Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చిన్నికృష్ణుడు తిన్న వెన్నలో ఉన్న అత్యంత విశేషాలు..!
వెన్నను చూస్తే గుర్తుకువచ్చేది చిన్నికృష్ణుడే. ఒకప్పటిలా కవ్వం, వెన్నకుండలు కనిపించడం లేదు గానీ వెన్నను చూస్తే తినకుండా ఉండలేం. దీన్ని వంటల్లో చేర్చితే ఎంత రుచో... సౌందర్య సాధనంగా అంత గొప్ప ఫలితాలనే ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ఔషధంగా కూడా వెన్న ఉపయోగపడు తుంది. సాధారణంగా చాలా మందికి పప్పు, పచ్చళ్లలో వెన్నను నంజుకు తినే అలవాటు ఉంది. అంతే కాకుండా కొంత మంది అప్పుడప్పుడు కూడా వెన్న తింటూనే ఉంటారు. ఇటీవల చాలా మంది వెన్నలో కొవ్వుపాళ్లు ఎక్కువని, దాని వల్ల ఆరోగ్యానికి నష్టమని వెన్నను తినడం చాలా వరకూ తగ్గించేశారు. అయితే వెన్న తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పనిసరిగా వెన్న తినకుండా ఉండలేరు.
స్వాభావికంగా లభించే ఏ ఆహార పదార్థం కూడా పరిమితులకు లోబడి తీసుకుంటే హానికరం కాదు. ఏదైనా పరిమితికి మించి తినడం అన్నది అనర్థదాయకం అవుతుంది. అందుకే అతి సర్వత్ర వర్జయత్ అనే సామెత పుట్టింది. అపరిమితంగా వెన్న తినడం వల్ల జరిగే అనర్థాల గురించి మీరు వినే ఉంటారు కాబట్టి మీ భయాందోళనలు తొలగించడానికి మీరు మీ ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే అందం, ఆరోగ్యం గురించి తెలుసుకుందాం..

వెన్న: ఆహార పదార్థంగా వెన్న వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి.

మంచి మూడ్ కోసం: వెన్నతో తయారు చేసిన చాక్లెట్ వంటివి తినడం వల్ల మూడ్ మారుతుంది. ఉదయం వేళల్లో వెన్న తినడం వల్ల, బద్దకం తగ్గి హుషారుగా ఉండి ఆ రోజు దినచర్యలన్ని చకచకా పూర్తి చేయగలరు.

థైరాయిడ్: ఇందులో ఉండే విటమిన్ ఎ ఢైరాయిడ్ గ్రంథి క్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. వెన్న తినడం వల్ల బరువు పెరుగుతారని అపోహ పక్కన పెడితే. థైరాయిడ్ ఉత్పత్తి తక్కువ అవ్వడం వల్ల హైపోథైరాయిడ్ కు కారణం అవుతుంది.

కిడ్స్ బ్రెయిన్ డెవలప్ మెంట్: వెన్నలో ఉండే కొలెస్ట్రాల్ మరియు క్రొవ్వులు పిల్లల్లో బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. అందువల్లే పిల్లలకు వెన్నవల్ల చాలా రకాల పోషకాలను అందించవచ్చు.

శరీరానికి కావల్సిన శక్తినందిస్తుంది: బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల (మెంటల్ ఇల్‌నెస్) నుంచి రక్షణ కల్పిస్తుంది. దాంతోపాటు మనకు శక్తి వనరుగా ఉపయోగపడుతూ అవసరమైన శక్తిని ఇస్తుంది. మనం తిన్న ఆహారం చిన్న పేగుల నుంచి ఒంటికి పడుతుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా జరిగే క్రమంలో తిన్న ఆహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది బ్యుటిరేట్. అంటే ఒంటికి పట్టకుండా వృథా అయిపోయే ఆహారాన్ని వీలైనంతగా తగ్గిస్తుందన్నమాట.

వయస్సు పైబడనివ్వదు: వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. కాబట్టి ఇవి ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పించి వయస్సు పైబడనియ్యకుండా చేస్తుంది. అంతే కాదు వెన్నను యాంటీ ఏజింగ్ క్రీమ్ లా ఉపయోగించవచ్చు.

