Latest Updates
-
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
పెళ్లికి ముందే ఆస్తుల ఒప్పందం… ఇది విడాకుల కోసమా లేక బంధం కోసం భద్రతా? అసలు నిజం ఇదే! -
మే 18: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందేమో చూడండి! -
రాజయోగం, ధన యోగం కలయిక.. ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మైసూర్ మటన్ పులావ్..టేస్ట్ కి సలాం కొట్టాల్సిందే!..ఈజీగా చేసుకోండిలా.. -
ఈరోజు సోమవారం.. పనులు మొదలుపెట్టే ముందు ఈ రాహుకాలం, శుభ ముహూర్తాలు చూసుకున్నారా? -
కడుపుకు తేలికగా, నోటికి రుచిగా ఉండే కమ్మనిపెరుగు ఉప్మా.. బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్ ఆప్షన్! -
రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. జీవితంలో ఊహించని మార్పులు! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 18 మే 2026 -
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్
పీరియడ్స్ లో పొట్ట నొప్పిని పోగొట్టే అద్భుతమైన చిట్కాలు...!
అడవాళ్లను ముఖ్యంగా వేధించే సమస్య పిరియడ్ ప్రాబ్లమ్... ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా అవస్థపడతారు.. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి.
కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది.ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతు ఉన్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి. ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగావుంది అని గ్రహించాలి. వెంటనే తగు చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి.
మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే...కొన్ని చిట్కాలు చూడండి.
ఈ అంశంపై విదేశాల్లో సైతం పరిశొధనలు జరిగాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో నెలసరి నొప్పిని తట్టుకోవడానికి, బాధ నుంచి ఉపశ మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే పొందవచ్చు అన్న విషయం స్పష్టమైంది. నొప్పిని ఎదుర్కోవడానికి మహిళలు ఉపయోగిస్తున్న చిట్కాలు వారికి త్వరగా ఉపశమనం కలిగిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం...

హెర్బల్ టీ: టీ పోడితో కాకుండా ఆకులతో చేసిన టీ తాగితే నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

వేడి నీళ్ల స్నానం: వేడి నీళ్లతో స్నానం చేయడంవల్ల వెన్ను నొప్పి, ఒంటి నొప్పులను ఎదుర్కొనవచ్చు. ఇదే కాకుండా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వటానికి ఏదైన మంచి చిత్రం చూడటం లేదా ఏదైనా చిక్సిత తీసుకుంటేనొప్పి నుంచి కొంత రిలాక్స్‌నెస్ పొందవచ్చు.

మసాజ్: వెన్ను మర్దన వల్ల వెన్ను, కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతుంది.

వేడి నీళ్ల కాపడం: వేడి నీళ్లు ఒక సంచిలో పోసి దానితో వెన్ను, కడుపు చుట్టూ పెట్టడంవల్ల నొప్పి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది.

చాక్లెట్: చాక్లెట్ బార్ తినడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వ్యాయామం: కొన్ని యోగా భంగిమలు కమలాసనం, సీతాకోకచిలుక ఆసనం వంటివి పీరియడ్‌వల్ల కలిగేనొప్పిని, అసౌకర్యాన్ని దూరం చేస్తాయి.



Click it and Unblock the Notifications