Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటే ఇదే కాబోలు...!
ఉల్లిపాయ ఉపయోగించకుండా ఎన్ని రకాలు వంటకాలు వండుతారు? చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఉల్లిపాయ వాడని ఇల్లంటూ ఉండదు కాబట్టి. ప్రతి ఇంట్లోనూ వివిధ రకాల వంటకాలలో విరివిగా వాడుతారు. భారతీయ వంటలలో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా వాడతారు. ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉల్లిపాయలు వివిధ రంగుల్లో ఉదా: రెడ్, ఎల్లో, వైట్ మరియు గ్రీన్ కలర్స్ లో లభ్యం అవుతాయి. అవి ప్రత్యేక రుచి మరియు వాసన కలిగి ఉంటాయి. కొన్ని బలంగా ఉండి తీపి కలిగి ఉంటాయి. ఉల్లిపాయలను అలాగే పచ్చివి కూడా తినవచ్చు. అందుకే చాలా రకాల సలాడ్స్, రైతా వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంతే కాదు వీటిని ఉడికించి, ఫ్రై చేసి మరియు రోస్ట్ చేసి వివిధ రకాలుగా ఉపయోగించుకుంటారు.
ఉల్లిపాయను అత్యధిక ఔషధ విలువలు కలిగిన అత్యధిక విలువైన మూలికగా పిలుస్తారు. లాభదాయక లక్షణాలు కలిగి ఉండటవల్లే వీటిని ప్రాచీన కాలం నుండీ కొన్ని ఔషదాలుగా ఉపయోగిస్తున్నారు. స్వీట్ ఆనియన్స్ కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి కొన్ని రకాలైన జబ్బులను నివారిస్తాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు, నివారించేందుకు, క్యాన్సర్, ఇతర ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి బాగా సహాయపడుతాయి.

రెగ్యులర్ గా ఉపయోగించే ఉల్లిపాయల కంటే స్వీట్ ఆనియన్స్ కు డిమాండ్ ఎక్కువ. డిమాండ్ కు తగ్గట్టే ఇవి తియ్యగా, రుచికరంగా ఉండటంతో పాటు ఘాటైనే వాసనను కలిగి ఉంటాయి. రెగ్యులర్ గా మనం ఉపయోగించే ఉల్లిపాయల్లాగానే స్వీట్ ఆనియన్స్ లో కూడా అనేక రకాల ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అంతే కాదు ఇవి రెగ్యులర్ ఆనియన్స్ కంటే తాజాగా ఉంటాయి. స్వీట్ ఆనియన్స్ సంవత్సరంతా ఉండవు. వీటికి ఒక సీజన్ ఉంది వస్తే వింటర్ లో లేదా సమ్మర్ లో మాత్రమే ఇవి మనకు అందుబాటులో ఉంటాయి.
స్వీట్ ఆనియన్స్ రెగ్యులర్ గా మనం వినియోగించే ఉల్లిపాయల కంటే చాలా రుచికరంగా ఉంటాయి. అందుకే వీటిలో అధికంగా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది . ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది . దీనిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. రుచి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది అనడానికి ఈ క్రింది పాయింట్సే నిదర్శనం.
1.పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట (Acidity) వస్తుంది .
2. మూర్ఛ వచ్చిన ప్పుడు ఉల్లిపాయ రసాన్ని రెండు మూడు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే తెలివి వస్తుంది.
3. వేసవికాలంలో ఉల్లిపాయలను మాలగా గుచ్చి చిన్న పిల్లలకు మెడలో వేస్తే వడదెబ్బ తగలదు. పెద్దవారు కూడా ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు ఒకటి రెండు ఉల్లిపాయలను తలమీద ఉంచుకుని, టోపీ పెట్టుకుని తిరిగితే వడదెబ్బ తగలదు.
4. ఉల్లిపాయ రసం, ఆవనూనె సమంగా కలిపి వేడి చేసి మర్దన చేస్తే అన్ని రకాలైన నొప్పులు తగ్గుతాయి.
5. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజూ ఉదయంపూట తింటే రాళ్లు కరిగిపోతాయి.
6. దంతాలు నొప్పిగా ఉండి, దంతాలనుంచి రక్త కారుతుంటే, ఉల్లిపాయలను పేస్టులాగా నూరి దంతాలపై రాస్తే వెంటనే నయమవుతుంది.
7. ఉల్లిపాయల రసం, తేనె సమంగా కలిపి వేడి చేసి ప్రతి ఉదయం తీసుకుంటే వీర్యపుష్టి కలుగుతుంది.
8. జ్వరం, దగ్గు, అజీర్ణం, కడుపు నొప్పి, అతిసార, ఆర్శమొలలు మొదలైన వ్యాధుల్లో ఉల్లిపాయలను ఇతర అనుపానాలతో కలిపి తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి.
9. ఉల్లిపాయల పువ్వుల్ని తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చును. కంటి దృష్టి సమస్యలను దరిచేరనివ్వదు.
10. నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు వంటింటి చిట్కాను ఉపయోగించవచ్చు. ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రం తీసుకొని అందులో రెండు స్పూన్‌ల చక్కర చేర్చి ఇస్తే పిల్లలకి మంచి నిద్రవస్తుంది.
11. అలాగే, చిన్న పిల్లలకు వచ్చే టాన్సిల్ వ్యాధికి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి తినాలి. తర్వాత గోరు వెచ్చని నీటిని తాగించినట్టయితే వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
12. మరికొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారు ఉల్లిపాయ రసం తీసుకొని వేడిచేసి చలార్చిన తర్వాత చెవిలో వేసినట్టు అయితే చెవి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగినట్లైతే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడుతుంది.
13. ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లైతే వెంటనే రక్తం రావటం ఆగిపోతుంది.
14. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు... రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే అతి తక్కువ ధరలో దొరికే ఉలిగడ్డలను వైద్య, ఆరోగ్య సంస్థలు ట్యాబ్లెట్స్ తయారీలో వాడుతున్నాయి.
15. బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్, డయేరియా రాకుండా కాపాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications