Latest Updates
-
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే!
అనారోగ్యాన్నిచ్చే ఆఫీస్ తిండ్లు!

చేయి నోరు ఆడే చిరుతిండ్లు - చిప్స్, బిస్కట్లు, చాక్లెట్లు మొదలైనవి పనిలోపడి ఒక్కటొక్కటిగా తినేస్తూ వుంటారు. దీనివలన మీకు ఎనర్జీ వచ్చేది సరైనదే. కాని చివరకు ఈ తిండ్లు మీలో అనవసరమైన కొవ్వు డిపాజిట్ చేస్తాయి. స్నాక్స్ లో వుండే ఉప్పు మీలో రక్తపోటు కలిగిస్తుంది. నీరు నిలబడి వుండేలా చేస్తుంది. అందుకుగాను అన్ని రకాలు డ్రాయర్ లో పెట్టుకోకండి. తినే ఒక్క ఆహారం కూడా తక్కువ తినండి.
కాఫీలు, టీలు - ప్రతి రెండు గంటలకు కాఫీ లేదా టీ తాగేయటం అలవాటయ్యిందా? ఇవి అధికమైతే, చికాకు, కోపం, శరీరంలో నీరు కొరవడటం వంటివి ఏర్పడి మీ నిద్రను సైతం నష్టపరుస్తాయి. ఇక భోజనం ముందు వీటిని తీసుకుంటే....భోజనంలో పోషకాలు కూడా వృధా అయిపోతాయి. వీటికి బదులు, గ్రీన్ టీ, నిమ్మరసం, పండ్లరసం వంటివి తాగటానికి ప్రయత్నించండి. లేదా తాగే కాఫీ, టీలు చిన్న కప్పుకు మాత్రమే లిమిట్ చేయండి.
తగినంత నీరు తాగరు - నేటిరోజుల్లో ఆఫీసులు ఎయిర్ కండిషన్డు గదులు కావటంతో చెమట పట్టదు. దాహం వేయదు. తాగే అవసరం వుండదు. తాగినా శరీరం అధికంగా భావిస్తుంది. ఇదే కొనసాగితే, మీలో మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అధిక ఆకలి, డీహైడ్రేషన్ అన్నీ ఏర్పడి మీ చర్మం సైతం వన్నె తగ్గుతుంది. దీనికిగాను ఒక బాటిల్ నీరు మీ టేబుల్ వద్ద పెట్టుకొని సాయంత్రానికల్లా దానిని పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోండి.
అధిక భోజనం - ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత లేటుగా అయినా సరే రాత్రి భోజనం ఇక ఎంతో ఆత్రంగా అధికంగా తినేస్తారు. కడుపు నిండా తింటే గాని భోజనం ముందునుండి లేవరు. లేటుగా తింటే అది శరీరానికి హాని చేస్తుంది. రాత్రి సమయంలో శరీరానికి అవసరమైంది విశ్రాంతి, నిద్రలు కాని ఆహారాలు కాదు. మీరు తినే అధిక కార్బోహైడ్రేట్ల అన్నం వంటి పదార్ధాలు, త్వరగా తింటే మీరు నిద్రించే సమయానికి ముందే శరీరం జీర్ణం చేసుకోగలదు. కాని లేటుగా పడుకుంటే, శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికి జీర్ణ వ్యవస్ధకు అది జీర్ణం చేసేటంతవరకు పని వుండి, మీకు నిద్ర కూడా సరిగా పట్టనివ్వదు. ఫలితంగా నిద్రలోనే అలసట ఏర్పడుతుంది.
తిని పడుకుంటే, మీరు తిన్న ఆహారాలు మీ శరీరంలో కొవ్వుగా డిపాజిట్ అయిపోతాయి. పగలంతా మీ శరీరానికి అవసరమైన ఆహారం ఇచ్చారు. మరల రాత్రి అదనంగా ఇచ్చిన ఆహారం శరీరానికి అవసరం లేక కొవ్వు ఏర్పరచి లావు అయేలా చేస్తుంది. అందుకని, రాత్రి భోజనం లైట్ గా కొన్ని కూరలు, ప్రొటీన్లు మాత్రమే వుండేలా చూసుకోండి. పీచు అధికంగా వుండే కూరలు, ప్రొటీన్లు మీ కడుపు నింపి అవసరమైన కేలరీలు మాత్రమే అందించేలా చూడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
