Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
దుమ్ము తో అలర్జీగా వుంటే?

ఎయిర్ కండిషనర్లు మరియు ఫ్యాన్ బ్లేడులు - ఎయిర్ కండిషనర్లను, ఫ్యాన్ బ్లేడ్ లను ఎప్పటికపుడు దుమ్ము తుడవండి. కనీసం వారానికొకసారైనా సరే ీ పని చేయండి. మీరు కనుక వీటిని శుభ్ర పరచకుంటే, మీ ఇల్లంతా దుమ్ము, ధూళితో పేరుకునే ప్రమాదం వుంది.
కార్పెట్లు శుభ్రం చేయండి - కార్పెట్లకు దుమ్ము బాగా అంటుకుపోతూంటుంది. కార్పెట్ పైన, అడుగునా కూడా దుమ్ము పేరుకుంటుంది. కార్పెట్లనుండి దుమ్ము అలర్జీ రాకుండా వాక్యూం క్లీనర్ తో ప్రతిరోజూ శుభ్రం చేయండి. మీ ఫ్లోరింగ్ వుడెన్ లేదా టైల్స్ వంటిదైతే, కార్పెట్లు త్వరగా దుమ్ము పేరుకోకుండా వుంటాయి.
తడి ప్రదేశం - మీ బెడ్ రూమ్ బేస్ మెంట్ లేదా తడిగా వుండే ప్రదేశంలో లేకుండా చూడండి. ఈ గదిలోకి కావలసినంత ఎండ పడి వేడిగా వుండాలి. మంచి వెలుగు, గాలి కలిగి ఇంటిలో ఎత్తైన భాగంలో మీ బెడ్ రూమ్ వుండేలా చూసుకోండి.
బొమ్మలు - పిల్లలు ఆడుకొనే సాఫ్ట్ బొమ్మలు తొలగించండి.వీటి కారణంగా కూడా దగ్గులు, జలుబులు వస్తాయి. ఈ బొమ్మలపై దుమ్ము బాగా పేరుకొంటుంది. పిల్లలు దానిని పీలిస్తే, అలర్జీ కలుగుతుంది.
కర్టెన్లు - డస్ట్ ఎలర్జీ మీరు పొందుతూంటే, మరో అంశంగా మీ గది విండోలకు తలుపులకు వున్న కర్టెన్లు కూడా శుభ్ర పరచాలి. కర్టెన్లపై వీధిలోని దుమ్ము అంతా త్వరగా పేరుకుంటుంది. వారానికొక సారి మీ ఇంటి కర్టెన్లు వేడినీటిలో పరిశుభ్రం చేసేలా చూడండ.ి
బెడ్ షీట్లు - మీ బెడ్ పై కల బెడ్ షీట్లు, దిండు కవర్లు వారానికొకసారి మార్చండి. మేట్రస్ బాగా దులపాలి. మేట్రస్ ను పిల్లోలను ఉదయం వేళ ఎండలో వుంచి వాటిపై గల బాక్టీరియా చనిపోయేలా చేయండి.
వైద్య సలహా - అలర్జీ బాగా వుంటే, మీ డాక్టర్ ను తప్పక సంప్రదిచండి. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికి అవసరమనుకుంటే వైద్యుల సలహాలు పాటించి తగిన మందులు వాడాలి. దుమ్ము ఎలర్జీలు రాకుండా వుండాలంటే, ఇల్లు పరిశుభ్రంగా వుండాలి. మీరు వ్యక్తిగత శుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అలర్జీకి వెను వెంటనే చికిత్స చయించుకోకపోతే అది ఇతర వ్యాధులుకు దోవ తీస్తుంది. కనుక మీరు కొంత సమయాన్ని ప్రతిరోజూ దుమ్ము దులిపేందుకు తప్పక కేటాయించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications