Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
పాలను టేస్టీగా మరియు ఆరోగ్యకరంగా తాగే సులభ మార్గం...!
మన శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ ఫుడ్స్ లో డైరీ ప్రొడకట్స్ లో ఒకటైన పాలు ఒకటి. మన చిన్నతం గురించి ఒక సారి ఆలోచిస్తే పాలు తాగకుండా మారం చేసి, పెద్దవారి దగ్గర తిట్లు తినకుండా ఒక్కరోజైన ఉండేదంటే ఆశ్చర్యం. ఎందుకంటే చిన్నతనంలో చాలా మంది పాలు త్రాగడం ఇష్టం ఉండదు. అందుకు కారణం పాలు వాసన లేదా రుచి నచ్చకపోవచ్చు. లేదా ఆచిన్నతనంలో మనం ఎక్కువగా చాక్లెట్స్, సాప్ట్ డ్రింక్స్ కు, ఐస్ క్రీమ్స్ కు ఆకర్షణ కలిగి ఉండటమే ప్రధాన కారణాలు. అయితే మనల్ని పాలు త్రాగమని ఎందుకు బలవంతం చేస్తారో ఒక్కరోజు కూడా మనం ఆలోచించం?
పాలు త్రాగమనడానికి కారణం అందులో ఉన్న వివిధ రకాల ఆరోగ్యప్రయోజనాలు మన శరీరానికి అందిస్తాయని వారు మనల్ని పాలు త్రాగమని ఒత్తిడి చేస్తారని తెలుసుకోలేరు. పాలను ప్రతి రోజు ఎందుకు త్రాగాలి? వాటి ప్రయోజనాలేంటి ఒక సారి తెలుసుకొన్నాక పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా త్రాగవల్సిందే.. పాలలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్‌లు, మనకు తెలిసిన అన్నిరకాల విటమిన్‌లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలన్నీ లభిస్తాయి. పాలలో లభించే ప్రొటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమినో యాసిడ్స్ అన్నీ లభిస్తాయి.
ఒక లీటరు పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్పరస్, పుష్కలంగా విటమిన్'ఎ' 'సి', మూడోవంతు ప్రొటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్, నాలుగోవంతు, శక్తి 'బి', 'ఇ','డి' విటమిన్లు కొంత కొంతా లభిస్తాయి. పాలలో లభించే కొవ్వులో 99 శాతం, ప్రొటీన్లలలో 97 శాతం, కార్బోహైడ్రేట్లలో 98 శాతం తేలికగా జీర్ణం కాదగ్గ స్థి తిలో ఉంటాయి. కాబట్టి పాలను చాలా సాధారణంగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తీసుకోవాలంటే రిఫ్రిజరేటర్ లో పెట్టి సర్వ్ చేయాలి. పాలను డైరెక్ట్ గా తీసుకోవడానికి ఇష్టపడి వారికోసం కొన్ని మార్గాలున్నాయి. కొన్ని పాలతో తయారు చేసే వెరైటీ రిసిపిల ద్వారా పోషకాలు మరియు ప్రోటీనులు పూర్తి మనకు అందించి మరియు రుచిగా కూడా ఉండేలా చేస్తుంది. మరి ఆరోగ్యకరమైంగా మరియు రుచికరంగా పాలను అతి సులభంగా ఏవిధంగా తీసుకోవాలో చూద్దాం...

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
కోల్డ్ మిల్క్: పెద్దలు వెచ్చని పాలు తాగడం వల్ల ఎసిడిటి మరియు అజీర్ణానికి దారితీస్తుంది. అయితే చల్లని పాలు అజీర్ణానికి విరుగుడుగా పనిచేస్తుంది.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
పాలతో ప్రోటీన్ పవర్: కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్లెయిన్ మిల్క్ లో ఉండే ప్రోటీను మాత్రమే సరిపోవు. మీరు అనారోగ్యం నుండి కోలుకుంటున్న సమయంలో లేదా కండరాలు బలహీనపడినప్పుడు మీకు అధిక ప్రోటీనులు చాలా అవసరం. కాబట్టి పాలలో కొన్ని ప్రోటీనులను(సోయాపౌడర్, సోయా మిల్క్ వంటి)వాటిని మిక్స్ చేసి గుటకలు వేయండి.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
మిల్క్ షేక్స్: పాలు తాగడానికి ఒక అందమైన..ఇష్టమైన మార్గం మిల్క్ షేక్స్. మీరు పాలను పండ్లతో మిక్స్ చేయండి, లేదా చాక్లెట్ మరియు కొన్ని రకాల మసాలాల(చెక్కమరియు యాలకులు)వంటి వాటితో మిక్స్ చేసే షేక్ చేసి ఎంజాయ్ చేయడమే...

