Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నిమ్మ జ్యూస్ తాగితే అనేక వ్యాధులకు గుడ్ బై చెప్పొచ్చు..!
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం. నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక పానీయంగా భావిస్తారు. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు. నిమ్మ కాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతూంటాయి. నిమ్మరసాన్ని మన దేశ వంటలలో రుచికిగాను విరివిగా వాడుతూంటారు. అంతేకాదు, నిమ్మకాయను ఔషధంగా కూడా కొన్ని అనారోగ్యాలకు ఉపయోగిస్తారు.
కొన్నిరకాల అనారోగ్యాలు నివారించాలన్నా.. వంటకాలకు అదనపు రుచినివ్వాలన్నా.. చింతపండుకు ప్రత్యామ్నాయం వాడాలన్నా.. టక్కున గుర్తొస్తుంది నిమ్మకాయ. విటమిన్ 'సి'తో పాటు అదనపు పోషకాలనందించే నిమ్మ మరెన్నో విధాలుగా మేలుచేస్తుంది.
నిమ్మకాయను వంటకాలలో రుచికి వాడతారు. నిమ్మరసం కొద్దిగా పిండితే చాలు పదార్ధాల రుచి మారిపోతుంది. ఇక చికెన్, మొదలైన ఆహారాలలో నిమ్మరసం వాడని వారుండరు. నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఆరోగ్యకర పానీయంగా తాగుతారు. ప్రత్యేకించి ఉదయంవేళ ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. పాలు లేకుండా టీ తాగేవారు కొద్దిగా నిమ్మరసాన్ని, తేనెను చేర్చి తాగుతారు.
ప్రతిరోజూ నిమ్మరసం తాగుతూ వుంటే... వచ్చే ప్రయోజనాలు పరిశీలించండి.

జీర్ణ వ్యవస్ధకు మంచిది - జీర్ణక్రియ సమస్యలు పరిష్కరించబడుతాయి. అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట, కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటివి రాకుండా వుంటాయి. పురాతన కాలంలో మీ తల్లులు అమ్మమ్మలు జ్వరం వచ్చినా లేక పొట్ట గడబిడ అయినా ఒక్క గ్లాసు నిమ్మరసంతో వాటిని తగ్గించేవారని మీరు వినే వుంటారు.

చర్మ కాంతి - నిమ్మరసం చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని సంరక్షించి చర్మ కాంతిని కలిగిస్తుంది. నిమ్మరసం రోజూ తాగితే, ఆరోగ్యం మెరుగుపరచి వయసు కనపడనివ్వకుండా కూడా చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు ఉన్నాయి. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగారింపు వచ్చేలా చేస్తుంది.

బరువు తగ్గేందుకు - చాలామంది బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు. ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

గొంతు సమస్యలు - గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి. గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ కలిగి ఉండటం వల్ల గొంతు సమస్యలు కలిగించే జర్మ్స్ ను చంపేస్తుంది. వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.

అధిక రక్తపోటు నియంత్రణ - గుండె జబ్బుల సమస్యలున్నవారికి నిమ్మ రసం నీరు, దీనిలోని పొటాషియం కారణంగా ఎంతో బాగా పని చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి పోగొట్టి మైండ్ కు శరీరానికి విశ్రాంతినిస్తుంది. నిమ్మరసంలో ఉండే బయోఫ్లేవినాయిడ్లు రక్తనాళాలకు బలం చేకూరుస్తాయి. తద్వారా అంతర్గత రక్తవూసావం కాకుండా నివారిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవాళ్లకు నిమ్మ చాలా మంచిది.

దంతాలను మెరిపిస్తాయి: నిమ్మతొక్కతో దంతాల మీద స్ర్కబ్(రుద్దడం)వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్(దంతావదానం/పళ్ళు రుద్దుకోవడం)చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.

నోటి దుర్వాసన: నోటి నుంచి దుర్వాసన వస్తుంటే నిమ్మరసంలో తగినంత ఉప్పు, చిటికెడు వంటసోడా కలిపి దంతాలు రుద్దుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.

