Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
మైక్రోవేవ్ ఓవెన్ లో మనసుపడే ఆహారాలు!

మరి మైక్రోవేవ్ ఒవెన్ లో తయారు చేయగల ఆరోగ్యకర ఆహారాలు ఏమేమిటో చూడండి....
బ్రౌన్ రైస్ - గ్యాస్, ఎంతో సమయం అన్ని పెట్టి అన్నాన్ని స్టవ్ పై ఉడికించే కంటే, వాటిని మైక్రోవేవ్ లో వండేయండి. బరువు తగ్గాలని భావిస్తే బ్రౌన్ రైస్ వండండి. మైక్రోవేవ్ లో పెట్టే ముందు బియ్యం బాగా రెండు లేదా మూడు సార్లు కడగాలి. నీటిలో ఒక అరగంట నానపెట్టండి. అపుడు పోషకాలు బయటకు పోకుండా బియ్యం నుండి గంజి తీసివేయబడుతుంది.
గుడ్లు - ఫారం గుడ్లు కొవ్వు తక్కువగా వుండటమే కాదు, పోషకాలు కూడా బాగా కలిగి వుంటాయి. వీటిని వేయించాలంటే నూనె అవసరం లేదు. నేరుగా మైక్రోవేవ్ లో పెట్టి తయారు చేయండి. దీనికి కొన్ని మసాలాలు కలిపి వేడి చేస్తే, తినటానికి రెడీ అయిపోతాయి.
మొక్క జొన్న - మొక్క జొన్నతో ఎన్నో డిష్ లు చేసుకోవచ్చు. మొక్కజొన్న మరియు వాటికి కొంచెంగా నిమ్మరసం కలపండి. ఒక చెంచా వెన్న కలపండి. ఈ వంటకం ఎంతో ఆరోగ్యం, కడుపు నుంపుతుంది. సాయంత్రం స్నాక్ గా దానిని కొన్ని మసాలాలు కూడా కలిపి తినవచ్చు.
పాప్ కార్న్ - ఈ పాప్ కార్న్ అందరూ అన్ని సమయాలలో ఇష్టపడే తిండి. తక్కువ కొవ్వు వుండే ఈపాప్ కార్న్ ఎంతో తేలికగా మైక్రోవేవ్ లో వండి కర కర మంటూ తింటూ టి.వి.లో మేచ్ చూడవచ్చు.
ఫ్రూట్ సలాడ్ - తియ్యగా తినాలనుకుంటున్నారా? కొన్ని పండ్లముక్కలు కోయండి వాటిని మైక్రోవేవ్ లో పెట్టేయండి. వాటిపై చాక్లెట్ సిరప్ లేదా క్రీమ్ వంటివి వేసి ఫ్రూట్ సలాడ్ అంటూ తినేయండి.
బీట్ రూట్ - ఆరోగ్యకరమైన గుండె, శరీరానికి, బీట్ రూట్ రసం చాలా మంచిది. బీట్ రూట్ తరిగి నీటిలో 8 నుండి 10 నిమిషాలు మైక్రోవేవ్ చేయండి. దీనికి ఉప్పు, పెప్పర్ పౌడర్ కలపండి. వేడి సలాడ్ అందరికి తినేందుకు ఇవ్వండి. మైక్రోవేవ్ కారణంగా శరీరంలో వుండే మలినాలు వేడి ఆహారాలతో తొలగి, మీ బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తాయి.
ఈ ఆరోగ్యకర ఆహారాలు మీరు ఆనందంగా మైక్రోవేవ్ లో వండేయవచ్చు. ఎపుడైనా మీరు త్వరగా బయటకు వెళ్ళాలనుకుంటే, ఇవి ఉపయోగపడతాయి. అవి కడుపు నింపటమే కాదు, ఆరోగ్యం కూడాను.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
