For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చ్యూయింగ్ గమ్ తింటే ప్రయోజనాలు!

By B N Sharma
|
Health Benefits Of Chewing Gums!
నేటి రోజులలో చాలామంది పిల్లలు, పెద్దలు చ్యూయింగ్ గమ్ లు మౌత్ ఫ్రెషనర్స్ గా వాడుతూ ఆనందిస్తున్నారు. వీటివలన కొన్ని మంచి ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని కూడా నిపుణులు భావిస్తున్నారు. భోజనంత ర్వాత లేదా బోర్ కొట్టినపుడు దీనిని వేసుకొని నమలటం మొదలెడతారు. రీసెర్చర్లమేరరకు చ్యూయింగ్ గమ్ ప్రయోజనాలేమిటో చూడండి.

బరువు తగ్గటం - చ్చూయింగ్ గమ్ నమిలితే, బరువు తగ్గేందుకు సహకరిస్తుందనేది తాజాగా వెల్లడించిన ఒక ఆశ్చర్యకర విషయం. తక్కువ కేలరీలు వుండే గమ్ లు కొవ్వు లేకుండా వుంటాయి. కొవ్వును ఖర్చుచేయటానికి సహకరిస్తాయి. నమలటం ద్వారా, మీరు మీ దవడలకు పని చెపుతారు. అవి షుగర్ ఫ్రీ అయినా, కాకపోయినా, ఆకలిని, స్వీట్ తినాలనే కోరికలను నియంత్రిస్తాయి. గంటకు షుమారు 11 కేలరీలు కరిగిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది - చ్చూయింగ్ గమ్ పేగుల పనితీరు మెరుగుపరుస్తుంది. గమ్ నమిలితే, మీ నోరు కొంత లాలాజలాన్ని ఊరిస్తుంది. దానిని తరచుగా మీరు మింగేస్తూ వుంటారు. లాలాజలం జీర్ణ రసాలను పొట్టలో అణచివేసి, గొంతులోకి రాకుండా చేస్తుంది.

నోటి ఆరోగ్యం - గమ్ నమిలితే, లాలాజలం వస్తుంది. అది దంతాలు పాడవకుండా చేస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వెయిట్ లాస్ లో ప్రయోజనం సరిగా ఇవ్వకపోయినా, నోటి ఆరోగ్యం తప్పక ఇస్తుంది. అయితే, షుగర్ లేని చ్యూయింగ్ గమ్ లు తినండి, దంతాలు పాడవకుండా వుంటాయి. కృత్రిమ తీపి పదార్ధాలు, బరువు పెంచి, దంతాలను పాడుచేస్తాయి.

తెల్లటి దంతాలు - చ్యూయింగ్ గమ్ తింటే అది తెల్లని దంతాలు ఇవ్వటమే కాక, దవడలను గట్టిపరుస్తుంది. డబుల్ ఛిన్ అంటే గడ్డం కింద లావుగా వున్నవారు దీనిని తింటే మంచి ఫలితం వస్తుంది. ఇది నోటి దుర్వాసన పోగొట్టి దంతాలపై మురికి లేకుండా కూడా చేస్తుంది.

చ్యూయింగ్ గమ్ వలన ఇవి కొన్ని ప్రయోజనాలు, అయితే, మీరు తినే చ్యూయింగ్ గమ్ షుగర్ లేనిదిగా తింటే దంత సమస్యలు రాకుండా వుంటాయి. నోటి దుర్వాసన తొలగించి, బరువు తగ్గిస్తుంది. అయితే, ఆరోగ్యప్రయోజనాలున్నాయి కదా అని వీటిని అధికంగా తింటే, హాని కూడా కలుగుతుందని గుర్తించండి.

English summary

Health Benefits Of Chewing Gums! | నమిలితే మజా....నోటికి ఆరోగ్యం!

These are few health benefits of chewing a gum. Always chew sugar-free gums to fight cavity, reduce mouth odour and lose weight! Although chewing gums have surprising benefits for the body, it doesn't mean you keep chewing every time. Excessive consumption of anything is harmful for the body!!!
Story first published:Thursday, April 12, 2012, 11:02 [IST]
Desktop Bottom Promotion