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
పెరుగు: మీరు ద్రవరూపంలో పాలను తీసుకోనట్లైతే, పెరుగుగా కూడా తీసుకోవచ్చు పాలలో నిమ్మరసం పిండి ఫ్రింజ్ లో పెట్టాలి లేదా పెరగు ఏర్పడే వరకు గది ఉష్ణోగ్రత వద్ద2-3గంటలు పెట్టి తర్వాత పెరుగు తాయరవుతుంది. పాలలో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు పెరుగులో కూడా పుష్కలంగా ఉన్నాయి.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
పాలతో హెల్త్ డ్రింక్: కొంత మందికి పాల వాసనంటేనే సరిపడదు. అటువంటప్పుడు అందులో కొన్ని హెల్త్ డ్రింక్ పౌడర్స్ ను పాలలో మిక్స్ చేసి సర్వ్ చేయడమే. పాలంటే ఇష్టపడని పిల్లలకు ఇలా తయారు చేసి ఇవ్వడం చాలా సులభ మార్గం.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
స్మూతీస్: స్మూతీస్ ను మిల్క్ షేక్స్ లాగే తయారు చేస్తారు. అయితే స్మూతీస్ క్వాలీటిలో పండ్లు మోతాదు ఎక్కువగా ఉంటుంది. స్మూతీ చిక్కగా మరియు కలర్ ఫుల్ గా చూడగానే తాగేయాలనిపిస్తుంది. కాబట్టి పాలంటే పట్టని వారికి కూడా ఈ మార్గంలో అంధించవచ్చు.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
పాలు మరియు తేనె: మీరు మధుమేహగ్రస్తులైనా లేదా బరువు తగ్గాలనుకొంటున్నా మీరు పాలలో పంచదార లేకుండా తీసుకోవాలి. అటువంటప్పుడు పాలలో తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి లేదా టేస్టీగా కూడా ఉంటుంది.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
కోల్డ్ కాఫీ: వేసవికాలంలో మీరు చాలా హాట్ గా ఫీలవుతున్నా లేదా మిట్ట మధ్యహాన్నం దాహార్తిగా ఉన్నా కొన్ని చల్లచల్లని కోల్డ్ కాఫీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. చల్లని పాలలో కాఫీ పౌడర్ ను మిక్స్ చేసి జ్యూసర్ లో బ్లెడ్ చేయాలి. తర్వాత అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి త్రావచ్చు.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
హాట్ చాక్లెట్: చల్లని సాయంత్రాల్లో వెచ్చగా హాట్ చాక్లెట్ చాలా బాగుంటుంది. హాట్ చాక్లెట్ ను కోకాతో మిక్స్ చేసి పాలు కాచి రెండింటిని మిక్స్ చేసి త్రాగడం వల్ల ఆరోగ్యకరం మరియు నిద్రలేమితో బాధపడే వారికి మంచి నిద్ర పడుతుంది.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
పాలు మరియు కుంకుమపువ్వు: మీరు అందంగా మరియు మెరిసిపోవాలంకుంటున్నారా? అయితే కొంచెం కుంకుమ పువ్వును పాలల్లో వేసి మిక్స్ చేసి బ్లెండ్ చేసి తాగడమే. కుంకుమ పువ్వు ఒక సుగంధ మూలిక మిమ్మల్ని ఫేయిర్ గామార్చి అందమైన చర్మ సౌందర్యాన్ని అంధిస్తుంది.

పాలను వివిధ రూపాల్లో..ఆరోగ్యకరంగా తీసుకోవడం ఎలా..!
పాలు -గుడ్లు: మీరు వ్యాయామాలు అధికంగా చేసే వారైతే, మీ కండరాలు బలపడాలంటే ఒక గుడ్డును పగులగొట్టి పాలలో వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. ఇది ఆరోగ్యం కండపుష్టి.



Click it and Unblock the Notifications











