Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
నగ్నత్వంతో పొందే 10 అత్యుత్తమ ఆరోగ్య ప్రయోజనాలు
మీరు ఇంట్లోకి రాగానే బట్టలు విప్పేసి తల స్నానం చేయాలన్న ఆలోచన ముందుగా వస్తుంది. అదీ వేసవిలో అయితే బట్టలు లేకుండా, నగ్నంగా ఉండాలనిపిస్తుంది. మీరు ఊహించగలరా ? మీ పుట్టినరోజు సూట్ లోకి మారిపోవడం నిజంగా చాలా ఉపకరిస్తుంది, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి వుంది. నగ్నంగా ఉండడం కష్టమైతే, అతి స్వల్ప లేదా వదులుగా ఉండే దుస్తులు ధరించండి. మీకు సిగ్గుగా ఉండొచ్చు కానీ నగ్నంగా ఉండేకంటే ఇది మంచిది! ఇదేమీ అనాగరికం కాదు. నగ్నంగా నిద్రపోవడానికి ఇష్టపడేవారు చాలామందే ఉన్నారు.
కొన్నిసార్లు మీకు నగ్నంగా ఉండాలని ఎందుకనిపిస్తుందో, నగ్నంగా ఉండాలనే ఆలోచన వెనక వున్న ఆరోగ్యకర కారణాలేమిటో గుర్తించండి:

మీలో విటమిన్ D పుష్కలంగా ఉండేట్టు చేస్తుంది
ఎండ వల్ల మన చర్మానికి హాని జరుగుతుందేమోనని మనం చాలా సార్లు సన్ స్క్రీన్ బాగా పట్టిస్తాం. ఎండలో చాలా సేపు ఉంటేనే చర్మం పాడవుతుంది. ఉదయం వేళ 10-15 నిమిషాల పాటు ఎండలో వుండండి. దీని వల్ల మీ శరీరంలో విటమిన్ డి పుష్కలంగా పెరుగుతుంది, మీ మూడ్ కూడా బాగుంటుంది.

ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది
ఊపిరి తీసుకోవడానికి మన చర్మానికి గాలి కావాలి. బిగుతైన దుస్తులు ధరిస్తే మీ చర్మం బలహీన పడవచ్చు, ఎందుకంటే మీకు చెమట పట్టినప్పుడు బయటకు వచ్చే విష పదార్ధాలను మీ చర్మం మళ్ళీ పీల్చుకుంటుంది. నగ్నంగా వుండడం వల్ల మీ చర్మంలోంచి విష పదార్ధాలు పోయి చర్మం మళ్ళీ గాలి పీల్చుకుంటుంది.

ఎర్ర మచ్చలు వుండవు
బట్టలు లేకుండా వుండడం వల్ల మీ చర్మం మీద బిగుతైన బ్రా లేక పాంటీ లోని ఎలాస్టిక్ నుంచి పడే వత్తిడి వల్ల వచ్చే ఎర్రటి మరకలు పడవు. అలాగే కాసేపు బట్టలు కాసేపు తీసివేస్తే మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగౌతుంది.

ఆరోగ్యకరమైన మెదడు
అధ్యయనాల ప్రకారం - చెప్పులు లేకుండా పరుగెత్తడం అనేది పెద్దలలో అల్జీమర్ వ్యాధి రాకుండా సహాయపడుతుంది. చెప్పులు లేకుండా నడవడం, పరిగెత్తడం అనేది మన మెదడుకు కీలకమైన ప్రేరణను కలిగించడానికి దోహదపడుతుంది. కాలి మీద ఉత్పత్తి అయ్యే ప్రేరణ వల్ల మెదడు మరిన్ని న్యూరాన్ కనెక్షన్ లను కలిగిస్తుంది అని ముంబై జనరల్ ఫిజీషియన్ డాక్టర్. సునేసర చెప్పారు. అంతేకాకుండా, ఇది మెదడు ఫ్లెక్సిబిలిటీ ని కూడా పెంచడానికి సహాయపడుతుంది.

మీరు విశ్రాంతి పొందేలా చేస్తుంది
నగ్నంగా ఉండడం అనేది ఒత్తిడికి, ఆత్మన్యూనత కు, ఇతర మానసిక సమస్యలకు ఒక చికిత్స లాంటిది. నగ్నత్వం మీ రక్త ప్రసరణను మెరుగు పరిచి, మీ శరీరాన్ని విశారహితం చేసి ఉత్సాహాన్ని, స్వేచ్చను అందిస్తుంది.

అంటువ్యాధి సమస్యలను తగ్గిస్తుంది
బట్టలకు చెమట అ౦టుకున్నపుడు, ఆ ప్రదేశంలో బాక్టీరియా చేరి, వివిధ అంటువ్యాధులకు కారణమౌతుంది. నగ్నంగా ఉండడం అనేది మీకు వచ్చిన ఇలాంటి ప్రమాదకరమైన ఫంగల్, బాక్టీరియా వంటి సమస్యలను తగ్గించి, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండేట్టు చేస్తుంది.

ప్రజనన శక్తి పెరుగుతుంది
బిగుతైన ఎలాస్టిక్ అండర్ వేర్ ధరించడం వల్ల పురుషాంగం, జననేంద్రియ ప్రాంతంలో రక్తప్రసరణ ఆగిపోతుంది. బిగుతైన లోదుస్తులు లేదా తక్కువ నడుముగల జీన్స్ నేరుగా మీ జననాంగం పై ఒత్తిడి తెస్తాయి, నెమ్మదిగా ఆ ప్రాంత పరిసరాలలోని నరాల గ్రాహకాలు చంపబడి, వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది.

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది
ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, పొత్తికడుపు ప్రాంతంలో ఒత్తిడికి ఉపశమనం కూడా కలుగుతుంది. బిగుతైన కింది దుస్తులు రక్తప్రసరణను ఆపుతాయి, దీనివల్ల చర్మ౦ పై దద్దుర్లు కూడా వస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం, శరీరానికి, నగ్నంగా పడుకోవాలి! ఒక క్రమ పద్ధతిలో, బిగుతైన బట్టలను విడిచి పాడుకోవాలి. మీకు అసౌకర్యంగా ఉంటే, వదులైన దుస్తులు ధరించండి.

శృంగార వాంఛలు పెరగడం
నగ్నంగా ఉన్నపుడు శృంగార కోరికలు పెరుగుతాయి. మీ శరీరం కనిపిస్తుందని అనిపించినప్పుడు శృంగార వాంఛలు పెరుగుతాయి. అంతేకాకుండా, మీ పురుషుడు మిమ్మల్ని నగ్నంగా చూసి, అతను మీ దగ్గరకు రాకుండా ఉండలేడు.

మంచి నిద్ర
రాత్రిపూట మంచి నిద్రకోసం కొన్నిసార్లు నగ్నంగా ఉండాలి. బట్టలు లేకపోతే, మీరు మానసికంగాను శారీరకంగాను విశ్రాంతిగా భావిస్తారు.



Click it and Unblock the Notifications