Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఆఫీసులో పని ఒత్తిడి.. మెడ నొప్పితో సతమతం అవుతున్నారా..!

కీలకం.. డిస్క్‌లు: మెడ దగ్గర ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలుంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అనీ, రెండవ వెన్నుపూసను ఆక్సిస్ అనీ అంటారు. ఆ తరువాత 3, 4, 5, 6, 7 వెన్నుపూసలుంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమరి ఉంటాయి. వీటిలో స్పైనల్ కెనాల్ ఉంటుంది. దానిద్వారా వెన్నుపాము మెదడు నుంచి కాళ్లూ చేతులకు నరాలను తీసుకెళ్తుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఇంటర్ వర్టివూబల్ పారామినా నుంచి ఒక్కొక్క నరం బయటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కో వైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండి డిస్క్ అనే మెత్తని పదార్థం యాంత్రిక షాక్స్ నుంచి వెన్నుపామును రక్షిస్తూ ఉంటుది. దీనికి రక్తవూపసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తల బరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది దోహదపడుతుంది.
ఈ లక్షణాలుంటే: కొన్ని సందర్భాల్లో తీవ్రమైన మెడనొప్పి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరగడం వల్ల మూత్ర విసర్జన కండరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ల వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసలో నుంచి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టివూబల్ ధమనులు చిన్న మెదడుకు రక్త ప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ధమనుల రక్తవూపసారంలో తేడాలు వచ్చి మెదడుకు రక్తవూపసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తల తిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటాయి. మెడనొప్పి పాకుతూ ఉంటే దాని వెనుక తీవ్రమైన కారణమే ఉంటుందని అనుమానించాలి. మెడ నుంచి భుజాల వైపో, చేతుల చివరలకో నొప్పి పాకుతూ ఉంటే అశ్రద్ధ చేయకూడదు.
వ్యక్తిగత శ్రద్ధ అవసరం:
1. మెడనొప్పి వచ్చినప్పుడు వేడినీటిలో ముంచిన గుడ్డతో మెడపైన కాపాలి. లేదా ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపవచ్చు. ఇలా చేయడం వల్ల సాధారణ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
2. మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందువల్ల నొప్పి ఉన్నప్పుడు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
3. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.
4. సాధారణ నొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకి అయిదారుసార్లు సున్నితంగా మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
5. బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకుని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. కాబట్టి అటూ ఇటూ మార్చుకుంటూ ఉండాలి. అసలే నొప్పి ఉన్నవాళ్లు ఎక్కువ బరువు మోయకుండా ఉండటం మేలు.
6. నడిచేటప్పుడు ఒక వైపుకే వంగకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications