Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
బ్యాక్ పెయిన్(వెన్ను నొప్పి)కి కారణాలు.. నివారణ చర్యలు....!?

నడుము నొప్పి అనేది మహిళలకు మాత్రమే ప్రత్యేం కాదు. స్త్రీపురుషులందరికీ అది వచ్చేదే అయినా, మహిళలకు కొంచెం ఎక్కువగానే వస్తుంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మరీ అధికం. మగవాళ్ళకన్నా స్ర్తీలు సాధారణంగా శారీరకంగా తక్కువ శ్రమ ఉండేపనులు చేస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మాత్రం వెన్నుపూసమీద భారం అధికమౌతుంది. సాధారణ వ్యక్తుల్లో వెన్ను నొప్పి రావడానికి కారణాలేంటి? వాటికి తీసుకోవాలసిన జాగ్రత్తలేంటో చూద్దాం...
బ్యాక్ పెయిన్ కి కారణాలు:
1. తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం.
2. కంప్యూటర్స్ ముందు ఎక్కువ సేపు కదలకుండా విధులు నిర్వర్తించటం.
3. పడక సరిగా కుదరనప్పుడు, ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.
4. స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉప యాగించిన కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం.
5. ప్రమాదాలలో వెన్ను పూసలు దెబ్బ తినటం లేదా ప్రక్కకు తొలగటం వలన నడుము నొప్పివస్తుంది.
6. కండరాలు బలహీనంగా ఉండటం, కూర్చోటం, నిలబడటం వగరాలలో సరైన భంగిమలను పాటించకపోవడం వంటివి అని తెలస్తుంది.
7. ఇటీవల కాలంలో పని, ప్రయాణం, ఆఖరికి కొన్ని రకాల ఆటలు కూడా కూర్చొని ఆడేవే. దీని వల్ల నడుంపై భారం బాగా పెరుగుతోంది. పని టెన్షన్ వల్ల నడుం కండరాలు సంకోచిస్తాయి. రక్త సరఫరా తగ్గవచ్చు. వీటన్నింటి వల్ల నడుం నొప్పి వస్తుంది.
8. పని టెన్షన్ వల్ల నడుం కండరాలు సంకోచిస్తాయి. రక్త సరఫరా తగ్గవచ్చు. వీటన్నింటి వల్ల నడుం నొప్పి వస్తుంది.
బ్యాక్ పెయిన్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు...
1. బ్యాక్ పెయిన్ నివారణ కోసం ప్రతి రోజూ వ్యాయామం, యోగా వంటివి బాగా ఉపయోగపడుతాయి.
2. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయం తగ్గించుకోవాలి. శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
3. నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్ బ్యాగ్ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
4. ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చు న్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి.
5. వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి.
6. సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
7. సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
8. కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.
9. వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.
10. మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి. మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.
11. ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
12. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
