Latest Updates
-
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి!
యోగా వల్ల ఆశ్చర్యకరమైన..అద్భుతమైన 10 ఆరోగ్య లాభాలు...!
యోగా అంటే అసాధ్యమైన భంగిమలలో మన శరీరాన్ని వంచడమే కాదు. మనసు, శరీరాల సంయోగంతో శ్రద్ధగా యోగా చేస్తే మీకు చాలా ఆరోగ్య లాభాలు అందిస్తుంది.
రక్త పోటు సాధారణం అవడం, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడ౦ కొలెస్టరాల్ నియంత్రణ లాంటి ఎన్నో అద్భుతమైన అనుకూల ప్రభావాలు కల యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన వ్యాయామ విధానం అయింది. బరువు తగ్గడానికి మంచి మార్గమైన యోగా అందంగా, ఆరోగ్యంగా వుండే శరీరాన్ని ఇస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా, మానసిక ఆనందం ఇచ్చే మార్గం యోగానే.
యోగా వల్ల కొన్ని లాభాలివిగో :

బరువు తగ్గడానికి : బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చాలా మంది బరువు తగ్గాలనుకొనే వారీ డైయట్ ప్లాన్ ప్రకారం ఇది వారిలో చాలా అద్భుతమైన ఫలితాలను చూపించింది. ఒక సారి డైయట్ ప్లాన్ ను వదిలేసారంటే తిరిగి మళ్ళీ అతి సులభంగా బరువు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ డైయట్ ప్లాన్ తో పాటు రెగ్యులర్ యోగా సాధన చేస్తే మీరు తప్పనిసరిగా అధిక బరువును కోల్పోయి స్లిమ్ గా మారవచ్చు. దాంతో ఎల్లప్పుడూ ఒకే బరువును మెయింటైన్ చేయవచ్చు.

గర్భిణీలకుగర్భిణీలకు యోగా :
మీరు గర్భం ధరించినట్లయితే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీరు నిత్యం యోగ సాధన చేయాలి. గర్భం ధరించి వుండగా యోగ సాధన చేస్తే మీరు బాగా బలంగా వుంటారు. నిత్యం యోగా చేయడం వల్ల అలసట, ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ, జీర్ణ క్రియ, శ్వాస క్రియ మెరుగవుతాయి, నాడీ వ్యవస్థ కూడా నియంత్రణలోకి వస్తుంది. మరోవంక, గర్భిణీ గా వున్నప్పుడు వుండే నిద్ర లేమి, నడుము నెప్పి, కాళ్ళు పట్టేయడం, అజీర్ణం చేయడం లాంటి సమస్యలనుంచి కూడా బయట పడవచ్చు. కానీ తరువాత ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలంటే యోగా చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

మానసిక ప్రశాంతత :
శ్వాస క్రియ మీద, సమతౌల్యం తెచ్చే ఇతర ఆసనాల మీదా యోగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మెదడు లోని రెండు భాగాలు సమన్వయంతో పని చేసి సమతూకాన్ని నిలబెడతాయి. దీని వల్ల మన దైనందిన కార్యక్రమాల్లో సాధారణంగా పట్టించుకోకుండా వుండే మెదడు లోని రెండు భాగాలను ఉపయోగించుకుని, అంతర్గత సంభాషణ పెంచుకోగలుగుతాము. యోగ సాధన చేయడం వల్ల మీ ఆలోచనాత్మక మెదడుకు, సృజనాత్మక మెదడుకు మధ్య సమన్వయం పెరుగుతుంది.

సాధారణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది :
మంచి ఆరోగ్యం అంటే రోగం లేకపోవడమే కాదు, నిజానికి మన మనసుకు, భావోద్వేగాలకు మధ్య సమతౌల్యం కలిగి వుండడం కూడా. యోగ సాధన చేస్తే మొత్తం మీద ఆరోగ్యం చేకూరి వివిధ రోగాలకు మిమ్మల్ని దూరంగా వుంచి, మిమ్మల్ని చురుగ్గా, ఆనందంగా, ఉత్సాహంగా తయారు చేస్తుంది.

మంచి రక్త ప్రసరణ :
వివిధ యోగ భంగిమలు, శ్వాస ప్రక్రియల సంయోగంతో, యోగా మీ శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. రక్త ప్రసరణ బాగుంటే, ప్రాణ వాయువు, ఇతర పోషకాలు శరీరంలో చక్కగా సరఫరా అయి ఆరోగ్యకరమైన అవయవాలు, మెరిసే చర్మం కలిగి ఉండేలా చేస్తాయి.

చదునైన పొట్టకు యోగా :
యోగా వల్ల చదునైన పొట్ట ఎలా వస్తుందో తెలుసుకునే ముందు, యే ఒక్క వ్యాయామం వల్లా మీకు చదునైన పొట్ట రాదని మీరు తెలుసుకోవాలి. తక్కువ సమయంలో పెద్దగా శ్రమ పడకుండా అధిక కొవ్వును తగ్గించడం సాధ్యమని మీకు ఎవరైనా చెప్తే, మీరు మరో నిపునణుడిని సంప్రది౦చాల్సిందే. మీకు ఇప్పటికే చదునైన పొట్ట వుంటే నిత్యం సాధన చేస్తే యోగా లో నౌకాసనం, ఉష్ట్రాసనం, ఇంకా కొన్ని మౌలిక భంగిమలు దాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి. యోగ సాధన చేస్తూ సరైన ఆహార ప్రణాళిక పాటిస్తే మీ పొట్ట తగ్గిపోయే అవకాశం వుంది.

ఆరోగ్యకరమైన గుండె :
స్వల్ప కాలం పాటు శ్వాస నిలిపి ఉంచే వివిధ ఆసనాల వల్ల మీ గుండె, ధమనులు చురుగ్గా పని చేస్తాయి. యోగా వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి, రక్తం గడ్డ కట్టకుండా వుంటుంది, కనుక ఆరోగ్యకరమైన గుండె మీ సొంతం.

నొప్పులను నివారిస్తుంది :
యోగా శక్తిని, సరళతను ఇస్తుంది కనుక, అది మీకు వెన్ను నెప్పి, కీళ్ళ నెప్పులు రాకుండా నివారిస్తుంది. డెస్క్ దగ్గర ఉద్యోగాలు చేసే వారు, నిత్యం ఎక్కువ దూరం వాహనాలు నడిపేవారు నిత్యం యోగా చేయాలని సునీత చెప్తున్నారు - ఎందుకంటే అది వెన్ను పూసలో ఒత్తిడిని, బిగుతును తగ్గిస్తుంది. పైగా అది మీ శరీరాకృతి మెరుగయ్యేలా చేస్తుంది, దాని వల్ల అసమ శరీరాకృతి వల్ల వచ్చే వివిధ నెప్పులు రాకుండా వుంటాయి.

మెరుగైన శ్వాస క్రియ :
యోగాలో భాగంగా దీర్ఘంగా, నెమ్మదిగా చేసే వివిధ శ్వాస క్రియల వల్ల ఊపిరితిత్తులు, ఉదార భాగాలకు సామర్ధ్యం పెరుగుతుంది. దీని వల్ల దైనందిన పనితీరు మెరుగు పడుతుంది, సహన శక్తి పెరుగుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల కూడా విశ్రాంతి కలిగి శారీరిక, మానసిక ఒత్తిడి నుంచి కోలుకునేలా చేస్తుంది.

సమతౌల్యం మెరుగౌతుంది :
సరైన భంగిమ లేకపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ మనం సమతౌల్య కోల్పోతాం. నిత్యం చేసే పనుల్లో శారీరిక కదలికలు లేకుండా స్తబ్దుగా వుండే జీవన శైలి వల్ల ఇలా జరుగుతుంది. దీని వల్ల పడిపోవడం, ఎముకలు విరగడం, వెన్ను పూస ఆరోగ్యంగా లేకపోవడ౦ లాంటి చాలా సమస్యలు వస్తాయి. యోగా వల్ల మనం కోల్పోయిన ఈ సమతౌల్యాన్ని, కీలకమైన నియంత్రణను తిరిగి పొందవచ్చు. మీ బలాన్ని, సరళతను పెంచి యోగా మీకు సమతౌల్యంగా వున్నారనే భావన కలిగిస్తుంది. ఈ మార్పు వల్ల మీ మెదడు చురుగ్గా పని చేసి మీ భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి వస్తుంది.

ఒత్తిడి తగ్గడం :
యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా తీరిక లేని పనులు చేసాక, మీరు యోగా చేస్తే ఒత్తిడి తగ్గిపోవడం మీరు గమనించవచ్చు. నిజానికి, యోగా మాత్రమె ఒత్తిడిని తగ్గించే ఏకైక వ్యాయామం అని దీని ఉద్దేశ్యం కాదు. ఏ వ్యాయామం అయినా, శ్రద్ధగా సాధన చేస్తే, సరైన విధానంలో, సరైన శ్వాస క్రియతో చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.



Click it and Unblock the Notifications