Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు 8 బెస్ట్ ఫుడ్స్
నేటి మహిళలను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలిలో మార్పులు ఇతరత్రా పలు కారణాల వల్ల పట్టణ మహిళల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో గడ్డ మాత్రమే కాదు ! మొదట్లో అది గడ్డగా మొదలై క్రమంగా శరీరంలో వేరే అవయవాలకు పాకుతుంది. అది ఇతర పర్యవసానాలకు దారితీస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏముంటాయి? కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నా (వంశపారంపర్యంగా). ఈస్ట్రోజన్ వాడకం ఎక్కువ ఉన్నా. 11 సంవత్సరాలలోపు రజస్వల అయితే.
గర్భధారణ అనేది 35 సంవత్సరాలు దాటిన స్త్రీలలో లేక మొదటి సారి గర్భధారణ 20 సంవత్సరాలలోపు వయసులో స్త్రీలకు అయినా ఈస్ట్రోజెన్‌తోపాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపి (ఎక్కువ మోతాదులో) చేసుకున్నా, ధూమపానం, మద్యపానం వల్ల. స్థూలకాయం వల్ల. పిల్లలకు పాలివ్వకపోయినా, బ్రెస్ట్ లావుగా ఉన్నవారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్ ఉంటే పిల్లలకూ వచ్చే అవకాశం ఎక్కువ. స్త్రీలలో బిఆర్‌సిఎ1/బిఆర్‌సిఎ2 మ్యూటేషన్లు ఉన్నా. దగ్గరి సంబంధీకుల్లో ఎవరైనా ఈ మహమ్మారినుంచీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మొదటినుంచీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

బీటా కెరొటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మామూలు క్యారట్ల కన్నా బేబీ క్యారట్లలో ఉండే బీటా కెరొటిన్‌ను శరీరం తేలిగ్గా గ్రహించగలుగుతుంది. ఆ తేడా ఏకంగా 500 శాతం ఎక్కువ. కాబట్టి లేలేత క్యారట్లను ఆహారంలో తప్పనిసరి అంశం చేసుకోవడం మంచిది.

నిండు ఎరుపుతో నోరూరించే చెర్రి పండ్లు తినండి. వాటిల్లో ఉండే ఒక పదార్థం క్యాన్సర్‌ని నిరోధిస్తుందని మంచి పేరు. పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి.

వెల్లుల్లి సైతం క్యాన్సర్ కణాల్ని చంపేస్తుంది. అయితే దాన్ని వండుతున్నట్లైతే మాత్రం పొట్టు తీసి, తరిగి ఒక పదినిమిషాలు ఉంచండి. తర్వాతే వంటలో వేయండి. పొట్టు తీయగానే వేడి చేస్తే అందులో క్యాన్సర్‌తో పోరాడే పదార్థాలు తయారయ్యే అవకాశం తగ్గుతుంది.

విటమిన్ డి తగుపాళ్లలో తీసుకునే వన్నిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువ. కాబట్టి వైద్య సలహాతో తగినంత విటమిన్ డి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

వీటిలోని లైకోపీన్ రొమ్ముక్యాన్సర్‌ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెజబ్బుల రిస్కూ తగ్గుతుంది. కూరల్లో, సూపుల్లో, రసం తీసి... ఏదో ఒక రూపంలో టమాటా తీసుకుంటే అందులో ఉండే లైకోపిన్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. రిఫైన్‌డ్ ధాన్యం కన్నా తక్కువ పాలిష్ పట్టిన ధాన్యం వాడాలి. పూర్తిగా రిఫైన్‌డ్ ధాన్యం వాడిన మహిళల్లో బ్రెస్ట క్యాన్సర్ ఎక్కువగా వచ్చినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. చల్లగా అయినా, వేడిగా అయినా గ్రీన్ టీ తాగండి. కాన్సర్ ని నివారించే గుణాలు గ్రీన్ టీలో ఉన్నట్లు కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. రొమ్ము కేన్సర్ను నిరోధించడంలో గ్రీన్ టీలోని 'పాలిఫినోన్ ఇ' అనే మూలకం కీలక పాత్ర పోషిస్తుందని నిర్ధారించారు.

వారానికి రెండుసార్లు పాలకూర తిన్నవాళ్లలో... బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం సగానికి సగం తగ్గినట్లు పరిశోధనలో తేలింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.



Click it and Unblock the Notifications
