Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వచ్చేది వర్కింగ్ కు - మొదలెట్టేది స్నాకింగ్ !

పనిచేసేటపుడు కంపల్సరీ - చిప్స్, బిస్కట్లు, చాక్లెట్లు మొదలైనవి పనిలోపడి ఒక్కటొక్కటిగా తినేస్తూ వుంటారు. దీనివలన మీకు ఎనర్జీ వచ్చేది సరైనదే. కాని చివరకు ఈ తిండ్లు మీలో అనవసరమైన కొవ్వు డిపాజిట్ చేస్తాయి. స్నాక్స్ లో వుండే ఉప్పు మీలో రక్తపోటు కలిగిస్తుంది. నీరు నిలబడి వుండేలా చేస్తుంది. అందుకుగాను అన్ని రకాలు డ్రాయర్ లో పెట్టుకోకండి. తినే ఒక్క ఆహారం కూడా తక్కువ తినండి.
కాఫీలు, టీలు - ప్రతి రెండు గంటలకు కాఫీ లేదా టీ తాగేయటం అలవాటయ్యిందా? ఇవి అధికమైతే, చికాకు, కోపం, శరీరంలో నీరు కొరవడటం వంటివి ఏర్పడి మీ నిద్రను సైతం నష్టపరుస్తాయి. ఇక భోజనం ముందు వీటిని తీసుకుంటే....భోజనంలో పోషకాలు కూడా వృధా అయిపోతాయి. వీటికి బదులు, గ్రీన్ టీ, నిమ్మరసం, పండ్లరసం వంటివి తాగటానికి ప్రయత్నించండి. లేదా తాగే కాఫీ, టీలు చిన్న కప్పుకు మాత్రమే లిమిట్ చేయండి.
తగినంత నీరు తాగరు - నేటిరోజుల్లో ఆఫీసులు ఎయిర్ కండిషన్డు గదులు కావటంతో చెమట పట్టదు. దాహం వేయదు. తాగే అవసరం వుండదు. తాగినా శరీరం అధికంగా భావిస్తుంది. ఇదే కొనసాగితే, మీలో మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అధిక ఆకలి, డీహైడ్రేషన్ అన్నీ ఏర్పడి మీ చర్మం సైతం వన్నె తగ్గుతుంది. దీనికిగాను ఒక బాటిల్ నీరు మీ టేబుల్ వద్ద పెట్టుకొని సాయంత్రానికల్లా దానిని పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోండి.
అధిక భోజనం - ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళి రాత్రి భోజనం ఇక ఎంతో ఆత్రంగా అధికంగా తినేస్తారు. లేటుగా తింటే అది శరీరానికి హాని చేస్తుంది. ఆ సమయంలో శరీరానికి అవసరమైంది విశ్రాంతి, నిద్ర కాని ఆహారాలు కాదు. మీరు తినే అధిక కార్బోహైడ్రేట్ల అన్నం వంటి పదార్ధాలు, మీరు నిద్రించే సమయానికి ముందే శరీరం జీర్ణం చేసుకోలేదు. తిని పడుకుంటే, ఇక అవి మీ శరీరంలో కొవ్వుగా డిపాజిట్ అయిపోతాయి. పగలంతా మీ శరీరానికి అవసరమైన ఆహారం ఇచ్చారు. మరల రాత్రి అదనంగా ఇచ్చిన ఆహారం శరీరానికి అవసరం లేక కొవ్వు ఏర్పరచి లావు అయేలా చేస్తుంది.
అందుకని, రాత్రి భోజనం లైట్ గా కొన్ని కూరలు, ప్రొటీన్లు మాత్రమే వుండేలా చూసుకోండి. పీచు అధికంగా వుండే కూరలు, ప్రొటీన్లు మీ కడుపు నింపి అవసరమైన కేలరీలు మాత్రమే అందించేలా చూడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications