Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
సుఖంగా నిద్రపోవాలంటే పడకపై అవగాహన అవసరం...
అతినిద్ర.. లేదా నిద్రలేమి.. ఈ రెండింటినీ తేలిగ్గా తీసుకున్నామా.. సమస్యలు తప్పవంటున్నారు. నిపుణులు. అదే సమయంలో వేళకు నిద్రపోవడం కునుకు తీయడానికి సంబంధించిన కొన్ని అపోహల్నీ దూరం చేసుకుంటే మరింత మేలు. నిద్ర అలసిన శరీరానికి విశ్రాంతినందిస్తుందనేది వాస్తవమే. అయితే... నిద్రతో అంతకకన్నా మరో ముఖ్యమైన మేలూ లేకపోలేదు. రోజులో ఏడునుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం వల్ల శారీరక, మానసినక ఆరోగ్యం దృడమవుతుంది. తత్పలితంగా మరుసటి రోజు చురుగ్గా పనిచేయగలుగుతాం.
నిద్రపోవాల్సిన ఏడు, ఎనిమిది గంటల్లో ఓ గంట తగ్గినా పర్వాలేదు. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు తరచూ గంట తగ్గుతుంటే మాత్రం ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. శారీరకంగానే కాదు. మానసికంగానూ చురుగ్గా ఉండలేం. ఆకలిని పర్యవేక్షించే హార్మోన్ల పనితీరులో తేడాలు కనిపిస్తాయి. మిగతా రోజుల మాటెలా ఉన్నా.. వారాంతంలో రెండు గంటలు అదనంగా నిద్రపోతే చాలా..ఇదొక విధంగా మేలు చేసినా.. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. వారంలో ఐదారు రోజులు వేళపట్టున లేవడం. సెలవురోజుల్లో రెండుగంటలు అదనంగా నిద్రపోవడం వంటి మార్పులకు శరీరం అలవాటు కావాలి. ఈ క్రమంలో నిద్రవేళలు పూర్తిగా దెబ్బతింటాయి. అందుకే రోజు ఏదయినా.. వేళపట్టున నిద్ర అన్నివిధాలా మంచిది.

ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు అని సామెత. నిజమే అలసిపోయిన సందర్భాల్లో కటిక నేలమీద పడుకున్నా నిద్రలోకి జారిపోవచ్చు. కానీ నేలలాంటి గట్టి పడక ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కేవలం వెన్నెముకకు సంబంధించిన ఎముకలను సరిచేయాల్సిన పరిస్థితుల్లో మాత్రమే డాక్టర్లు గట్టి తలం మీద పడుకోవాలన్న సలహా ఇస్తారు.
మాములుగా పత్తితో చేసిన పరుపు లేదా కొబ్బరి పీచు (కొయర్) కూడా ఉన్న మాట్రెస్‌ను ఎవరైనా ఉపయోగించవచ్చు. ఈ పరుపులు వెన్నెముక, నడుముకు మంచి సపోర్ట్‌ను ఇస్తాయి. ఎప్పుడైనా చిన్న మార్పుకోసం వాటర్ బెడ్, స్ప్రింగ్ మాట్రెస్ వంటివి ఉపయోగించవచ్చు. కానీ ఇవి ఉపయోగించినపుడు మంచి సౌకర్యవంతమైన దిండు వాడటం అవసరం.
ఎందుకంటే వెన్నెముక ఎక్కువ మెలికలు తిరిగిపోతుంది, అందువల్ల మెడ, నడుము నొప్పి రావచ్చు. నిజానికి మీ శరీరాకృతి, పడుకునే పద్ధతి మీద ఆధారపడి మీరు మీ పడకను ఎంచుకుంటే మంచిదంటారు నిపుణులు. ఎటువంటి ఆరోగ్య సమస్య లేని వారికి ఫర్మ్ బెడ్ మంచిది.
అయితే ఈ పరుపులు పెద్దవారు, బక్కపలుచగా ఉండి నొప్పితో బాధపడే వారు వాడకపోవడం మంచిది. ఇటువంటి వారు కొంత మెత్తటి పరుపులు వాడాలి. పడుకున్నపుడు పరుపు వెన్నెముకకు సపోర్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముకలో ఎక్కువ మెలికలు ఏర్పడేలా ఉండకూడదు. మంచం దిగడానికి, బెడ్‌పై చేరడానికి అనుకూలంగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
