మంచి ఆరోగ్యానికి ఏడు వండర్ ఫుల్ వెజిటేబుల్స్...

జీవితంలో నిలవడానికి, నిలదొక్కుకోవడానికి గెలవడానికి ఆరోగ్యం ఎంతో అవసరం. అలాగే జీవితంలో ఆహార క్రమ శిక్షణ కూడా అవసరమే. ఇవాళ కొన్ని ఆహార పదార్థాలు మనం తింటున్నట్లే వుంటాం. కానీ పెద్ద ఇష్టంగా తీసుకోం. ఎక్కువగానూ వండం. అలాంటి నిర్లక్ష్యంచేసే మంచి ఆహారం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.

మునగకాయ

మునగకాయ

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి.

బీట్‌రూట్

బీట్‌రూట్

కేన్సర్‌తో పోరాడే అద్భుత గుణాలున్న బీట్‌రూట్‌లోని ఎర్రటి పిగ్మెంట్‌ సహజమైనది. అంతేకాకుండా ఇందులో ఫోలేట్‌లు అధికంగా వున్నాయి.

క్యాబేజ్

క్యాబేజ్

క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్

పచ్చటి ఆకుల మధ్య ముద్దగా కనిపించే తెల్లటి పూలగుచ్ఛమే కాలీఫ్లవర్‌. ఇది ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్‌ బొకేలా ముచ్చటగా వుంటుంది. క్యాలీప్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

కాకరకాయ

కాకరకాయ

కాకరకాయ చేదుగా ఉన్నా ఎంతో ఆరో గ్యాన్నిస్తుంది. జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. జ్వరం, నులి పురుగులను నశింప చేస్తుంది.

పాలకూర

పాలకూర

మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. * దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి.

గుమ్మడి మరియు గుమ్మడి గింజలు

గుమ్మడి మరియు గుమ్మడి గింజలు

గుమ్మడిలో విటమిన్‌ ఎ పుష్కలంగానూ, కేలరీలు తక్కువగానూ కలిగిన కూరగాయ. ఇందులో ఫైబర్‌ ఎక్కువశాతం వుంది. అంతేకాక వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

చిక్కుడు

చిక్కుడు

చిక్కుడు కాయగురాల్లో చలామంచిది. బీన్స్ ఉడికించి తెన్నా వేయించి తెన్నా మన శరీరానికి మేలుచేస్తాయి . వారానికి ఒకసారైనా తినాలి . ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి .

1. మునగకాయ: దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం.బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా దీనిని వుపయోగిస్తారు. ఎరువుగా కూడా దీన్ని వుపయోగిస్తారు. వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు వైద్యంలో వుపయోగిస్తున్నారు. విటమిన్‌ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు.
ఎలా తినాలి: వీటిని కూరల్లో విరివిగా వడుతారు. వేపుడుగాను, ఉడికించి నీటిని సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

2. బీట్‌రూట్‌: కేన్సర్‌తో పోరాడే అద్భుత గుణాలున్న బీట్‌రూట్‌లోని ఎర్రటి పిగ్మెంట్‌ సహజమైనది. అంతేకాకుండా ఇందులో ఫోలేట్‌లు అధికంగా వున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా కోలుకుంటారు. సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్‌ ఒకటి. దీని లాభాలు ఎన్నో తెలుసా! బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

ఎలా తినాలి: తాజా బీట్‌రూట్‌ను పచ్చిగానే తినొచ్చు. తురుముకుని సలాడ్‌రూపంలో తీసుకోవచ్చు. జ్యూస్‌ చేసుకున్నా ఓకే! కూరవండి కూడా తినొచ్చు కాకుంటే దానివల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్‌ శక్తి కొద్దిగా తగ్గుతుంది.

3. క్యాబేజ్‌: క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. పోషకాలు నిండుగా వున్న క్యాబేజ్‌ను మనం భలే నిర్లక్ష్యం చేస్తాం. ఇందులో వున్న సల్ఫోరాఫేన్‌ కేన్సర్‌ను పోరాడే ఎంజైమును అధికంగా వుందని తెలిస్తే? వాడకాన్ని పెంచుతాం కదూ?!

ఎలా తినాలి: విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. మనం సాధారణంగా తినే కూరలా కాక, సన్నగా తురుముకుని సలాడ్‌లా తీసుకోవచ్చు.

4. కాలీఫ్లవర్: పచ్చటి ఆకుల మధ్య ముద్దగా కనిపించే తెల్లటి పూలగుచ్ఛమే కాలీఫ్లవర్‌. ఇది ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్‌ బొకేలా ముచ్చటగా వుంటుంది. క్యాలీప్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి'ని తక్కువగా తీసుకుంటే డోపమైన్ తయారీని తగ్గిస్తుంది. ఆరోగ్య భావనలను కల్గిస్తుంది. క్యాలీప్లవర్ లో ఉత్పాత స్పూర్తిని పెంచే విటమిన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఒక కప్పు ఉడకపెట్టిన కాలీఫ్లవర్‌లో సి విటమిన్‌, పీచు పదార్థం పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ బి5, బి6, మాంగనీస్‌, ఫాటీ యాసిడ్లు కూడా అందులో వుంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, సోడియం మినరల్స్‌ కూడా కాలీఫ్లవర్‌లో లభిస్తాయి. కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కొందరిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. వీటిలో వుండే ప్యురీన్లు అనే పదార్థాలు దీనికి కారణం. అయితే అందరికీ ఈ సమస్య ఎదురుకాదు.

ఎలా తినాలి: కాలీఫ్లవర్ ను రకరకాలుగా తయారు చేస్తుంటారు. క్యాలీఫ్లర్ కుర్మా, కాలీఫ్లవర్ ఖీమా, కాలీఫ్లవర్ పరోటా, సైడ్ డిష్, సలాడ్, ఖుర్మా, ఫ్రై ఇలా రకరాకలుగా తయారు చేసి తినవచ్చు.

5. కాకరకాయ: కాకరకాయ చేదుగా ఉన్నా ఎంతో ఆరో గ్యాన్నిస్తుంది. జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. జ్వరం, నులి పురుగులను నశింప చేస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలను ఫొలేట్‌, మెగ్నీషియం, జింక కూడా సమృద్ధిగా అందిస్తుంది. ఎటువంటి వ్యాధి లేని వారు కూడా మంచి షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంచుకోవటం కోసం మరియు ఆరోగ్యాన్ని బాగా చూస్కోవటం కోసం కాకర కాయని తిస్కోవాలి. ఇందులో ఐరన్ బాగా ఎక్కువగా ఉండటం వలన మరియు కేలోరిస్ తక్కువగా ఉండటం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

ఎలా తినాలి: కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ కలదు.

6. పాలకూర : మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. * దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి. ఆరోగ్యానికి దోహదపడే దీన్ని అస్సలు పక్కన పెట్టొద్దు. ఇందులోని కెరోటినాయిడ్స్‌ మనకు అన్నివిధాలా మంచివి. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ‌ తదితరాలుంటాయి.

ఎలా తినాలి: పప్పు, కూర, పాలక్‌ పన్నీర్‌, పాలక్ చపాతీ, పాలక్ రైస్, దారులెన్నో!

7. గుమ్మడి మరియు గుమ్మడి గింజలు: గుమ్మడిలో విటమిన్‌ ఎ పుష్కలంగానూ, కేలరీలు తక్కువగానూ కలిగిన కూరగాయ. ఇందులో ఫైబర్‌ ఎక్కువశాతం వుంది. అంతేకాక వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఎలా తినాలి: కూర, పులుసు, సాంబారు, హల్వా... ఏదైనా సరే! గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా వుంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట!

ఎలా తినాలి: దోరగా వేపుకుని స్నాక్స్‌ రూపంలో తినొచ్చు. లేదంటే ముద్దలా నూరి కూరలో వేయొచ్చు. దానివల్ల గ్రేవీ రుచిగా తయారవుతుంది.

8. చిక్కుడు: చిక్కుడు కాయగురాల్లో చలామంచిది. బీన్స్ ఉడికించి తెన్నా వేయించి తెన్నా మన శరీరానికి మేలుచేస్తాయి . వారానికి ఒకసారైనా తినాలి . ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి . చిక్కుడు లో పీచుపదర్ధము ఎక్కువ ఉండడం వల్ల రక్తం లోని కొలెస్టరాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది . అనినో ఆమ్లాలు , పొటాసియం ఉన్నందున గుండె ఆరోగ్యం గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. బి విటమిన్లు , ఫోలేట్ సంవృద్దిగా ఉంటాయి . చిక్కుడు ఫాబేసి కుటుంబం కు చెందినవి. రకరకాల చిక్కుడు గోరు చిక్కుడు, సోయా చిక్కుడు, పందిరి చిక్కుడు వంటలలో, లేత చిక్కుడులో గింజలుండవు, తొక్కలతో తక్కువ సెల్యులోస్ ఉంటుంది, కనుక త్వరగా ఉడికి రుచిగా ఉంటుంది.

ఎలా తినాలి: వీటిని ఉడికించి తీసుకోవాలి. లేదా కూరల రూపంలో తీసుకోవాలి.

Story first published: Wednesday, October 3, 2012, 14:39 [IST]
Desktop Bottom Promotion