్లు ఆచరిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
