Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీరు శాఖాహార డైట్ ఎంచుకోవడానికి గల 10 ముఖ్య కారణాలు...!
గత కొన్ని దశాబ్దాలుగా, ప్రజలు అనేక వ్యాధులకు కారణమైన చిరుతిళ్ళతో కూడిన నిస్తారమైన ఆహారం, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు చాలా ఎక్కువగా తినటం జరుగుతున్నది. కేవలం పెద్దలు మాత్రమే కాదు, కానీ పిల్లలు కూడా ఈ 'ఆహార విప్లవం'లో భాగంగా ఉంటున్నారు మరియు దాని ఫలితాన్ని కూడా రుచి చూస్తున్నారు. మారుతున్న జీవన శైలితో పాటు మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. దీనివల్ల రోగాల బారిన పడటమే కాదు ఎన్నో అనర్థాలకు మన ఆహారపు అలవాట్లు దారితీస్తున్నాయి. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచింది. కొందరు డాక్టర్లు మాంసాహారం మంచిదని చెబుతారు, మరి కొందరు మంచిది కాదని చెబుతారు. అసలు మనకు మాంసాహారం మంచి చేస్తుందా లేక శాఖాహారం ఆమంచి చేస్తుందో ఎవరిని అడిగే పని లేకుండా మీరే తేల్చుకోండి.
ప్రస్తుత మన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి చిన్న వయస్సునుంచే వస్తున్నాయి. అందువల్ల మాంసాహారం కంటే సహజంగా లభించే, పుష్కలమైన పోషకాలనందించే పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలకి ప్రాధాన్యమివ్వడం వల్ల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.
'జంక్ ఫుడ్ ట్రెండ్' యొక్క అత్యంత వినాశకరమైన ప్రభావం, స్థూలకాయం మరియు దానికి సంబంధించిన వ్యాధులకు దారి తీస్తున్నది. ఈ విపత్తు నివారించేందుకు, మీరు శాకాహారిగా మారవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు ఎందుకు శాకాహారిగా మారవలసిన అవసరం ఉన్నదో ఇక్కడ 10 కారణాలలో వివరిస్తున్నాము.

మీరు ఎక్కువ కాలం జీవించి ఉండటానికి సహాయపడుతుంది: మాంసాహారుల జీవితకాలం కన్నా శాకాహారుల జీవితకాలం 7 సంవత్సరాలు ఎక్కువగా ఉన్నదని పరిశోధనలు చెపుతున్నాయి. శాఖాహార ఆహారం నుండి తీసుకుంటున్న పోషకాలు, అనేక వ్యాధులకు సంబంధించిన ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని పరిశోధనలు చెపుతున్నాయి.

మిమ్మలిని ఆరోగ్యవంతులిని చేస్తుంది: ఒక శాఖాహార ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా చేస్తుంది. వివిధ ప్రాంతాలవారిగా నిర్వహించబడిన సర్వేల్లో, శాఖాహారులు నాజూకుగా మరియు దృఢంగా ఉండడానికి గల కారణం మత్స్య లేదా మాంసాహారంలో లాగా అదనపు కొవ్వు పైల్స్ జోడింపు ఉండదు అని తేలింది.

మీ గుండెను రక్షిస్తుంది : శాకాహారం గుండె జబ్బులను తగ్గించటంలో చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది కరిగిన క్రొవ్వులు మరియు కొలెస్ట్రాల్ అతితక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శాకాహారంలో, గుండెను వ్యాదులనుండి రక్షించే ఆక్సీకరణ ప్రతిరోధకాలు సమృద్ధిగా ఉన్నాయి.

క్యాన్సర్ ను నిరోధిస్తుంది: ఒక క్రమ పద్ధతిలో కూరగాయలు తినే వారిలో కణిత కణాలు పోరాడగల ఒక బలమైన నిరోధక వ్యవస్థను నిర్మించబడటం వలన క్యాన్సర్ను గట్టుమీదనే ఉంచుతుంది. మాంసాహారులు కొన్ని రకాల కాన్సెర్లకు సమిధలవుతున్నారు.

విషపదార్థాల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది: మాంసాహారం వలన హానికరమైన పురుగుమందుల అవశేషాలు మరియు సముద్రపు ఆహారం వలన భారీ లోహాల మరియు విష రసాయనాల రూపంలో మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి; దీనికి విరుద్దంగా శాఖాహార ఆహారం వలన ఒక సహజ నిర్విషీకరణ ప్రక్రియ ఏర్పడి, ఇటువంటి హానికరమైన విషాన్ని నుండి మిమ్మలిని దూరంగా ఉంచుతుంది.

అంటువ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది: మీరు శాఖాహారులై ఉండటంవలన, మీరు బర్డ్ ఫ్లూ మరియు స్వైన్ ఫ్లూ వంటి మహమ్మారి వ్యాధుల బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మొదటి స్థానంలో ఈ జంతువుల మాంసం తినే వారిలో మీరు లేకుండా ఉంటే, మీరు ఇటువంటి వ్యాధులకు ఎర అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

సులభమైన మెనోపాజ్: మాంసాహారం తినే స్త్రీలలో కన్నా శాఖాహారం తినే స్త్రీలలో మెనోపాజ్ యొక్క బాధాకరమైన లక్షణాలు చాలా తక్కువగా కనపడతాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ధాన్యాలు, లెగ్యుమ్స్, సోయా మరియు ఇతర శాకాహారాలలో హార్మోన్లు సమతుల్యం చేయటంలో సహాయపడే ఫైటో ఈస్త్రోజెన్లు సమృద్ధిగా ఉండటంవలన రుతువిరతి బాధాకరమైన లక్షణాలు శాకాహారులలో తక్కువగా ఉంటాయి. ఇందువలన శాకాహారం తినే మహిళలు వేడి ఆవిర్లు, మానసిక కల్లోలం, బరువు పెరుగుట, అలసట, నిరాశ, తగ్గిన సెక్స్ డ్రైవ్ గురించి తక్కువ ఫిర్యాదు చేస్తారు.

బలమైన ఎముకలు : మాంసాహారం ఎక్కువగా తీసుకునే వ్యక్తులలో అదనంగా ప్రోటీన్లను కలిగి ఉండటంవలన, వీరి ఎముకలు పెళుసుబారి ఉంటాయి. ఈ అదనపు మాంసకృత్తుల వలన, కాల్షియం గ్రహించడం మరియు నిలుపుకొనే విధంలో మార్పులు చెంది, బోలు ఎముకల వ్యాధికి దారితీస్తున్నది. దీనికి విరుద్ధంగా, శాఖాహారులు తీసుకునే ఆకుకూరల్లో మరియు చిక్కుళ్ళు వంటి కాయగూరల్లో కాల్షియం సమృద్ధిగా ఉండటంవలన, వారి శరీరంలోకి కాల్షియం సమృద్ధిగా గ్రహించగలుగుతారు. ఫలితంగా, మాంసాహార మహిళల కంటే శాఖాహారం మహిళలలో ఎముకల బలం కోల్పోయే లక్షణం తక్కువగా ఉంటుంది.

మీ డబ్బు ఆదా: జంతువుల పెంపక ఫార్మ్ ఒక ఖరీదైన పని. అందువల్ల, మాంసం మరియు సముద్ర ఆహారం ధరలు అధికంగా ఉంటాయి. ఫలితంగా, మీరు మాంసం కొనుగోలు చేసిన ప్రతిసారీ, మీరు చాలా ఖర్చు భరించవలసి ఉంటుంది; అలా కాకుండా మీరు శాకాహారం మీద ఆధారపడితే, మీరు కూరగాయల మీద చాలా డబ్బును ఆదా చేయగలరు.

ఇది రుచికరమైనది మరియు రంగులతో కూడినది: శాకాహారం అనేక కూరగాయల రంగులతో కూడి ఉంటుంది, కాని మాంసాహారం సాధారణంగా ఎరుపు మరియు లేత గోధుమరంగులో మాత్రమే ఉంటుంది. కూరగాయలు మరియు పండ్లలో రోగ-నిరోధక ఫైటోకెమికల్స్ కలిగి ఉండటంవలన, ఇవి రంగును మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.



Click it and Unblock the Notifications











