For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వులు-నువ్వుల నూనెలో బోలెడు ఆరోగ్య రహస్యాలు...

సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వాటి వాడకం ఎక్కువ. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వుల విత్తనాల నుంచి తయా

|

సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వాటి వాడకం ఎక్కువ. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వుల విత్తనాల నుంచి తయారు చేసిన నువ్వుల నూనె ఇటు వంటకాలలోను, అటు ఆయుర్వేద పరంగాను ప్రపంచ వ్యాప్తంగా విరివిగా వినియోగించబడుతోంది. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అదే నువ్వుల ప్రత్యేకత.

నువ్వులనూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగించే నువ్వులను ఆహారంలో భాగం చేసుకుంటే నవ్వులు రువ్వుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. నువ్వుల నూనె శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం..

Health Benefits of Sesame Oil...

యాంటిఆక్సిడెంట్ గా: నువ్వుల నూనెలో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసేవారు. పూర్వం రోజుల్లో అభ్యంగన స్నానం అంటే, పూర్తిగా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని కొద్దిసేపు శరీరానికి ఇంకిన తరువాత తలంటు పోయడం వల్ల శరీరానికి లోపల, వెలుపల కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి శక్తిని కలిగిస్తుందని, చురుకుదన్నాన్ని పెంచుతుందని, మెదడుకి చల్లదనాన్ని చేకూర్చి జ్ఞాపకశక్తిని వృద్ధిచేస్తుందని వైద్య శాస్త్రాలు చెపుతున్నాయి.

మధుమేహానికి: 2011లో ప్రచురించబడిని ఓ అద్యయనం ప్రకారం టైప్ 2 మధుమేహ గ్రస్తులకు ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. అధిక మూత్ర వ్యాధితో బాధపడేవారు నువ్వులు పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి సేవిస్తూ వుంటే మంచి ఉపశమనం పొందడమే కాకుండా ఎముకల వ్యాధులు, కీళ్ళనొప్పులు, చర్మ రోగాలు దూరమవుతాయి.

చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వల నూనెలో ఉన్న ఇ మరియు బి విటమిన్ లు చర్మానికి సంబంధిచిన అన్నిరకాల సమస్యలను దూరం చూసే గుణం ఇందులో పుష్కలంగా ఉంది. నువ్వులన నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖంను ఫ్రెష్ గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.

రుమటాయిడ్ ఆర్థరైటీస్: ఎముకల బలహీనతతో బాధ పడే పెద్ద వారు, ఆస్టియోపొరాసిస్‌ వంటి చికాకులతో ఉన్నవారు కూడా చెంచాడు నువ్వుల్ని నానబెట్టి ఉదయాన్నే పాలలో కలిపి సేవిస్తే ఈ రుగ్మతల నుంచి బయట పడవచ్చు. పిల్లలకిగానీ, పెద్దవారికి గానీ, రక్త హీనత తగ్గి రక్తం బాగా వృద్ధిచెందాలంటే, టీస్పూన్‌ నువ్వులు నానబెట్టి నిత్యం మూడునెలలపాటు తీసుకుంటే రక్తం వృద్ధిచెందడమే కాకుండా ఉదర సంబంధవ్యాధుల్ని నిర్మూలిస్తుంది.

నువ్వులు, శుద్ధిచేసిన జీడి గింజలు, కరక్కాయలు, బెల్లం సమంగా కలిపి మెత్తని ముద్దగా నూరి కుంకుడు గింజంత మోతాదులో తీసుకుంటే జ్వరం, రక్తహీనత, ప్లీహం పెరగటం, దగ్గు, ఉబ్బసం, అర్శమొలలు నశిస్తాయి. అంతే కాదు నువ్వులనూనెను తలకు రుద్దడం వల్ల చుండ్రు వదులుతుంది.

నువ్వులను నూనెను: జుట్టు సంరక్షించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి పల్లేరు కాయలు, నువ్వుపువ్వులు, తేనె, నెయ్యి సమంగా తీసుకొని మెత్తని ముద్దగా నూరి కేశాలు రాలినచోట ప్రయోగించి రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది.

నువ్వులను గర్భిణీలు వాడితే అబార్షన్ జరిగే రిస్కు కొంతవరకూ ఉండవచ్చు కనుక జాగ్రత్తపడాలి.

ఇలా అనేక ఔషథగుణాలున్న నువ్వులు రోజుకి కేవలం 20 నుంచి 30 గ్రాముల వరకే తీసుకోవాలి. వెూతాదు పెరిగితే, అజీర్నంతో కడుపు బరువెక్కడం, విరేచనాలు, కాళ్లు, చేతులు లాగడం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి.

English summary

Health Benefits of Sesame Oil... | ఆరోగ్యానికి అమృతం వంటిది..

Sesame oil is extracted from sesame seeds. Sesamum indicum is the scientific name given for sesame seeds and is one of the oils which is used since ancient lore.The use of sesame seeds dates back to the ancient Egyptian era around 1500 B.C, when it was used to treat pain.
Desktop Bottom Promotion