Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
30ఏళ్ల తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకొనేందుకు సులభ చిట్కాలు
మన శరీర అవయావలు పనిచేయడానికి ప్రతి రోజూ అవసరం అయ్యే కొలెస్ట్రాల్ కూడా ఒక మూలం. ఇది హార్మోనుల ఉత్పత్తి మరియు అవయవ కార్యచరణ బాధ్యత చేపడుతుంది . కాబట్టి, ఒక విధంగా, మన శరీరానికి కొంత మొత్తంలో కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. కానీ, ప్రస్తుత రోజుల్లో 30ఏళ్ళ తర్వాత మన శరీరానికి అవసరం అయ్యే దానికి కంటే ఎక్కువ ఉంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మన శరీరానికి చెడు ప్రభావాన్ని చూపెడుతుంది . ఇది హార్ట్ అటాక్, మైనర్ లేదా మేజర్ స్ట్రోక్ మరియు ఇతర హార్ట్ రిలేటెడ్ వ్యాధులకు కారణం అవుతుంది. అందువల్ల, కొలెస్ట్రాల్ ను నియంత్రించడం చాల అవసరం అయింది.
30ఏళ్ళ వయస్సు తర్వాత, భౌతిక వ్యాయామం తగ్గి, ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా,
30 ఏళ్ల తర్వాత , వ్యాయామం భౌతిక తగ్గిస్తుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది . ఈ కారణంగా , అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. 30ఏళ్ళ తర్వాత క్రమరాహిత్య జీవన శైలి, సంతృప్త కొవ్వుల వినియోగం, ఊబకాయం మరియు కుటుంబ చరిత్ర వంటి వివిధ రకాల కారణాల చేత అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి . ఎక్కువగా సిగరెట్లు త్రాగడం కూడా అధిక కొలెస్ట్రాల్ ఏర్పడుటకు ఒక ప్రధాణ కారణం.
30ఏళ్ళ తర్వాత మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ట్రాక్ చేయడం చాలా అవసరం. అందుకు మీరు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం అవసరం. మీలో ఇప్పటకే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉంటే, అప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవడానికి కొన్ని ప్రధాన చర్యలు చేపట్టాలి. 30ఏళ్ళ తర్వాత అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు మరియు కొన్ని ఎఫెక్టివ్ మార్గాలు క్రింద విధంగా ఇవ్వబడ్డాయి: -

నేచురల్ జ్యూస్ :
ఆరెంజ్ మరియు క్రాన్ బెర్రీ వంటి పండ్ల రసాల్లో ఎల్ డిఎల్ తగ్గించే ఆక్సిడెంట్స్, యాంథోసైనిన్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గితస్తాయి మరియు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. ప్రతి రోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ త్రాగడం వల్ల 5-7 % శాతం కొలెస్ట్రాల్ స్థాయిలను గ్గించుకోవచ్చు. 30ఏళ్ళ తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి పద్దతి మరియు సులభమైన మార్గం.

తక్కువ భోజనం తినాలి:
కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం చాలా తక్కువ మొత్తంలో ఆహారాన్నితీసుకోవడం, అదీ, చిన్న చిన్న వ్యవధిలో తీసుకోవడం అవసరం. ఇది శరీరంలో ఎల్ డిఎల్ లెవల్స్ ను నిర్వహించడానికి మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను సమతుల్య పరచడానికి చాలా సహాయపడుతంది. మరియు మీ ఆహారంలో లో ఫ్యాట్ కలిగినటువంటి ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా కలిగి ఆహారాలకు దూరంగా ఉండాలి.

బ్రౌన్ ఫుడ్ :
30 ఏళ్ళ తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఒక సులభ మార్గం కొలెస్ట్రాల్ అధికం చేసే ధాన్యాలు కాకుండా త్రున్ ధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం అవసరం. అందువల్ల మీరు బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ ను తగ్గించుకోవచ్చు మరియు మంచి కొలెస్ట్రాల్ మీరెగ్యులర్ డైట్ లో ఉండే కార్బొహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది. బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ మరియు ఇతర ధాన్యపు అహారాలు మీ డైట్ లో ఖచ్ఛితంగా చేర్చుకోవాలి.

హెల్తీ నూనెలు
- కొలెస్టరాల్ తగ్గించే లక్షణాలు కలిగి ఆలివ్ ఆయిల్ , రైస్ బ్రాన్ ఆయిల్ మరియు సోయా ఆయిల్ వంటి అనేక నూనెలు ఉన్నాయి. 30 ఏళ్ళ తర్వాత కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి సులభ మార్గం లో కొలెస్ట్రాల్ ఆయిల్ ను వినియోగించడం. కొలెసట్రాల్ స్థాయిల్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ మార్గం. నూనెలు కొనుగోలు చేసేప్పుడు కొలెస్ట్రాల్ కంటెంట్ ను మరియు మరికొన్ని ఇతర వివరాలు గుర్తించాలి.

హెల్తీ వోట్స్
- హెల్తీ ఓట్స్ ను వినియోగించుకొన్న తర్వాత శరీరంలో 10-12 % కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి సహాయపడిందని నిరూపించబడినది. ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ హెల్లీ బ్రేక్ ఫాస్ట్. ఇందులో మంచి కొలెస్ట్రాల్ మరియు అధిక ఎనర్జీ కలిగిన కంటెంట్. 30 తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఒక బౌల్ వోట్స్ ను తినడం మంచిది.

గ్రీన్ టీ
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి మరో సులభ మార్గం రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగడం. బ్లాక్ టీలోని ఫ్లెవనాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతాయి. అలాగే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగిన వారు ప్రతి రోజూ రాత్రి బ్లాక్ టీ తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
