ఘాటైన మిరియం అందించే ఘాటైన ఆరోగ్య ప్రయోజనాలు

By Super

మన తయారుచేసుకొనే ఆమ్లెట్ మరింత రుచికరంగా..కారంగా ఉండాలంటే బ్లాక్ పెప్పర్ ను జోడిస్తుంటాం. అంతే కాదు మన ఇండియన్ వంటకాలకు మంచి ఫ్లేవర్ లేదా ఘాటైన రుచి, కారం ఉండాన్నా బ్లాక్ పెప్పర్ ను వినియోగిస్తుంటాం. సుగంధద్రవ్యాలలో రారాజు ‘మిరియం.' అందుకే దీన్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అన్నారు. ప్రపంచంలో మిరియాలకు పుట్టినిల్లు నూటికి నూరుపాళ్లూ భారతదేశమే. మిరపకాయ పరిచయం లేని రోజుల్లో వంటకాల్లో మిరియాన్నే విరివిగా వాడేవారట పూర్వీకులు.

ముందొచ్చిన చెవులకన్నా... అన్న టైప్‌లో మిరప ఎంత మిడిసిపడినా మిరియంలోని ఘాటు, టేస్ట్ ముందు దిగదుడుపే. అందుకేనేమో యురోపియన్ వంటకాల్లో మిరియం ‘పెప్పర్' పేరుతో టేబులెక్కి కేక పుట్టిస్తోంది. పోపులపెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దలమాట. జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కుదిబ్బడ, అజీర్తి, క్రిమి, జీర్ణశక్తిని పెంచటం, గొంతును శుభ్రపరచటం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, మూలశంక, కలరా, మలేరియా .... ఏ వ్యాధికైనా ఒకే మందు... అదే మిరియం. వేల రకాల వంటకాలకైనా మేలిమిరుచిని తీసుకువచ్చే ఘనాపాఠి మిరియం. కానీ మీకు తెలుసా బ్లాక్ పెప్పర్ ఇచ్చే ఘాటైన వాసన, మరియు రుచి కంటే అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. మరి అవేంటో ఒకసారి చూద్దాం:

క్యాన్సర్ నిరోధిస్తుంది:

క్యాన్సర్ నిరోధిస్తుంది:

యూనివర్సిటీ ఆఫ్ మెచిగన్ క్యాన్సర్ సెంటర్ నిర్విహించిన అధ్యయనం ప్రకారం, బ్లాక్ పెప్పర్(నల్ల మిరియాలు)రొమ్ము క్యాన్సర్ కణితుల అభివృద్ధి నిరోధించడానికి ఇవి సహాయపడుతాయని కనుగొనబడింది . నల్లమిరియాల్లోని పెపిరిన్ కంటెంట్ క్యాన్సర్ నిరోధించడానికి కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు . తర్వాత బ్లాక్ పెప్పర్ కు కొద్దిగా పసుపు జోడించడం వల్ల యాంటీక్యాన్సర్ లక్షణాలు పెంపొదిస్తుందని కనుగొనబడింది. నల్ల మిరియాల్లో పెపరిన్ కాకుండా విటమిన్ , విటమిన్ ఎ, ఫ్లెవనాయిడ్స్, కెరోటిన్స్ మరియు ఇతర యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి. ఇవి శరీరం క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల బారిన పడకుండా హానికరమైన ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి సహాయం చేస్తాయి. ఇతర అధ్యయనాల ప్రకారం చర్మ క్యాన్సర్లు మరియు ప్రేగు మరియు పెద్దప్రేగు క్యాన్సర్లు పెరగకుండా ఉంచే సామర్థ్యం ఇది కలిగి ఉందని కనుగొన్నారు. ఒక టీస్పూన్ పెప్పర్ పౌడర్ ను మీ తీసుకొనే ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరగుతుంది.

