వెన్నునొప్పి ఉపశమనం కొరకు 5 విషయాలు

By Super

సాదారణంగా మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ పరిశోధనల ప్రకారం దాదాపు 80% మంది ప్రజలు వెన్నునొప్పితో డాక్టర్ దగ్గరకు వెళ్ళుతూ ఉంటారు. సాదారణంగా ప్రతి మనిషికి శరీరం యొక్క వివిధ ప్రాంతాల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. అలా రావటానికి చాలా కారణాలు ఉండవచ్చు. అది వెన్నునొప్పికి కారణంగా కూడా మారవచ్చు. వైద్యులు వెన్నునొప్పికి ముఖ్యమైన కారణాలలో ఒత్తిడి ఒకటని ఉదాహరించారు. ఇంకా సరిగ్గా లేని భంగిమ,చెడు ఎర్గోనోమిక్స్ మరియు నిద్ర అలవాట్లు వంటి ఇతర కారణాలు వెన్నునొప్పికి కారణం కావచ్చు.

మీరు నొప్పిని నయం చేయటం కొరకు మంచి జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం. వెన్నునొప్పిని సంప్రదాయికంగా నయం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది శుభవార్త కాదు? అయితే వయస్సు మీదపడిన కారణంగా కణజాలం చీరుకుపోయి వెన్నునొప్పికి కారణం కావచ్చు. వెన్నునొప్పిని సాధారణ పనుల ద్వారా నివారించవచ్చు. మీరు వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందుటకు ఈ సాధారణ పద్ధతుల సాధన కొరకు కొంత సమయం కేటాయించాలి. మీ జీవితం బిజీగా ఉంటుంది. డాక్టర్ క్లినిక్ లో ఎక్కువ సమయం ఉండుట వలన మీ రోజువారీ పనులకు కూడా సమయం లేక గజిబిజిగా ఉంటుంది. వెన్నునొప్పి గురించి మీరు ఒక డాక్టర్ ని సందర్శించకుండా వెన్నునొప్పి నయం మరియు భవిష్యత్తులో వచ్చే మరిన్ని సమస్యలను నిరోధించడానికి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1. గుడ్ నైట్ మరియు మంచి నిద్ర

1. గుడ్ నైట్ మరియు మంచి నిద్ర

ఒక మంచి రాత్రి నిద్ర వెన్నునొప్పికి ఇవ్వగలిగిన మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. సరైన నిద్ర లేకపోవడం వలన వెన్నునొప్పి సంభవిస్తుంది. ఒక ప్రశాంతమైన నిద్ర దెబ్బతిన్న కండరాల రిపేరు మరియు వాచిన కీళ్లను నయం చేస్తుంది. మీరు ఒక మంచి మంచం మీద నిద్రించేలా జాగ్రత్తలు తీసుకోండి. హార్డ్ మంచం మీద పడుకోవటం వలన మీ శరీరంలో నొప్పి కి కారణం కావచ్చు. అందువలన పడుకోవటానికి మంచి మంచమును ఎంపిక చేసుకోవాలి. మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఒక వంపు తిరిగిన వెన్నెముకతో నిద్రించడానికి ప్రయత్నించకూడదు.

2. సరైన విటమిన్లు

2. సరైన విటమిన్లు

మీరు వెన్నునొప్పి ఉపశమనానికి చెయ్యాల్సిన తదుపరి విషయం ఏమిటంటే తగినంత విటమిన్లు తీసుకోవడం అని చెప్పవచ్చు. విటమిన్ B గణనీయమైన పరిమాణంలో తీసుకోవటం వలన వెన్ను నొప్పికి ఉపశమనం కలుగుతుంది. విటమిన్ B కేంద్ర నాడీ వ్యవస్థ మరియు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాక వెన్నునొప్పి ఉపశమనానికి ప్రజలు వారి ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు జోడించటానికి ప్రయత్నించవచ్చు.

3. ఫిట్ నెస్ కీలకం

3. ఫిట్ నెస్ కీలకం

వెన్నునొప్పి నయం చెయ్యడానికి ఉత్తమ మార్గాలలో ఫిట్ నెస్ కీలకం అని చెప్పవచ్చు.బలహీనమైన పొత్తికడుపు మరియు వెన్ను కండరాలు నొప్పికి కారణమవుతాయి. ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీ వ్యాయామం మరియు యోగా సాధన చేయటానికి ప్రయత్నించండి. వ్యాయామాలు కండరాలను వదులు మరియు చాలా వరకూ విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. మీ తోటలో ఒక చిన్న నడక లేదా ఏరోబిక్స్ చేయడం ద్వారా కొన్ని నిమిషాలు గడపటం వలన వెన్నునొప్పికి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక మీ మనస్సు విశ్రాంతి పొందే అవకాశం ఉంది.

4. స్మోకింగ్ వదిలివేయుట

4. స్మోకింగ్ వదిలివేయుట

సాదారణంగా మీరు "స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం" అని విని ఉండవచ్చు. అందువల్ల నొప్పి ఉపశమనానికి మీ స్మోకింగ్ అలవాటును వదలివేయాలి. మీ స్మోకింగ్ అలవాటు ఊపిరితిత్తుల డిజార్డర్, గుండె వ్యాధులు,రక్తపోటు వంటి మొదలైన ఇతర రోగాలకు కారణం కావచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం స్మోకింగ్ చేయని వ్యక్తుల కన్నా స్మోకింగ్ చేసే వ్యక్తుల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిరూపణ జరిగింది. సిగరెట్లలో ఉండే నికోటిన్ అనే పదార్దం నొప్పిని పెంచటానికి దోహదం చేస్తుంది. అందువల్ల నొప్పి ఉపశమనానికి మీరు స్మోకింగ్ అలవాటును వదలివేయడం అనేది ఉత్తమం అని చెప్పవచ్చు.

5. వెన్నునొప్పికి మసాజ్

5. వెన్నునొప్పికి మసాజ్

మీరు మసాజ్ చేయించుకోవటం వలన నొప్పి నయం మరియు ఉపశమనం కలుగుతుంది. ఒక టెన్నిస్ బంతితో మీ నొప్పికి వ్యతిరేకంగా మసాజ్ చేయవచ్చు. అప్పుడు మీరు ఒక మేజిక్ ను కనుగొంటారు. పైన చెప్పిన చిట్కాలను ప్రయత్నించి మీరు సులభంగా వెన్నునొప్పిని వదిలించుకోండి.

Desktop Bottom Promotion