Latest Updates
-
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!
ఇవి తింటే కిడ్నీ పదికాలాలపాటు పదిలం...
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు... శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. జీవన శైలి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీకు ఉపయోగపడే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కడ్నీ సమస్యలను అరకట్టవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. కిడ్నీని పదిలంగా ఉంచే కొన్ని ఆహారాలు మీ కోసం...
బెర్రీస్: బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. మనకు తెలిసినంత వరకూ బెర్రీస్ అత్యధిక న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారం. ఇది బరువును తగ్గించుటలో సూపర్ గా పనిచేస్తుంది. బెర్రీస్ ను తీసుకోవడం ద్వార మూత్రపిండాలను శక్తివంత చేసి ఆరోగ్యం ఉండేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ది చేసి రక్తంలోని హానికర విషపదార్థాలను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది.

బెర్రీస్
బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే.

కొత్తిమీర
కొత్తిమీరతో ఫలితాలు బోలెడున్నాయ్ ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరబాటే.

అల్లం
అల్లం మన శరీరంలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ రక్తపోటును తగ్గిస్తుంది.

పసుపు
పసుపు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంది. మరియు అనేక మందుల తయారీలో పసుపును విరివిగా ఉపయోగిస్తుంటారు.

పెరుగు
మన నిత్యజీవితంలో భాగమే అయినా కొందరు పెరుగు అవసరాన్ని గుర్తించరు.

గుమ్మడి విత్తనాలు
గుమ్మడి విత్తనాలు, కిడ్నీలకు చాలా మంచి ఆహారం. కిడ్నీకి బలాన్ని ఇవ్వడమే కాక రక్త పుష్టిని కలిగిస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర తో ఫలితాలు బోలెడున్నాయ్ ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరబాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది. కిడ్నీలో విషాలను బయటకు పంపుతుంది. కిడ్నీలోని రాళ్ళు తొలగించడానికి ఉపయోగించే ఔషదాల్లో ఉపయోగిస్తారు.
అల్లం: అల్లం మన శరీరంలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ రక్తపోటును తగ్గిస్తుంది. "అల్లం మన శరీరంలోని కండరాలని మెతక చేసి రక్తనాలాలని కండరాల ఒత్తిడినుండి విడిపిస్తుంది" .అల్లంను పచ్చిగా తీసుకున్నా లేదా ఉడికించి తీసుకున్నా కిడ్నీలకు చాలా ఆరోగ్యంకరం. ఇది కిడ్నీలను శుభ్రపరుచుటలో, రక్తం శుద్దిచేయడంలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది మధు మేహగ్రస్తులకు మరింత ఆరోగ్యకరం. వారి కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. కాబట్టి మూత్రపిండాల మొక్క ఆరోగ్యం కోసం ప్రతి రోజూ అల్లం చిన్న ముక్కను లేదా అల్లం రసంను సేవించడం మంచిది.
పసుపు: పసుపు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంది. మరియు అనేక మందుల తయారీలో పసుపును విరివిగా ఉపయోగిస్తుంటారు. కిడ్నీలను శుభ్రం పరుచుటలో పసుపు కూడా ఒక ముఖ్య ఔషదం. మీ భోజనంలో ఒక పసుపు చెక్క ముక్కను తీసుకోవడం మంచిది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శక్తివంతమైన యాంటీ బయాటిక్స్‌గా పనిచేస్తాయి. అంటే పసుపు ఉండే చోట హానికర బ్యాక్టీరియా తోక ముడవాల్సిందేనన్నమాట. దీంతోపాటు శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడంలో కూడా పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
పెరుగు: మన నిత్యజీవితంలో భాగమే అయినా కొందరు పెరుగు అవసరాన్ని గుర్తించరు. ప్రోటీన్లు, కేల్షియంలను అందిస్తూ, జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచే పెరుగు ఆరోగ్యాన్ని సదా కాపాడటంలో ముందుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది. మీగడ తీసినందున పెరుగు త్వరగా పులిసిపోవడమే కాక విలువైన పోషకాలను కోల్పోతుంది. పెరుగు రక్తంలోని కొలెస్టరాల్ శాతాన్ని తగ్గిస్తుంది. ఫంగస్ శరీరంలో చేరకుండా నివారిస్తుంది.
గుమ్మడి విత్తనాలు: గుమ్మడి విత్తనాలు, కిడ్నీలకు చాలా మంచి ఆహారం. కిడ్నీకి బలాన్ని ఇవ్వడమే కాక రక్త పుష్టిని కలిగిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేదుకు ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో మెగ్నీషియం మెండుగా వుంది. ఇంకా మినరల్స్ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! వీటిని దోరగా వేపుకుని స్నాక్స్ రూపంలో తినొచ్చు. లేదంటే ముద్దలా నూరి కూరలో వేయొచ్చు. దానివల్ల గ్రేవీ రుచిగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications