Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
మునగాకు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా...!
వంటలకు ఘుమఘమలను అందించి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోతగ్గది మునగ, మునగకాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి సూప్ వంటివెన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ కాడలతోటే కాకుండా మునగ ఆకును వంటు చేసుకుని తినడం వలన శరీర ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తుంది. అయితే, ఇప్పుడు కాడలు వాడినంతగా ఆకును వాడటం లేదనే చెప్పాలి. దీని లేత ఆకులు కూరగాను, పువ్వును మామూలు ఆకుకూర వండిన మాదిరిగానే వండవచ్చును. మునగాకు కాలేయంలో చేరిన విష పధార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది.
కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతూంటారు. అలాంటివారికి ఈ మునగాకును పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది. వాత వాయువులను, కడుపునొప్పి, అల్సర్లు, పేగు పూతలు పోగొడుతుంది. ఆముదం మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్లనొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి. ఆముదం, మునగాకు కలిపి ఉడికించి గుడ్డలో మూటకట్టి గవదబిళ్లపై కడితే తగ్గిపోతాయి.
మునగాకు రసం తీసి గ్లాసులో తేరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు కంఠరోగాలు, కాలేయంలోని అల్సర్లు తగ్గుతాయి. కాకపోతే మునగాకు గ్రామాల్లో లభ్యమయినంతగా పట్టణాలలో లభ్యం కాకపోవచ్చు. కొంత ఆకుల్లో ఉండే విలువలే మునగకాయల్లోనూ ఉంటాయి. ఇవి పట్టణాల్లో దొరుకుతాయి. కనుక, వాటినైనా తీసుకునే విధంగా తీసుకుంటుంటే ఫలితాలు పొందవచ్చు. ఉడికించే వాటిల్లో వేయడం వలన వాటిలోని సారం అంతా ఇవతలకి వస్తుంది. అది తీసుకుంటే శరీరానికి చక్కగా వంట పడుతుంది. మునగ ఆకైనా, కాడైనా ఆరోగ్యానికి మంచిది.

ములగకాయల గురించి మనకందరికీ తెలుసు. ములగ కాయల పులుసు ఎంత సువాసన భరితమో తెలియనిదెవరికి. అయినా ములగ ఆకు గురించి ఈ తరం వారిలో చాలామందికి తెలియకపోవటం ఆశ్చర్యకరమే. గృహవైద్యంలో ములగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు, అమ్మమ్మలకు, గ్రామీణ ప్రజానీకానికి బాగా తెలుసు. నిజానికి ములక్కాయల వలన ఉపయోగం తక్కువ. ములగ ఆకు వైద్య సంబంధమైన ఒక గొప్ప ఔషధి. అందువలన ములగ ఆకు గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం.
ములగ ఆకులో ఉన్నంతగా ఎ, సి విటమిన్లు మరే ఇతర ఆకుకూరలోను లేవు. సున్నము, భాస్వరము, ఇనుము తగినంతగా ఉన్నాయి. 100గ్రా ములగ ఆకులలో పోషకవిలువలు ఈ విధంగా ఉంటాయి. పిండిపదార్థాలు-13.4గ్రా, క్రొవ్వు పదార్థాలు 1.7గ్రా, మాంసకృత్తులు-6.7గ్రా, సున్నం-440మి.గ్రా, భాస్వరం-70మి.గ్రా, ఇనుము-7మి.గ్రా, పీచుపదార్థం 0.9మి.గ్రా
ములగ ఆకు కొద్దిగా కారంగా ఉంటుంది. ములగ ఆకు వేడిచేసే స్వభావం కలిగి ఉంటుంది. ప్రారంభదశలో ఉన్న కీళ్లనొప్పులకు ములగ ఆకును నూరి కట్టినచో కీళ్లనొప్పులు తగ్గుతాయి. పుండ్లు మొదలగునవి వానియందలి నీరు లాగుటకు ములగ ఆకును నూరి కట్టుకట్టినచో పుండ్లు త్వరగా నయమవుతాయి. చర్మరోగములు, వ్రణములను నివారిస్తాయి.
వాతము, కఫమును హరిస్తాయి. దృష్టి మాంద్యమును, రేచీకటిని పోగొడతాయి. ములగ ఆకులలో అమినో ఆమ్లములు పుష్కలంగా ఉంటాయి. అందువలన మాంసకృత్తుల లోపము వలన వచ్చు రోగములను నిరోధిస్తాయి. గర్భిణులకు పాలిచ్చే తల్లులకు ములగ ఆకు రసం ఎంతో మేలు చేస్తుంది.
దోసకాయరసంతో కొంచెం ములగ ఆకు రసాన్ని కలిపి ప్రతినిత్యం సేవిస్తే గుండె, కాలేయం, మూత్రపిండాల అపసవ్యత వలన శరీరానికి నీరు పట్టకుండా నిరోధిస్తుంది. ములగ ఆకు మలబద్దకాన్ని నివారిస్తాయి. కీళ్ల సంధుల అరుగుదల, నపుంసకత్వం, కాలేయం పెద్దవి కావటం, తదితర వ్యాధులను ములగపూల రసాన్ని సేవించటం ద్వారా నివారించవచ్చు. ములగపూల రసం స్త్రీలో వంధ్యత్వాన్ని పోగొడుతుంది. కీళ్లసంధులలో నొప్పులను తగ్గిస్తుంది. ములగ చెట్టు వ్రేళ్లను, కొద్దిగా మెంతులను కొద్దిగా ఆముదం గింజలను కలిసి లేహ్యంగా చేసి నొప్పి ఉన్న ప్రాంతంపై మర్దన చేస్తే నొప్పులు తగ్గిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











