Latest Updates
-
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే 11 ఆహారాలు...!
మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం మనం కడుపు నింపుకోవడానికి, ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే కాదు. జీవక్రియలు సంక్రమంగా పనిచేయడానికి..అందుకు శరీరానికి కావల్సిన శక్తిని అందించడానికి మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం ఎంతో ముఖ్యం. సరైన సమయంలో సరైనా ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంలో ఔషదగుణాలు కలిగి ఉన్నాయని మనం ఊహించకపోవచ్చు. కానీ కొన్ని ఆహారాలు ఔషదలక్షణాలు కలిగి ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
కొన్ని రకాల ఆహారాలు ఉదా: కాకరకాయ డయాబెటిస్(మధుమేహాన్ని)కంట్రోల్ చేస్తుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని రకాల ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయం చేయడానికి బాగా సహాయపడుతాయి. పూర్వకాలం నుండినే కొన్ని ఆహారాలను వైద్యానికి ఉపయోగిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని ఆహారాలు సహజ మార్గంలో కొన్ని వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతాయి.
కాబట్టి ఔషద లక్షణాలు కలిగిన ఆహారాలు చాలనే ఉన్నాయి. ఓ చిన్న అల్లం ముక్కను నోట్లో పెట్టుకోవడం వల్ల దగ్గును నియంత్రించవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న గాయాల తగిలినప్పుడు తేనె రాయడం వల్ల అది క్రిమినాశక లక్షణాలను కలిగి ఆ గాయాలను నయం చేస్తుంది. మరి ఇలాంటి ఔషద గుణాలు కలిగి, కొన్ని వ్యాధులు నయం చేసే కొన్ని ఆహారాలు మీకోసం...

దగ్గు-జలుబుకు ఉపశమనం కలిగించే అల్లం: ఇది చాలా పద్దతి. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు తాజా అల్లం ముక్కను నోట్లో పెట్టుకోవడం ద్వారా కొంత ఉపశమనం కలిగించవచ్చు. అలాగే ఉదయం తాగే ట్రీ, కాషాయంలో కూడా అల్లంను చేర్చి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మం మీద ఏర్పడ్డ గీతలు(చారలు)కట్స్ ను మాన్పుతుంది: తేనె క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి తగిలిన గాయాల మీద, తెగిన చర్మం, చారల మీద తేనె రాయడం వల్ల అవి త్వరగా నయం చేయడానికి బాగా సహాయపడుతుంది.

నొప్పిని నివారించే రెడ్ చిల్లీ పెప్పర్: రెడ్ చిల్లీలో ఉన్న క్యాప్సియాసిన్, శరీరంలో కొన్ని ఉత్పత్తి అయ్యే రసాయనాల వల్ల కలిగే నొప్పిని ఆపుతుంది. జాయిట్(కీళ్ళ)నొప్పులను పోగొట్టడానికి ఇందులో ఉన్న పెప్పరైన్ బాగా ఉపయోగపడుతుంది.

మధుమేహానికి కాకరకాయ: రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని కంట్రోల్ చేయడానికి కాకరకాయ బాగా సహాయపడుతుంది. ఇది పురాతన కాలంలో నుండి మధుమేహ గ్రస్తులకు ఉపయోగిస్తున్న ఇంటి ఔషదం అని చెప్పొచ్చు.

పేలను వదిలించుకోవడానికి ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండే నూనె మాత్రమే కాదు. ఈ ఆలివ్ ఆయిల్ ను తలకు మర్ధన చేయడం వల్ల తలచర్మానికి ఇన్ఫెక్షన్ కలిగించే పేను వదిలించుకోవటానికి సహాయపడుతుంది.

మొటిమల నివారణకు అరటి: మొటమలు ఏర్పడి అవి పేలి, చర్మం మీద చిన్న చిన్న రంద్రాలుగా ఏర్పడి ముఖాన్ని అసహ్యంగా మార్చుతాయి. కాబట్టి ఈ సమస్య నుండి బయట పడాలంటే అరటి పండు తీసుకోవడం వల్ల అందులో ఉండే పొటాషియం మొటిమల చికిత్సకు బాగా సహాపడుతుంది.

పాదాల దుర్వాసన దూరం చేసే బ్లాక్ టీ: పాదాలు దుర్వాసకు కాస్మొటిక్ సమస్య కాదు, ఇది హార్మోనుల లోపం వల్ల దుర్వాసన కలగవచ్చు. ఈ వాసన వదిలించుకోవటం కోసం గోరువెచ్చని బ్లాక్ టీలో మీ పాదాలను కొద్దిసేపు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.

వికారానికి నిమ్మకాయ: అనారోగ్యంగా అనిపించినప్పుటు, వికారంగా అనిపించినప్పుడు నిమ్మకాయను వాసన చూడమంటారు. వికారాన్ని పోగొట్టుటకు సిట్రస్ వాసన చాలా బాగా నయం చేస్తుంది.

వడదెబ్బ లేదా సన్ బర్న్ కు పాలు: సన్ టాన్ కంటే సన్ బర్న్ చాలా జటిలంగా ఉంటాయి. కఠినమైన సూర్య కిరణాలు చర్మంపై పొరమీద పడి చర్మం మండుతుంది. చల్లటి పాలను చర్మానికి రాయడం వల్ల చర్మం మండుట, నొప్పి, పొడిబారడం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నిర్జలీకరణమునకు పుచ్చకాయ: మీరు డీహైడ్రేషన్(నిర్జలీకరణం)కు లోనైనప్పుడు శరీరానికి ద్రవపదార్థాలు చాలా అవసరం. పుచ్చకాయలో 60 నీటి శాతం కలిగి ఉంటుంది. కాబట్టి పుచ్చకాయను తరచూ తినడం వల్ల డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు.

మధుమేహానికి బెండకాయ: బెండకాయను మొదలు, కొన రెండు వైపులా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మధుమేహం కంట్రోల్లో ఉంటుంది.



Click it and Unblock the Notifications