క్యాన్సర్: వెన్నలో ఉండే యాంటీయాక్సిడెంట్స్ వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి.

చర్మ రక్షణకు: నెయ్యి కంటే వెన్న చాలా శ్రేష్టమైనది. నిజానికి చిన్నప్పుడు మనం వెన్నపూస ఒంటికి మర్దనా చేసుకునే వాళ్లం. పెద్దైన తర్వాత కూడా వెన్న శరీరానికి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ పగుళ్ళనుండి ఉపశమనం పొందడమే కాదు, చర్మం నునుపుగా తయారవుతుంది. ముఖ్యంగా షీ బట్టర్, కోకబట్టర్ తప్పనిసరిగా ఉపయోగించాలి. చర్మవ్యాధులకు వెన్న దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

నిద్ర: మనం ముందే మాట్లాడుకొన్నాం, నరాలు విశ్రాంతి పొందడానికి మరియు మంచి నిద్రను పొందడానికి వెన్నలో సెలీనియం పుష్కంగా ఉంది.

గాయలను మాన్పడానికి: వెన్నలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో రక్తాన్ని గడ్డకట్టనివ్వదు. మరియు గాయాలను మాన్పడానికి బాగా సహాయపడుతుంది.

సంతానోత్పత్తికి: స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ సంతానోత్పత్తి పెంచడానికి వెన్న బాగా సహాయపడుతుంది. ఇది స్త్రీ పురుషులిద్దరిలోనూ సంతానోత్పత్తికి అవసరం అయ్యే హార్మోన్లను ప్రేరేపిస్తుంది. శరీరంలో బిడ్డగా రూపాంతరం చెందడానికి అవసరం అయ్యే వేడిని అందిస్తుంది.

యాంటీ ఫంగల్ లక్షణాలు: వెన్నలో శిలీంద్రనాశక గుణాలు అధికంగా ఉన్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నయం చేయడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా తగిలిన లేదా కాలిన గాయాను త్వరగా నయం చేస్తుంది. ప్రసవం తర్వతా తల్లికి లేదా ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకొన్నవారికి తప్పనిసరిగా తీసుకోవల్సిన డైయట్ లిస్ట్ లో వెన్నని కూడా చేర్చారు.

గుండె ఆరోగ్యానికి: వెన్నలో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) ఉండటం వల్ల మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

స్థూలకాయం: ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది. తద్వారా కొంతవరకు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

మలబద్దకం: ఎక్కువగా సీట్లో కూర్చుని పనిచేసే వారికి వచ్చే సాధారణ వ్యాధి మొలలు లేదా ఆర్ష మొలలు. ఈ వ్యాధినే 'పైల్స్' అని కూడా అంటారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే.. ఆవు వెన్న, నువ్వులు సమానంగా కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఒక వారం రోజులపాటు తినాలి. దీంతో మొలల వ్యాధి నశిస్తుంది.

నోటి శుభ్రత: వెన్న, తేనె మిశ్రమంతో నోటిని శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన, ఇతర రోగాలు మాయమవుతాయి.

కేశాలకు: వెంట్రుకల మృదుత్వానికి కూడా వెన్నను వాడుతుంటారు. కాస్మోటిక్ టానిక్‌గా ఇది పని చేస్తుంది.

ఇఫ్లమేషన్: చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది. జీర్ణశక్తి లేనివారు, పొట్టకు సంబంధించిన (ఉదర) వ్యాధులతో బాధపడేవారు, శ్వాస శే్లష్మ, భగంధర, జ్వర, వాంతి వికారాది దోషాలు గలవారు నెయ్యిని వాడకపోవటం మంచిది. వీరికి నెయ్యి ఇబ్బందిని కలిగించగలదు.
వెన్న ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే దీన్ని చల్లని ప్రదేశాల్లో అంటే ఫ్రిజ్‌లో తడిలేని ప్లాస్టిక్ బాక్స్‌లో భద్రపరచాలి. ఇలా అయితే రెండు మూడు నెలలు పాడవకుండా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలున్న వెన్న, నెయ్యి ఎన్నో రుచులకే కాదు ఆరోగ్యానికి, అందానికి నెలవు అనడంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications











