Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
భోజన సమయంలో నీరు తాగితే?

సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం. ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి. ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే, సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు. అయితే, ఘన పదార్ధాలు తినేటపుడు, లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ రకంగా నీరు తాగితే, అది జీర్ణ వ్యవస్ధకు హాని కలిగిస్తుందని, జీర్ణ శక్తిని కోల్పోయేలా చేస్తుందని వీరంటారు.
మరి నీరు ఎప్పుడు తాగాలి? భోజనానికి సరిగ్గా అరగంట ముందు నీరు తాగితే, మీరు తినే ఘన ఆహారాలకు తాగిన నీరు జీర్ణక్రియకు సహకరిస్తుంది. లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని, ఈ రకంగా తాగే నీరు, పొట్టలో జీర్ణమైన ఆహారాన్ని, రసాలను తొలగించి శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుందని, ఈ రకంగా తాగే నీరు జీర్ణ క్రియకు ఏ మాత్రం అడ్డంకి కాదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. నీటిని అవసరం లేని సమయాలలో శరీరానికి అందించితే అది గ్యాస్ సమస్యలకు కూడా దోవతీయవచ్చంటున్నారు.
రోజు మొత్తం మీద శరీరానికి నీటిని ఎలా అందించాలి? ఉదయం లేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగాలి. మధ్యాహ్నం లంచ్ సమయంవరకు నిర్దేశిత కాల వ్యవధితో మరో లీటర్ తాగాలి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మొదలుపెట్టి సాయంకాలం స్నాక్స్ లేదా చిరుతిండి వరకు మరో లీటరు నీరు అప్పుడపుడూ, ఆపై రాత్రి డిన్నర్ లోపుగా మరో లీటర్ అంచెలవారీగా తాగితే మొత్తంగా నాలుగు లీటర్ల నీరు ప్రతిరోజూ శరీరానికి అందించినట్లవుతుందని. ఈ క్రమంలో తీసుకునే నీరు తిన్న ఆహారం బాగా జీర్ణమవటానికి, రక్తంలో కలవటానికి, మరుసటిరోజు మలబద్ధకం ఏర్పడకుండా వుండటానికి సహకరిస్తుందని చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
