Latest Updates
-
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026 -
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
పుదీనాలో సువాసనే కాదు.. సుగుణాలు కూడా ఎక్కువే...

పుదీనా ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికం. ఉదయాన్నే కప్ఫుడు పుదీనా తీని తాగితే దాని నించి శరీర పనితీరుకి అవసరం అయిన రాగి, పీచు, కాలుష్యంతో పాటు మాంగనీసు, పొటాషియం కూడా అందుతాయి. గర్భిణులకు అవసరం అయిన ఫోలికామ్లం, ఒమేగా త్రీలు కావాల్సినంత. చాపకింద నీరులా, శరీరంలో మనకు తెలియకుండా పెరిగే కణుతుల పెరుగుదల కు అడ్డుకట్ట వేయాలంటే రోజువారీ ఆహారంలో ఆకులని గ్రీన్ చట్ని రూపంలో కానీ, టీగా కానీ తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.
పొడి దగ్గు విసిగిస్తున్నప్ఫుడు: గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు.
ప్రతిరోజు పుదీనా ఆకుల్ని నమిలి తినడం వలన నోటి దుర్వాసన తగ్గిపోవడంతో పాటు, పిప్పిపళ్ళు, చిగుళ్ళ నుండి చీము కారడం తగ్గుతాయి.
రెండు స్పూనుల పుదీనాకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి.
పుదీనాకును ఎండబెట్టి, పొడిచేసి రెండుస్పూనుల పొడిని, రెండు గ్లాసుల నీళ్ళలో వేసి అరగ్లాసు అయ్యేవరకు మరిగించి, చల్లార్చి ఆ నీటిని వడగట్టి తాగితే బహిష్టు నొప్పితో బాధపడేవారికి ఆ నొప్పి రాకుండా ఉంటుంది.
ఒక గ్లాసు మజ్జిగలో పుదీనా ఆకుని కలిపి తాగటం వలన వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది.
గర్భిణీ స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తెనే కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి.
అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడుతుంది.
పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది.
చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూది ని ఆరసంలో ముంచి, ముక్కులోను, చెవి లోను డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది.
ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు.
చిన్న పిల్లలు కడుపునొప్పి ఉప్పరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది.
ఇంతకీ పుదీనా టీ ఎలా చేసుకోవాలంటారా? రెండు కప్ఫుల నీటికి పది నుంచి పన్నెండు ఆకులని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నీరు మరిగిన తర్వాత ఈ ఆకులని వేసి ముతపెట్టేయాలి .కాసేపటికి కప్ఫు పాలు, ఒక యాలక్కాయ, ఇష్టముంటే దాల్చినచెక్క వేసి తేనె కలిపితే పుదీనా టీ సిద్దం .ఈ టీ శరీరానికి కొత్త శక్తిని, మనసుకి ఉత్సాహవంతమైన ఆలోచనలని అందిస్తుంది.
పుదీనా పోషకాలని వీలైనంతగా అందుకోవాలంటే ఆ ఆకులతో చేసిన పరోటాలే మేలైన మార్గం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎండిన లేదా పచ్చి పుదీనా ఆకులని అర కప్ఫు తీసుకొని చపాతీ పిండిలో కలుపు కోవాలి. తర్వాత మమూలు చపాతీల్లా కాల్చుకొంటే కమ్మని పోషకాల రోటీలు సిద్దం. దీనిలో కేలరీలు ఏమీ లేకపోడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు. ఇంతటి విలువలు ఉన్న పుదీనాని ప్రతి వారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ వుండడం ఎంతైనా శ్రేయస్కరం. ఇది చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క. కనుక స్థలాభావం దీనికి ఉండదు. పెంపకానికి ఎంతో అనువుగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications