Latest Updates
-
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
దంతాలను అతి సులభంగా పాడు చేసే కొన్ని చిరుతిండ్లు...
సాధారణంగా ప్రతి మనిషి తన ఆరోగ్యంపట్ల కాస్తో కూస్తో శ్రద్ధ వహిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా సౌందర్య పోషణకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంటాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మరింత శక్తివంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. శరీరంలోని ప్రతి భాగాలపట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకొంటుంటాడుపడుతుంటాడు. శిరోజాలకూ అంతే ప్రాధాన్యమిస్తాడు.
అయితే మన దేహ అంతర్భాగాలు ఆరోగ్యం ఉండాలంటే వాటికి మించిన పరిశుభ్రంగా ఉంచుకోవాలసిన దంతాలపట్ల మాత్రం పెద్దగా శ్రద్ధ చూపడు. ఇది దాదాపు ప్రతి మనవుడి నైజం. దంత పరిరక్షణ లేకపోతే జీర్ణవ్యవస్థ పరిశుభ్రంగా ఉండదన్న కనీస జ్ఞాన్ని విస్మరిస్తుంటాడు. దంత క్షయం ద్వారా వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక వాటిపట్ల ఏమరపాటుగా ఉంటాడు. గుండె, ఊపిరితుత్తులలాగానే దంతాలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రతి మనిషీ గుర్తించాలి.

చీజ్
డైరీ ప్రొడక్ట్ అయినటువంటి చీజ్ ను మంచి రుచి కోసం వంటకాల్లో సాధారణంగా ఉపయోగిస్తుంటారు. నోరూరించే చీజ్ చూడగానే తినేయాలనిపిస్తుంది. అయితే ఇవి పళ్ళ సంధుల్లో అతి సులభంగా ఇరుక్కొని, నోటి దుర్వాసనకు దారి తీస్తుంది. కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండటం మంచిది.

చాక్లెట్స్
చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్ళుండరు. డార్క్ చాక్లెట్స్ హార్ట్ కూ చాలా మంచిది అని ఎన్నో పరిశోధనలు తెలియజేశాయి. అయితే స్వీట్ తినడం వల్ల అతి త్వరగా నోట్లో క్రిములను, బ్యాక్టీరియాను ఏర్పరిచి పళ్ళ పాడయ్యేలా చేస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా చాక్లెట్స్ ను తీసుకోకపోవడమే మంచిది. ఒక వేళ తినాలనిపిస్తే వెంటనే బ్రష్ చేసుకోవడం మంచిది.

పాప్ కార్న్
నోరూరించే పాప్ కార్న్ చూడగానే కొనేసి వెంటనే తినేయాలనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా చూసేటప్పుడు లేదా క్రికెట్ చూసేటప్పుడు అతి ఇష్టంగా తినేది పాప్ కార్న్. పాప్ కార్న్ తినడానికి రుచిగా ఉన్నా పళ్ళకు సులభంగా చిక్కుకుంటుంది. కాబట్టి అవి బ్రెష్ చేస్తే తప్పపోవు అలాంటప్పడు ఇంటికి చేరగానే బ్రెష్ చేసుకోవడం మంచిది.

సుగంధ ద్రవ్యాలు(స్పైసీస్)
స్పైసీస్ లో పళ్ళను అతి సులభంగా పాడు చేసేవి ఆరిగానో, రెడ్ చిల్లి ప్లేక్స్. అవి తినడం వల్ల పళ్ళ సందుల్లో చిక్కుకోవడమే కాకుండా అస్యహ్యాంగా కనబడుతుంటాయి. కాబట్టి ఇటాలియన్ ఫుడ్స్ తిన్న వెంటనే, రాత్రి నిద్రపోయే ముందు తప్పని సరిగా బ్రష్ చేసుకోవడం పళ్ళ, ఆరోగ్యానికి చాలా మంచిది.

బ్రెడ్
సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను ఎక్కువగా తీసుకొంటుంటారు. ఇది పళ్ళకు అతి సులభంగా అతుక్కొంటుంది. ఇది చాలా డ్రై గా ఉండటం వల్ల పళ్ళ సందుల్లో క్రిములను అతి త్వరగా ఏర్పరుస్తుంది. దాంతో నోటి దుర్వాసన కూడా. బ్రెడ్ తో పాటు తీసుకొనే బటర్ కూడా పళ్ళ ఆరోగ్యానికి హానికరమే...

నూడిల్స్
ఈ మధ్య పిల్లలతో పాటు పెద్దలు కూడా అతి ఇష్టంగా తినేటటువంటి ఆహారం నూడిల్స్. ఈ నూడిల్స్ తినడం వల్ల కూడా పళ్ళ మధ్యలో ఇరుక్కొన్ని బ్యాక్టీరియా ఏర్పరచి నోటి దుర్వాసనకు దారితీస్తుంది.

మీట్
మాంసాహార ప్రియులు రోజులో ఒక్కసారైనా నాన్ వెజ్ ను టేస్ట్ చూడందే వారికి తప్తి ఉండదు. మాంసాహారంలో ఉన్న ఫైబర్ మరియు టిష్యూష్ పళ్ళ మధ్యను అతి సులభంగా ఇరుక్కుపోయి, అసౌకర్యం కలిగిస్తుంటాయి. కాబట్టి మాంసాహారం తిన్న వెంటనే తప్పనిసరిగా పళ్ళను బ్రెష్ చేసుకోవడం ఉత్తమం.
కొంతమంది మాట్లాడుతున్నా, నవ్వుతున్నా నోరు వాసప వస్తుంది. నోరు దుర్వాసన రావటానికి పళ్లు సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం చిగుళ్ళ సమస్యలతో బాధపడటం, పళ్ళపై గారలు ఏర్పడి ఎన్నిసార్లు శుభ్రపరుచుకున్నా పోకపోవడం లాంటి అనేక కారణాలు వుంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా పళ్ళు తెల్లగా తళతళలాడలాడుతూ ఉండి నోటినుండి దుర్వాసన రాకుండా ఉండాలన్నా, పళ్ళ గురించి సరైన జాగ్రత్త తీసుకోవాలి.
ఒక రోజుకు రెండు సార్లు పండ్లను శుభ్రం చేసుకోవాలి దానివల్ల నోటి దుర్వసన పోయి, పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయిన పదార్థాలేవైనా ఉంటే తొలగిపోయేందుకు బాగా సహాపడుతాయి. దాంతో పళ్ళు ఆరోగ్యంగా ఉండటంమే కాకుండా పళ్ళు తెల్లగా మారుతాయి. పళ్ళ తెలుపుదనం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అందులో వివిధరకాలైన మెడిసిన్స్, నేచురల్ రెమడీస్, ఇంకా ఎన్నో రకాల ఉపయోగిస్తుంటారు. పళ్ళను నేచురల్ గా కాపాడే వాటిలో వేపపుల్ల, ఆవ నూనె, ఉప్పు, నిమ్మరసం, వంటి ఉపయోగించి నోటి దుర్వాసనను పోగొట్టవచ్చు.
కొన్ని ఆహారాలు తరచూ తినడం వల్ల పళ్ళను పాడు చేయడమే కాకుండా పళ్ళ రంగును కూడా పసుపుపచ్చ వర్ణంలోనికి మార్చేస్తుంటాయి. దాంతో నోటి దుర్వాసనకూడా దారితీస్తుంది. ముఖ్యంగా పళ్ళకు అంటుకొనే ఆహారాలు అతి తర్వగా పళ్ళ పాడుచేస్తాయి. అయితే ఇలాంటి వాటిని తిన్నప్పుడు ప్రతి సారి మనం పళ్ళను బ్రష్ చేసి శుభ్రం చేసుకోలేము కాబట్టి సాధ్యమైనంత వరకూ బటయ గడిపేటప్పుడు అటువంటి ఆహారాలు తినకుండా ఉండటం మంచిది. మర అటువంటి ఆహారాలేంటో చూద్దాం...



Click it and Unblock the Notifications
