హైపోథైరాయిడ్ ను రాకుండా కాపాడే ఆహారాలు..

ఎలాంటి శారీరక చర్యలేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఆహారంలో సమతుల్యత లోపించడంతో చాలా మందితోపాటు యువత కూడా హైపోథైరాయిడిజం బారినపడుతున్నారని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాధి స్త్రీపురుషుల్లో ఎవరికైనా రావచ్చు. ఎక్కువ శాతం మహిళలో కనిపిస్తుంది. స్త్రీ పురు షుల నిష్పత్తి 6:1. ప్రజలు హైపోథైరాయిడిజంతో బాధపడటానికి ఆహారంలో అయోడిన్‌ లోపమే ప్రధాన కారణం. ఆహారంలో ఐయోడిన్‌ లోపం లేని ప్రాంతాలలో కూడా ప్రైమరీ హైపోథైరాయిడి జమ్‌ రావడానికి హసిమోటోస్‌ థైరాయిడైటిస్‌ అనే స్థితి 90శాతం కారణమవుతోంది.

హైపోథైరాయిడిజం అంటే? థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనపుడు ఏర్పడే పరిస్థితిని హైపోథైరాయిడిజం అంటారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. హైపోథైరాయిడిజంను రెండు రకాలుగా విభజించవచ్చు.

ప్రాథమిక రకం: సాధారణంగా ఈ సమస్య థైరాయిడ్ గ్రంథిలోనే ఏర్పడుతుంది. థైరాయిడ్ గ్రంథి తగినన్ని థైరాయిడ్ హర్మోన్లను ఉత్పత్తి చేయదు.

రెండవరకం: కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కాక పీయూష గ్రంథిలో సమస్య కారణంగా హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది.

లక్షణాలు: హైపోథైరాయిడిజం సాధరాణంగా బలహీనత, బద్ధకం, నీరసం, ఎక్కువగా తినకపోయినా బరువు పెరగడం, గొంతు బొంగురుపోవడం, చలిని తట్టుకోలేకపోవడం, మలబద్దకం, రుతుక్షికమ సమయంలో అధిక రక్తవూసావం, గుండె, నాడి బలహీనంగా కొట్టుకోవడం, కొన్ని సమయాలలో హైబ్లడ్ ప్రెషర్ ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖం పాలిపోయి ఉండటం, మాట మెల్లగా రావడం, కనుగుడ్లు చిన్నవి కావడం. ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, తన చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకపోవడం. చర్మం పొడిగా, ఎండిపోయినట్లు ఉండడం, గోళ్లు పలుచనై, చిట్లిపోవడం. తల వెంట్రుకలు పలుచనైపోయి ఎండిపోయినట్లు ఉండడం. కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లు నొప్పిగా ఉండడం. ఈ హైపోథైరాయిడిజం నుండి బయట పడాలంటే కొన్ని ముఖ్యమైన ఆహారాలు తీసుకోవాలి. మరి ఆ ఆహారాలేంటో చూద్దాం...

హైపోథైరాయిడ్ కు చెక్ పెట్టే ఆహారాలు..

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు మంచి పండ్లు మరియు కూరగాయలను ప్రతి రోజూ తీసుకొనే డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి. మీరు తీసుకొనే పండ్లు, కూరగాయల ద్వారా ఎక్కువ ఫైబర్ శరీరానికి అందటం వల్ల అలసట నుండి బయటపడవచ్చు. అంతే కాదు జీర్ణ శక్తిని పెంపొందించుకోవచ్చు. హైపోథైరాయిడిజం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు రాకుండా ఉండాలంటే బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, ధాన్యాలు, మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

హైపోథైరాయిడ్ కు చెక్ పెట్టే ఆహారాలు..

జ్యూస్ ఫ్రూట్స్: జ్యూస్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని పెంచి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా,కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఉపాయం. పండ్లలో ముఖ్యంగా బ్లూబెర్రీస్, చెర్రీస్, రెడ్ ప్లమ్, కివి, టమోటోలు, క్యారెట్స్, స్వీట్ పొటాటో వంటివి మీ డైలీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి.

హైపోథైరాయిడ్ కు చెక్ పెట్టే ఆహారాలు..

ధాన్యాలు: ధాన్యాలలో ముఖ్యంగా బ్రౌన్ రైస్, ఓట్ మీల్, బార్లీ, వంటివి తినడం వల్ల ఇందులో అధిక శాతంలో విటమిన్ బి మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. థైరాయిడ్ కు కారణమయ్యే హార్మోన్స్ మీద ధాడిచేసి రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండు ఈ ధాన్యాలలో లో గ్లిసిమిక్ శరీరంలోని రక్తంలోని చెక్కర స్థాయిలను క్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది.

హైపోథైరాయిడ్ కు చెక్ పెట్టే ఆహారాలు..

ఫాట్ ఫిష్: సాల్మన్, మెక్రేల్, ట్రోట్ వంటి కొన్ని రకాల చేపలను తీసుకోవడం వల్ల వాటిలో అధిక శాతంలో ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఎవరికైతే లోథైరాయిడ్ సమస్య కలిగి ఉంటారో వారిని ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారారలను తీసుకోమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ఈ ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది.

హైపోథైరాయిడ్ కు చెక్ పెట్టే ఆహారాలు..

పౌల్ట్రీ: పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అంటే గుడ్లు, చికెన్, టర్కీ బ్రెస్ట్ లోథైరాయిడ్ సమస్య కలిగిన వారు వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ ఐరన్, జింక్, మరియు విటమిన్ డి అధిక శాతంలోశరీరానికి అంధిస్తుంది. ఐరన్ లోపం వల్ల కూడ హైపోథైరాయిడిజం మరింత తీవ్రమవుతుంది కాబట్టి లోథైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు వారి తీసుకొనే ఆహారంలో పౌల్టీ ఆహరం ఉండేలా చూసుకోవాలి.

థైరాయిడ్ సమస్యలు ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. కాబట్టి ఒక సమతుల్య జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులను చేసుకొన్నట్లైతే థైరాయిడ్ యొక్క సమస్యాత్మక లక్షణాలను అధిగమించవచ్చు.

Story first published: Thursday, December 27, 2012, 8:02 [IST]
Desktop Bottom Promotion