గ్యాస్-జీర్ణక్రియకు సహాయపడుతుంది:

గ్యాస్-జీర్ణక్రియకు సహాయపడుతుంది:

బ్లాక్ పెప్పర్ లోని పెప్పరిన్ అనే మూలకం జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కారణంగా మరింత టేస్ట్ బడ్స్ ను ప్రేరేపిస్తుంది. ఈ ఆమ్లం ప్రోటీనులు మరియు ఇతర ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా అవసరం. మరియు అపానవాయువు, అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం మరియు ఆమ్లత వీటివల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇందులోని అదనపు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈసమస్యలన్నింటిని నిరోధించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకోసం, మీరు తయారు చేసే వంటల్లో ఒక టేబుల్స్ స్పూన్ పెప్పర్ పౌడర్ ను జోడించండి . ఇది వంటలకు ఫ్లేవర్ ను జోడించడంతో పాటు కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

బ్లాక్ పెప్పర్ ఆహారంలో జోడించడం వల్ల అన్ని పోషకాలను వెలికితీస్తుంది. అంతేకాక, మిరియాల బాహ్య పొరలో శక్తివంతమైన ఫైటోన్యూట్రియంట్స్ కొవ్వుకణాల విచ్ఛిన్నంను ప్రేరేపిస్తుంది. ఇంకా, ఇది చెమట పట్టేలా చేస్తుంది మరియు మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తుంది. మరియు శరీరంలోని అదనపు నీటిని మరియు టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఈ కార్యకలాపాలన్నీ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. సమర్థవంతంగా బరువు తగ్గడం కోసం, జస్ట్ మీరు తినే ఆహారం మీద పెప్పర్ పౌడర్(మిర్యాల పొడి) చిలకరించండి చాలు. అయితే, ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం కావచ్చు.

గ్యాస్ ను తగ్గిస్తుంది:

గ్యాస్ ను తగ్గిస్తుంది:

పొట్ట ఉబ్బరం తగ్గించే గొప్ప ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు గ్యాస్ ఏర్పడటాన్ని నిరోధించడంతో పాటు, కడుపు నొప్పి , అసౌకర్యం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ భోజనంలో కారం పొడికి బదులు బ్లాక్ పెప్పర్ ను జోడించడం వల్ల అపానవాయువు ఉపశమనానికి సహాయం చేస్తుంది.

బ్లాక్ పెప్పర్ స్ర్కబ్ వల్ల క్లియర్ స్కిన్ పొందవచ్చు:

బ్లాక్ పెప్పర్ స్ర్కబ్ వల్ల క్లియర్ స్కిన్ పొందవచ్చు:

శరీరంలోని మరియు చర్మంలోని నీరు చెమట రూపంలో బయటకు నెట్టడం మరియ శరీరంలోని విషలను తొలగించడం వల్ల ఇది ఒక గొప్ప ఎక్స్ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. బ్లాక్ పెప్పర్ ను పొడి చేసి, మీరు ఉపయోగించే ఫేస్ స్ర్క్ బ్ లో జోడించడం వల్ల, డెడ్ స్కిన్ తొలగించడానికి బాగా సహాయపడుతుంది, చర్మలో రక్తప్రసరణను మరియు చర్మం మరింత ఆక్సిజన్ పొందడానికి మరియు పోషకాలను అంధించడానికి బాగా సహాయపడుతుంది. మొటిమలు మరియు ఇతర చర్మం ఇన్ఫెక్షన్లకు గురికాకుండా బ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

చుండ్రుతో పోరాడుతుంది:

చుండ్రుతో పోరాడుతుంది:

యాంటీడాండ్రఫ్ షాంపూలకు బదులు, పెప్పర్ ను ఉపయోగించే ప్రయత్నంచేయండి. ఎందుకంటే పెప్పర్ లోని యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రు వదిలించడంలో గొప్పగా సహాయపడుతాయి. పెరుగులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ను చేర్చి, బాగా మిక్స్ చేసి, తలకు పూర్తిగా పట్టించి, అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు షాంపును వాడకండి. మరుసటి రోజూ తలస్నానం చేసేటప్పుడు షాంపు వాడవచ్చు. పెప్పర్ పౌడర్ ను ఎక్కువగా ఉపయోగించకూడదని గుర్తుంచుకోవాలి. లేదంటే తలలో మంట ఏర్పడుటకు కారణం కావచ్చు.

మూసుకు పోయిన ముక్కు మరియు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది:

మూసుకు పోయిన ముక్కు మరియు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది:

ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా, జలుబు మరియు దగ్గును నయం చేయడానికి పెప్పర్ ఒక సమర్థవంతంగా పనిచేసే ఒకనేచురల్ రెమడీగా సహాయపడుతుంది. పెప్పర్ కారంగా మరియు పెప్పర్ లోని ఘాటైన ఫ్లేవర్ గొంతునొప్పి మరియు ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. జలుబు మరియు దగ్గుతో బాధపడుతుండే సమయంలో సూప్ లేదా రసంలో కొద్దిగా పెప్పర్ పౌడర్ ను చిలకరించి తీసుకోండి. వెంటనే గొంతు నొప్పి తగ్గించి, ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగించి సులభంగా శ్వాస పీల్చుకొనే విధంగా సహాయపడుతుంది.

అనొరెక్సియాకు సహాయపడుతుంది:

అనొరెక్సియాకు సహాయపడుతుంది:

బ్లాక్ పెప్పర్ జీర్ణక్రియను మెరుపరచడానికి మరియు టేస్ట్ బడ్స్ ను ఉద్దీపనచేయడానికి బాగా సహాయపడుతుంది. ఎందుకంటే, బ్లాక్ పెప్పర్ లో ఉండే ఈ లక్షణాల వల్ల ఆకలి లేని వారికి, ఆకలి కలిగించేందుకు సహాయపడుతుంది. ఆహారం తినలేని సందర్భంలో వారి తీసుకొనే ఆహారంలో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ ను కొద్దిగా జోడించడం వల్ల అనొరెక్సియాను పరిష్కరించడంలో సుదీర్ఘంగా వెళతాయి. ఆకలిని పెంచేలా చేస్తాయి.

శరీరం మరింత సమర్థవంతంగా పోషకాలను ఉపయోగించుకొనేలా చేస్తుంది:

శరీరం మరింత సమర్థవంతంగా పోషకాలను ఉపయోగించుకొనేలా చేస్తుంది:

బ్లాక్ పెప్పర్ లోని ఔషధగుణగణాలు సమానమైన జీవ లభ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంటే దాని అర్థం శరీరంలో ఆహారం ద్వారా పోషకాలను సరైన రవాణా మరియు శోషణలో సహాయపడుతుంది.

డిప్రెషన్:

డిప్రెషన్:

నేచురల్ యాంటి డిప్రెసెంట్: జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ ప్రకారం నల్ల మిరియాల్లోని పెప్పరిన్ అనే అంశం మెదడు యొక్క అభిజ్ఞాత్మక విధినిపెంచడానికి మరియు డిప్రెషన్ తో పోరడటానికి సహాయపడుతుంది నివేదించారు. ఇంకా బ్లాక్ పెప్పర్ ను రెగ్యులర్ గా తినడం వల్ల మెదడు సరిగా పనిచేసేందుకు సహాయపడుతుందని కనుగొనపబడింది. మీ రోజువారి భోజనంలో జోడించండి, లేదా మీరు తినే సలాడ్స్ లో కొద్దిగా పెప్పర్ పౌడర్ ను చిలకరించుకోండి . ఎలాగైనా పెప్పర్ మిమ్మల్ని తెలివిగా మరియు తక్కువ మనో వ్యాకలతను చెందడానికి సహాయపడుతుంది.

Desktop Bottom Promotion