Latest Updates
-
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఒత్తిడి నుండి తగ్గించే 5 గ్రేట్ హ్యాబిట్స్
ఒత్తిడి అనేది నేటి మన పరిగెత్తే జీవన శైలికి కారణమయ్యే అనివార్యమైన అంశం. మీ మనసుని కొన్ని విషయాలను దూరంగా ఉంచితే, మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు- అది మీకు ఇష్టం లేకపోయినప్పటికీ, కొన్ని సమయాలలో అది మీ బాధలను తగ్గించవచ్చు కూడా. రోజువారీ ఒత్తిడుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి క్రింద 6 అలవాట్లు ఇవ్వబడ్డాయి.
1. తోటపని: తోటపని గురించి మంచి విషయం ఏమిటంటే అది మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రతిరోజూ మీరు అనుభవించే ఒత్తిడి ప్రకృతితో తగ్గుతుంది, మీరు బైటికి వెళ్ళినపుడు, చెట్లు, నీటి చెట్లు, పూల అందాలను పొగడడం, చెట్లపై పెరిగిన పండ్ల తో మీ మనసు సహజంగా విశ్రాంతి పొందుతుంది.

2. చదవడం: పుస్తకాల పఠనం ప్రామాణిక ఒత్తిడిన దూరంచేస్తుంది. మీరు మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించినట్లయితే, మీరు ఎంత కోల్పోయారో ఆశ్చర్యపోతారు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. మంచి పుస్తకాలు చదవండి, జ్ఞానంతో, తాజా శక్తితో మిమ్మల్ని మీరు తెలుసుకోండి.
3. యోగా: యోగా ద్వారా శరీరంలోని కండరాలు సాగి, సడలింపు చెంది తద్వారా ఒత్తిడి నుండి ఉపసమానాన్ని కలుగచేస్తాయి. మీరు తప్పనిసరిగా యోగాని చేసినట్లయితే మీ శరీరం సడలింపు పొంది, మీ మనసుని విశ్రాంతిగా, ప్రశాంతమైన స్థితిలో ఉంచుతుంది. ప్రతిదీ తేలికగా, ఉల్లాసవంతంగా కనిపిస్తుంది.
4. వంటచేయడం: మీకు వంటచేయడం తెలుసా, అధిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. వంటచేయడం అనేది మీరు తయారుచేసే ఆహారంపై మీరు మనసు లగ్నం చేసేటట్లు, దానిని రుచిగా ఎలా చేయాలో శ్రద్ధపెట్టడం చేస్తుంది. అయితే ఇది మీ ఊహలను, మీ సృజనాత్మకతను అమలుచేయడానికి వీలుకల్పిస్తుంది.
5. సంగీతం వినడం: మీరు అధిక ఒత్తిడిలో ఉన్నపుడు, అందమైన ప్రశాంతమైన సంగీతాన్ని పెట్టడం మీరు మొట్టమొదట చేయవలసిన పని. సంగీతం మీ మనసు శీర్షాలకు, స్థిరమైన ఆందోళనలకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది మొట్టమొదట మీ మనసుకు ఆందోళన కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచి, తక్షణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
తేలిగ్గా, ప్రభావవంతంగా మీ రోజువారీ వత్తిడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు సరిపోయే ఉత్తమమైన అలవాటును ఎంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