గర్భిణీ స్త్రీలకు: గర్బిణులకు వచ్చే వేవిళ్ల సమస్య తగ్గాలంటే నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి ఇవ్వాలి. అధిక రక్తస్రావం, విరేచనాలను అరికట్టే శక్తి నిమ్మ సొంతం. మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.

జ్వరం: తల తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు, శరీరంలో లవణాలు బాగా తగ్గినప్పుడు నిమ్మరసం ఇస్తే త్వరగా కోలుకుంటారు. జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసంతోపాటు, పళ్లరసాలు ఇస్తే ఆ తీవ్రత త్వరగా తగ్గుతుంది.

వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది: నిమ్మను నిత్యావసరంగానే కాదు.. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. నిమ్మరసంలో తేనె కలిపి పుచ్చుకుంటే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. నోట్లో పుండ్లు, పూత.. వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధమిది. రక్తంలో కొవ్వు పేరుకొన్నప్పుడు ప్రతిరోజూ తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది. దీనిలోని సిట్రిక్ ఆమ్లం, యాంటీసెప్టిక్ సుగుణాలు కడుపులో సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.

శ్వాసకోశ సమస్యలను: నిమ్మ ముక్కు (నోస్) లో వుండే నరాలను ఉత్తేజపరిచి అలసటను పోగొడుతుంది.

ప్రయాణంలో అసౌకర్యాన్ని పోగొడుతుంది: ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం.

పచ్చకామెర్లు: రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం త్రాగితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది.

వేసవి తాపం/వడదెబ్బ: వడదెబ్బ నిమ్మనీళ్ళలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.

చర్మ క్యాన్సర్: గజ్జి, తామర, చుండ్రు, పొడలు, వ్రణాలు, మొటిమలు, కుష్టు మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.

వంటకాల్లో: వివిధ వంటకాలల్లో నిమ్మకాయను ఉపయోగించవచ్చు. పచ్చి కూరలు సన్నగా తురిమి వాటిలో నిమ్మకాయ పిండుకుని తింటే, ఆరోగ్యం, రుచి రెండూ లభిస్తాయి.

షోడా/ షర్భత్: ఎండా కాలంలో నిమ్మ రసం కలిపిన షోడ ఉపయోగం తెలియని వారుండరు. నీమ్మ తో షర్బత్ లు, నిల్వ వుండే పానీయాలు తయారు చేస్తారు. ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాల త్వరగా శక్తి వస్తుంది. అందుకే నిరాహార దీక్ష విరమించె వారు నిమ్మ రసంతో దీక్ష విరమిస్తారు.

పెద్దప్రేగు క్యాన్సర్ ను అడ్డుకొంటుంది: తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ అనామ్లజనకాలతో పోరడాకలిగే శక్తి ఉండి, పెద్ద పేగుకు క్యాన్సర్ కు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.

కేశ సంరక్షణ: శిరోజ సంరక్షణకు కూడ నిమ్మ ఎంతో మేలు చేస్తుంది.

మలబద్దకం: మలబద్దకం తగ్గి మోషన్ ఫ్రీగా అవుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది: ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది సాధారణ సమస్యగా మారింది. అందుకు కారణం తక్కుగా నీళ్ళు తాగడం, క్యాల్షియం అధికంగా ఉండటం చేత కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అలాగే యూరిన్ ఎక్కువ సేపు పోకుండా అలాగే ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏమికాదు క్యాల్షియం నిక్షేపాలు నిల్వ ఉంటాయి. వీటిని కిడ్నీస్టోన్స్ అంటాం. కాబట్టి వాటిని కరిగించడానికి ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరంలో అధిక కాల్షియంను తొలగించడానికి నిమ్మకాయం బాగా పనిచేస్తుంది.

మొదడు: నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇది సోడియంతో కలిసి మెదడు, నాడీవ్యవస్థల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో పొటాషియం నిల్వలు తగినన్ని ఉంటే మానసిక ఆందోళ న, ఒత్తిడి, మందకొడితనం, మతిమరపు మన ఛాయలకు కూడా రావు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.

కీళ్ళ/ఎముకల నొప్పి: నిమ్మరసం యూరిక్ యాసిడ్‌ను పలుచన చేసి, కీళ్లనొప్పులు, గౌట్స్ వంటి రుగ్మతల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications











