మంచి నిద్రను పొందాలంటే ఈ అలవాట్లును దూరం చేసుకోండి...!?

అనారోగ్యమైన జీవన విధానం మరియు చెడు అలవాట్లే చాలా మందికి నిద్ర కరువవ్వడానికి కారణం అవుతున్నాయి. సరైన నిద్రకు ఎన్ని ప్రయత్నాలు చేసి చాలా సందర్భాల్లో అవి ఫలించకపోవచ్చు. నిద్రలేమి మరియు అనారోగ్యకరమైన జీవన విదానం మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా మిమ్మల్ని డల్ గా మార్చేస్తుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల అది మిమ్మల్ డల్ గా మార్చడమే కాకుండా కళ్ళు చుట్టూ నల్లగా ఏర్పడుతుంది మరియు బోదకళ్ళకు దారితీస్తుంది. అందువల్ల, మీరు మంచిగా నిద్రపోవడాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అదేవిధంగా, అజీర్ణం, మలబద్దకం, నిరాశ మరియు తలనొప్పి నిద్ర లేకపోవడం వల్ల సంభవించే సాధారణ ఆరోగ్య సమస్యలు.

సాధారణ నిద్రకు నిద్రమాత్రలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన పరిష్కారం కాదు. సరైన నిద్ర లేకపోవడం మరియు రుగ్మతలు ఏర్పడటానికి సరైన నిద్రలేకపోవడమే. నిద్ర పొందడానికి, నిద్ర ప్రేరింపించడానికి అవసరం అయ్యే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి. వాటిలో అరటి, పాలు, బంగాళదుంపలు, పెరుగు మరియు బంగాళదుంపలతో తయారు చేసిన ఆహారాలు నిద్ర ప్రేరేపించడానికి బాగా సహాయపడుతాయి.

సరైన నిద్ర పొందడానికి, మీరు మీ అలవాట్లను మరియు నిద్రపోయే సమయాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సి అవసరం ఉంది. మీ నిద్రను పాడు చేసే కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. ఉదాహరణకు నిద్రించే ముందు రాత్రుల్లో పుస్తకాలు చదవడం వంటి కొన్ని అలవాట్లు మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. మీరు అనుకోవచ్చు పుస్తకపఠనం వల్ల నిద్రను ప్రేరేపించవచ్చు అని, కానీ రాత్రి పుస్తకాలు చదివిన మీ కళ్లు ఒత్తిడికి గురిఅవుతాయి మరియు సాధారణ నిద్రమీద చెడు ప్రభావం కలిగించవచ్చు. దీంతో పాటు మరికొన్ని చెడు అలవాట్లు.. ఫేస్ బుక్ లేదా చాటింగ్, మొబైల్లో గంటలు తరబడి మాట్లాడటం వంటివి మీ నిద్రను పాడు చేస్తాయి. మీ అందమైన రాత్రిని హరించివేస్తాయి. అటువంటివి మీ నిద్రను పాడు చేసే చెడు అలవాట్లు మరొకొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం వల్ల మీకు ఆరోగ్యకరమైన జీవన విధానంతో పాటు మంచి నిద్రను పొందుతారు.

 మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

బుక్స్ చదవడం: పుస్తక ప్రియులు చాలా మంది ఉంటారు. నిద్రించే ముందు వారు తప్పనిసరిగా నవలలు చదువుతారు. ఓ మంచి నవల చదవడం వల్ల మంచి నిద్రవస్తుందని అనుకుంటారు. అయితే చాలా అధ్యయనాల ప్రకారం రాత్రిల్లో పుస్తకాలు చదడం వల్ల కళ్ల మీద ఒత్తిడి పెరిగి నిద్రాభంగం కలిగిస్తుందని పేర్కొన్నారు.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

మ్యూజిక్ వినడం: చాలా మంది రాత్రి నిద్రించే ముందు వారి బెడ్ మీద వెళ్లినప్పుడు పడుకొని సాఫ్ట్ అండ్ లౌడ్ మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతారు. ప్రతి రోజూ సరైన నిద్ర అలవర్చుకోవడానికి నిద్రపోయేముందు ఖచ్చితంగా మెదడుకు విశ్రాంతి కలిగించాలి. అందుకు మ్యూజిక్ కు చెక్ పెట్టడం మంచిది.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

టీవీ చూడటం: రాత్రుల్లో ఎక్కువ సమయం టీవిచూడ్డటం వల్ల కళ్ల మీద ఒత్తిడి పెరిగి , అలసటకు గురిఅయ్యి నిద్రను దూరం చేస్తుంది.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

లాప్ టాప్: ఒటరిగా జీవించే వారు, ఉద్యోగస్తులు మాత్రమే కాదు చాలా మంది, రాత్రి సమయాల్లో లాప్ టాప్ కు అంకితమై పోయింటారు. అది వ్యక్తిగతంగా కావచ్చు. లేదా అఫిషియల్ గాను కావచ్చు. నిద్ర సమయంలో ఇలా చేయడం వల్ల మీ నిద్రను పాడు చేస్తుంది. దాంతో మీరు అలసటగా కనబడుతారు.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

వీడియో గేమ్స్: లేట్ నైట్ లో వీడియో గేమ్స్ ఆడటం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. అది అడ్రినలిన్ మరియు శరీరం శక్తిని స్థిరంగా అలాగే ఒక వైపే చూస్తుండం వల్ల కళ్లు అలసటకు గురియై నిద్ర రాదు. కాబట్టి లేట్ నైట్ గేమ్స్ కు చెక్ పెట్టండి.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

వ్యాయామాలు: రోజులో మీకు వ్యాయామం చేయడానికి సమయం దొరకనప్పుడు? రాత్రి సమయాలను ఎంచుకుంటుంటారు! వ్యాయామం చేయడం వల్ల జీవక్రియలు బాగా పనిచేసి మిమ్మల్ని చురుగ్గా ఉంచుతాయి. రాత్రిల్లో మీ నిద్రకు భంగం కలిగించకూడదనుకుంటే రాత్రి సమయంలో వర్క్ ఔట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టండి.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

బ్రైట్ బెడ్ రూమ్ లైట్లు: డిం లైట్స్ నిద్ర ప్రేరేపిస్తుంది. కానీ మీరు ప్రకాశవంతమైన మరియు మీ బెడ్ రూమ్ లో ముదురు రంగులు ఉపయోగిస్తే, మీ నిద్రకు ముగింపు పలకాల్సిందే. కాబట్టి ఎప్పుడైనా సరే బెడ్ కు లైట్ కలర్స్ లేదా వైట్ కలర్ ప్రశాంతంగా ఉంటుంది.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

కాఫీ త్రాగడం: కాఫీలోని కెఫిన్ మిమ్మల్ని ఆరు గంటల పాటు మెలుకువగా ఉండేట్లు చేస్తుంది. బెడ్ టైమ్ లో బుక్స్ చదువుతూ కాఫీకి అలవాటు పడితే మీరు నిద్రకు దూరం అయినట్లే.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

ఆల్కహాల్: చాలా మందికి బెడ్ టైమ్ లో ఆల్కహాలిక్ బెవరేజెస్ పుచ్చుకోవడం అలవాటు. ఆల్కహాల్ మరియు ఇతర కార్బొనేటెడ్ బెవరేజెస్ మిమ్మల్ని మగతగా భావించేలా చేస్తుంది కానీ, మీ కలత నిద్రను పొందుతారు. సంపూర్ణ నిద్రకు దూరం అవుతారు.

మీ నిద్రను పాడుచేస్తున్నది ఇవేనా...?

నీళ్ళు: నీళ్ళు త్రాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే నిద్రపోవడానికి ముందు ఎక్కువ మోతాదులో నీళ్ళు త్రాగకూడదు. నీళ్లు ఎక్కువగా త్రాగడం వల్ల నిద్రలో మీరు ఎక్కువగా లేవాల్సి వస్తుంది. అది మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగించవచ్చు.

Desktop Bottom Promotion